Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
సంత్.గాడ్గే మహరాజ్ తో అనుభవం
యింతకు ముందు చెప్పినట్లుగా నా జ్ఞాపక శక్తిని విస్తరించుకునే ప్రయత్నం చేసి మహారాష్ట్రలో గొప్ప సాథువయిన గాడ్గే మహరాజ్ గారి గురించి తెలియచేస్తాను. ఆయన ఖార్ లో ఉన్న మా బంగళాకు తరచూ సాయంత్రమప్పుడు తనదైన ప్రత్యేకమయిన దుస్తులతో వస్తూ ఉండి మరలా వేకువజాముననే వెళిపోతూ ఉండేవారు. నేనాయనని స్వయంగా చూశాను. ఆయన రంగుల గుడ్డముక్కలతో కుట్టబడిన వస్త్రాన్ని థరించి తలకి ఒక గుడ్డ ముక్కని కట్టుకునేవారు. ఈ వేషధారణ వల్ల ఆయనని గోధాడీ మహరాజ్ , గొధడీ బాబా అని పిలిచేవారు. ఆయన కాళ్ళకు తోలు చెప్పులు వేసుకుని చేతిలో యెప్పుడూ వెదురు కఱ్ఱని తీసుకుని వెడుతూ ఉండేవారు. వెదురు కఱ్ఱకి అడుగున యినుపతొడుగు, కఱ్ఱ అరిగిపోకుండా బిగింపబడి ఉండేది.
ఆయన లార్డ్ విఠల్ (విష్ణుకి) పరమ భక్తుడు. యెప్పుడూ పాండురంగ…పాండురంగా…అంటూ ఉండేవారు. మహారాష్ట్ర అంతటా తన కీర్తనల ద్వారా సాయి మహిమను చాటిన దాసగణు మహారాజ్ ఆయనని మా కుటుంబానికి పరిచయం చేశారనుకుంటాను. గాడ్గే మహారజ్ గారి దృష్టి ముఖ్యంగా అట్టడుగు బీద ప్రజానీకానికి అన్ని విధాలుగా సహాయం చేద్దామని కేంద్రీకృతమయి ఉండేది. ఆయన వారికి శుభ్రత గురించిన ప్రాథాన్యాన్ని తెలియచేస్తూ తాను స్వయంగా ఆచరించి మహారాష్ట్ర అంతటా వీథులు ఊడ్చి, “‘పరిశుభ్రతే దైవం’ అనే నినాదంతో వివరిస్తూ ఉండేవారు. అదే, గ్రామాలని అంటు వ్యాథులబారి నుండి సురక్షితంగా ఉంచుతుందని గ్రామస్తులందరికీ ఆయన యిచ్చే సందేశం. ఈ క్రమంలో ఆయన థనవంతుల నుంచి ఆర్థిక సహాయం కూడా తెచ్చుకోగలుగుతూ ఉండేవారు. దానిని సేకరించి ఆయన గ్రామాల్లో అవసరయమయినవారికి పంచుతూ ఉండేవారు. సాయి బాబావారి మహాసమాథి తరువాత మా తాతగారు గాడ్గే మహారాజు సాథువుగారికి బట్టల తానులు విరాళంగా యిస్తూ ఉండేవారు. మా అమ్మగారు తన చేతులతో స్వయంగా ‘గొధాడీ’ కుట్టి గాడ్గే మహారాజ్ మాయింటికి వచ్చినపుడెల్లా ఆయనకు యిస్తూ ఉండేవారు. ఆయన ఆపుడు మా అమ్మగార్ని దీవించి, దానిని తన స్వంతానికి తీసుకుని వెడుతూ ఉండేవారు. ఆ కాలంలో ఉన్న అప్పటివారు అలా ప్రేమని, వాత్సల్యాన్ని, కురిపిస్తూ ఉండేవారు. ఈ రోజులలో కొనుగొనడం కష్టం.
యింతకు ముందు చెప్పినట్లుగా మానాన్నగారి చేత బలవంతంగా బంగళా కొనిపించడంలో సంత్ గాడ్గే మహరాజ్ కారకులు. ఆయన యెక్కువ సమయం కాలినడకనే అన్ని చోట్లకి తిరుగుతూ ఉండేవారు. ఖార్ లో ఆయన ఒక బంగళాని చూశారు. దానిని మా నాన్నగారు 1923 సం.లో మొత్తం మీద రూ.15,007/- లకి కొన్నారు. ఓల్డ్ ఖార్లో అప్పుడది ఒక్కటే ఏకైక కట్టడంగా ఉండేది. అక్కడినుంచి మేము రైల్వే స్టేషన్, మౌంట్ మారీ చర్చ్ మొదలైనవన్ని మా బంగళా మిద్దె మీంచి యెటువంటి అడ్డంకీ లేకుండా చూడగలిగేవారమని నాకు గుర్తు. యెప్పుడైనా గాడ్గే బాబా వచ్చినప్పుడు మా అమ్మగారితో, ప్రత్యేకమైన రోటీ, ‘జ్వారీ’ చేయమని ఆదేశించేవారు. ఆమె అలాగే ఆయన కోసం చేసేవారు. మేమంతా ఆ రాత్రికి ‘ఝుంకా భకార్’ తినేవాళ్ళం. ఆ పదార్థాల యొక్క గొప్ప రుచి మా జ్ఞాపకాలలో యిప్పటికీ ఉందంటే నమ్మండి. రాత్రి భోజనము ఆయిన తరువాత గాడ్గే బాబా సాథువు గారు, తాను వివిథ గ్రామాలకు చేసిన పాదయాత్రలలోని అనుభవాలన్నీ కలిపి మాకు వివరిస్తూ ఉండేవారు. గాడ్గే బాబా నిస్సందేహంగా సామాన్యమయిన వ్యక్తి కాదు. ఆయన భగవంతుని మరొక దూత. మా నాన్నగారు ఆయనతో కూడా పండరీపురం వెళ్ళినపుడు మా నాన్నగారికి కలిగిన దివ్యమైన అనుభవాన్ని మీకిప్పుడు వివరిస్తాను.
గాడ్గే బాబా పుణ్యక్షేత్రమయిన పండరీపూర్ కి యెప్పుడూ యాత్రకి వెడుతూ ఉంటారు. ఆయన పాండురంగనికి నిజమైన భక్తుడు. ఆయన తన ఖాళీ సమయంలో పాండురంగా…పాండురంగా…అని ఆయన నామ జపం యెప్పుడూ చేస్తూ ఉండేవారు. ఒకసారి మా నాన్నగారు ఆయనని ఆయన జీవితంలో యెప్పుడయినా లార్డ్ పాండురంగని కలుసుకున్నారా అని అడిగారు. గాడ్గే బాబా మా నాన్నగారిని తనతో కూడా పుణ్యక్షేత్రమయిన పండరీపూర్ కి రమ్మన్నారు. ఆయన మా నాన్నగారితో, సౌఖ్యవంతమయిన బంగళాలో ఉండేటటువంటి అన్ని సుఖాలకు దూరంగా అక్కడ ఒక యాత్రికునిలా ఉండాలని చెప్పారు. అప్పుడు మా నాన్నగారు గాడ్గే బాబా సాథువుతో కలిసి పండరీపురానికి రెండవసారి ప్రయాణం కట్టారు.
చంద్రభాగా నదీ తీరంలో ఉన్న యిసుకలో వారొక గుడారంలో బస చేశారు. రోజంతా ఆయన మహరాజ్ తో కూడా తిరుగుతూ, ఆయన శుభ్రపరిచే కార్యక్రమాలు యెలా చేస్తున్నారో యింకా ఆయన పీడిత ప్రజానీకానికి యిచ్చే సలహాలు, వారంతా ఆయన చుట్టూ గుమిగూడి ఆయన చేసే జ్ఞానోపదేశాలని ఓపికగా వినడం యివన్నీ ప్రత్యక్షంగా చూశారు. సంత్.గాడ్గే మహరాజ్ చేసే సామాజిక కార్యక్రమాల మీద మా నాన్నగారికి చక్కని అవగాహన వచ్చింది. సాయంత్రానికి వారు తమ గుడారానికి తిరిగి వచ్చారు. గుడారంలోపల మూడు పక్కలు, ప్రతీదాని మీద ఒక కంబళీ (నలుపురంగుతో) తో వేయబడి, గుడారం మథ్యలో ఒక కిరోసిన్ లాంతరు వేలాడుతూ ఉండటం గమనించారు. గాడ్గే బాబా మా నాన్నగారిని విశ్రాంతి తీసుకోమని, తాను బయటకు వెళ్ళి (గ్రామంలో దొరికే ప్రత్యేకమయిన అహార పదార్థం) తినడానికి ‘ఝంకా భకార్’ తెస్తానని చెప్పారు. మా నాన్నగారికి తెలుసుకోవాలనే కోరికతో ఆయనని ఖాళీగా ఉన్న మూడవ పక్క గురించి అడిగారు. గాడ్గే మహరాజ్ తాను చెప్పడం మరచాననీ, ఆ రాత్రికి తనకొక అతిథి వస్తాడనీ రాత్రికి ఉండి, ఉదయానికి ముందే వెళ్ళిపోతాడనీ చెప్పారు. ఆ అతిథి తమకు యెటువంటి యిబ్బందీ కలిగించడనీ చెప్పారు. తానెప్పుడు పండరీపూర్ వచ్చినా ఈ అతిథి రాత్ర్తికి తనతో కూడా ఉంటాడనీ చెప్పారు. యిది చెప్పి గాడ్గే మహరాజ్ గుడారం నుంచి బయటికి వెళ్ళారు. గుడారంలో త్వరగా చీకటి పడింది, అలాగే ఉష్ణొగ్రత కూడా పడిపోయింది. మా నాన్నగారు కునికిపాట్లు పడటం మొదలెట్టి నిద్రపోయారు. మా నాన్నగారి కోసం ‘ఝంకా భకార్’ తెచ్చిన గాడ్గే బాబా గారి పిలుపుతో మానాన్నగారు మేలుకొన్నారు. తాను తన అతిథితో అప్పటికే రాత్రి భోజనం చేసేశానని, మా నాన్నగారిని క్షమించమని చెప్పి, ఆయనకి చాలా ఆకలిగా ఉండవచ్చనీ భోజనం చేసేయమని చెప్పారు. ఈ లోపులో తాను నది ఒడ్డున తిరిగి వస్తానని చెప్పారు.
రేపు తరువాయి భాగం…
ఈ సమాచారం http://telugublogofshirdisai.blogspot.in/ ద్వార సేకరించబడింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు ఇరవై రెండో భాగం
- బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు ఇరవై మూడో భాగం
- బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు ఇరవైయవ భాగం
- బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు పదవ భాగం–Audio
- బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు పదహేడవ భాగం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments