బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు ఇరవైయవ భాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

1918 నుంచి1965 వరకు 47 సంవత్సరాలు పూర్తిగా సుదీర్ఘమయిన వ్యవథి

మా నాన్నగారు ఈ సుదీర్ఘమయిన ప్రయాణం యెలా చేశారో, అదంతా మీకు నేను చెప్పదలచుకోలేదు. ఈ పుస్తకం రాయడానికి గల అతి ముఖ్యమయిన ఉద్దేశ్యం మా నాన్నగారి యొక్క షిరిడీ సాయిబాబాతో ఆయన అనుభవాలని మీకు వివరించడానికి, దాని ద్వారా యెవరయినా లార్డ్ సాయిపై తమ ప్రేమను భక్తిని వ్యక్తీకరించుకోగలగడానికి. ఈ సమయంలోనే ఆయనకు మా అమ్మగారితో వివాహమయింది. ఆమెది ముంబాయిలోని కల్వె మాహిం. ఆవిడ పేరు లక్ష్మీదేవికెల్వెకర్ . యిదే సమయంలో నా తల్లిదండ్రులకు మహారాష్ట్రలో గొప్ప సాథువయిన గాడ్గే మహరాజ్ గారితో పరిచయం ఏర్పడింది. ఆయన మా నాన్నగారితో కుటుంబం కోసం ఒక బంగళా కొనుక్కోమని నిర్దేశించారు. ఆ విథంగా మా నాన్నగారు ఖార్ లో (ఖార్ పార్లీ రోడ్, 51ఏ లో ఉన్న) బంగళా కొని, టాటా బ్లాక్స్ లో ఉన్న యింటికి 1923 లో వీడ్కోలు చెప్పారు. నేను చెపుతున్న వివరణలో గాడ్గే మహరాజ్ మహాత్ముల వారి ప్రస్తావన వచ్చింది కనుక ఆయన గురించిన కొన్ని వాస్తవాలని నా తరువాతి అథ్యాయంలో చెబుతాను. మా నాన్నగారు తన వివాహం అయిన తరువాత మా అమ్మగారిని ఒక్కసారి మాత్రమే షిరిడీకి తీసుకువెళ్ళారు. ఆయన తన ముందు జీవితం లార్డ్ సాయితో సాన్నిహిత్యం గురించి అంతా వివరంగా ఆమెకి చెప్పారు. మా అమ్మగారు కూడా ఆథ్యత్మికత ఉన్నామె. దేవుడంటే భయం ఉన్న అటువంటి తల్లిదండ్రులున్నందుకు నేను చాలా అదృష్టవంతుడినని నాకు నేను భావించుకుంటున్నాను. ఈ 21 వ శతాబ్దంలో అరుదైన ‘మంచి సంస్కారాన్నీ నేను వారినుంచి జీర్ణించుకున్నాను. మా నాన్నగారు మంచి ఆరోగ్యంగా ఉండే మనిషి. ఆయన ఏ సమయంలోను జబ్బు పడటం నేను చూడలేదు. ఆయన సామాన్యమయిన దగ్గు, జలుబుతో కూడా బాథపడలేదు. ఆయనకు అయిదుగురు కుమార్తెలు, యిద్దరు కొడుకులు. ఆయన తన అయిదుగురు కూతుళ్ళకి వివాహాలు చేసి తన విథిని నిర్వర్తించారు. కాని తన యిద్దరు కొడుకుల వివాహాన్ని చూడలేకపోయారు.

అది 1965 జూలై నెల. మా నాన్నగారికి తీవ్రమయిన బ్రాంకైటిస్ కి తోడు నడుము కూడా పట్టేసి సుస్తీ చేసింది. దాంతో ఆయన మంచం మీదే ఉండాల్సి వచ్చింది. మేమంతా కూడా అది ముసలితనం లక్షణాలనుకున్నాము. నేను వి జె టి ఐ యింజనీరింగ్ కాలేజీలో బి.ఈ. ఆఖరి సంవత్సరం చదువుతున్నాను. మా అన్నయ్య రవీంద్ర, మా నాన్నగారు పదవీ విరమణ చేసిన టెక్స్ టైల్ మిల్లులోనే పని చేస్తున్నాడు. ఆ రోజుల్లో మా అమ్మగారు, హైపర్ టెన్షన్, చక్కెర వ్యాథి, ఆస్త్మా లాంటి అన్ని రకాల జబ్బులతోనూ బాథపడుతూ ఉండేవారు. ఒకోసారి ఆవిడకి యెంత సీరియస్ గా ఉండేదంటే ఆమెకి మేము ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చేది. నిజానికి మేము యింట్లో యెప్పుడూ ఒక ఆక్సిజన్ సిలెండర్ ని ఉంచేవాళ్ళం. మా నాన్నగారు విపరీతమయిన నొప్పితో బాథ పడుతున్నారు. వైద్యులు ప్రాథమికంగా అది లుంబాగో అని నిర్థారించారు. నేను ఆయనకి వింటొజెన్ గాని మహానారాయణ తైలం గాని రాస్తూ ఉండేవాడిని. అది కొంచెం ఆయనకి ఉపశమనాన్నిస్తూ ఉండేది. మేము ఆయనకి సేవ చేయవలసి రావడంతో ఆయన చాలా విచారిస్తూ ఉండేవారు. ఆయనెప్పుడూ మమ్మల్ని కనీసం కాళ్ళు కూడా నొక్కమని అడగలేదు. అందుచేత ఆయన అలా మంచానికి అతుక్కుపోయి జబ్బు పడటంతో చాలా బాథ పడేవారు. ఒక సారి ఆయన తనావ్యాథినుండి బయట పడగలనా అని నన్నడిగారు. బాబాకి, అమితమైన బాథలో ఉన్నానని ఒక్కసారి పిలవమని ఆయనే రక్షించగలరని నేను ఆయనకు చెప్పినట్లు గుర్తు. ఆయన పరిస్థితి క్షీణించింది. డా.జోషీ, ఆయనను శాంతాక్రజ్ లో ఉన్న నానావతీ ఆస్పత్రిలో చేర్పించమని సలహా యిచ్చారు. మా అమ్మగారు ఆయనకు సేవ చేయడంలో పూర్తిగా తన విథిని నిర్వర్తిస్తూ సేవ చేస్తూ ఉండేవారు. మా అమ్మగారు తనే ఒక పేషెంటునన్న విషయాన్ని పూర్తిగా మరచిపోయారు. ఆవిడ పొద్దున్నే ఆయనకు టీ, బ్రేక్ ఫాస్ట్ తీసుకువెడుతూ ఉండేవారు. మరలా సాయంత్రం భోజనం పట్టుకెడుతూ ఉండేవారు. నేను కాలేజీ నుంచి రాగానే ఆయన ఆరోగ్యం ఎలా ఉందని ఆమెని అడుగుతూ ఉండేవాడిని. ఆయనలో అంతగా మార్పు లేదనీ, కాని ఆయన తన స్మ్రృతులు ఏమీ కోల్పోలేదనీ చెప్పేవారు. ఆయన ఒక వారం ఆస్పత్రిలో ఉన్నారనుకుంటాను. మా అమ్మగారు ఆయనకు ప్రతిరోజూ ఉదయాన్నే బాబా యిచ్చిన పవిత్రమయిన ఊదీని టీలో కలిపి యిస్తూ ఉండేవారు. మరాఠీ కాలండర్ ప్రకారం శ్రావణ మాసంలో ఆగష్టు 16 సోమవారం వచ్చింది. ప్రతి శ్రావణ సోమవారాలలో సూర్యాస్తమయానికి ముందే మేము భోజనం చేస్తూ ఉంటాము కనక మా అమ్మగారు నా అన్నతోనూ, నాతోనూ తొందరగా యింటికి తిరిగి రమ్మని చెప్పారు. నేను మధ్యాహ్న్నం కాలేజీ నుంచి వచ్చాను. ఆస్పత్రికి వెళ్ళేముందు ఆ రోజు చాలా క్లిష్టమయిన రోజని చెప్పారు. మీ దాదాకి ఆరోజు కనక గండం గడిస్తే ఆయన మరొక సంవత్సరం బ్రతుకుతారని చెప్పారు. నేనావిడని అలా యెందుకు చెబుతున్నావని అడిగాను. అందుకావిడ సమాథానమిస్తూ తార్ఖడ్ కుటుంబం లోని మగవాళ్ళందరికీ శ్రావణ సోమవారం దురదృష్టకరమైన రోజనీ చాలామంది మగవారు ఆ రోజుననే మరణించారని తన అత్తగారు చెప్పారన్నారావిడ.

యిప్పుడామె ఆస్పత్రికి వెళ్ళేసరికి ఏం జరిగింది? ఆవిడ సుమారు 3.30 కి తనతో కూడా తీసుకు వెళ్ళే థర్మాస్ ప్లాస్కులోంచి ఆయనకి ఒక కప్పు టీ యిచ్చారు. మా నాన్నగారు టీ కి బానిస. సుమారు 4 గంటలకి ఆయనకి కొంచెం నయమనిపించింది. మరొకసారి టీ యిమ్మని మా అమ్మగారిని అడిగారు. మా అమ్మగారు ఆయనతో అరగంట క్రితమే టీ యిచ్చాననీ ఆ రోజు శ్రావణ సోమవారం కాబట్టి తొందరగా యింటికి వెళ్ళాలని చెప్పారు. 5 గంటలకి టీ యిచ్చి యింటికి వెడతానని చెప్పారు. కానీ మా నాన్నగారు తను ఏదో చూస్తున్నాననీ అది సరిగా స్పష్టంగా లేదనీ టీ యివ్వవలసిందే అని పట్టు పట్టారు. మా అమ్మగారు ఆందోళన పడవద్దని, ఆయన చేతిలో తులసి మాలను ఉంచుతాననీ బాబాను ప్రార్థించమనీ చెప్పారు.

ఆమె ఆయన నుదిటిమీద పవిత్రమైన ఊదీని రాశారు. ఆయన ఒక గుక్క టీ తాగగానే మా అమ్మగారితో తనను యెవరో పిలుస్తున్నారనీ, కాని మొహం స్పష్టంగా చూడలేకపోతున్నాననీ ఆవ్యక్తి యెవరో నిర్థారించుకోవాలని అన్నారు. గదిలో మనమిద్దరమే ఉన్నాము తులసిమాలతో బాబా జపం చేయమని మా అమ్మగారు ఆయనతో చెప్పారు. ఆయన బాబా నామం మెల్లగా అనుకోవడం మొదలెట్టారు. కొంతసేపు ఆయన మొహం కాంతివంతంగా మారింది. నెప్పితో ఉన్న వ్యథ పోయింది. “బాబా నేను వస్తున్నాను (బాబా మీ ఆలో) అంటూ యించుమించు గట్టిగా అన్నారు. యిదే ఆయన ఆఖరి మాటలు తరువాత ఆయన నిర్జీవమయిపోయారు. ఇది ఆయన చరమాంకం.

ఆ సమయంలో ఆయన బాబాని చూసి వుండచ్చని నేను అనుకుంటున్నాను. యెటువంటి మరణం ఆయనది. ఆందరూ చెప్పేదేమిటంటే ప్రతి ప్రాణి శరీరం నించి ప్రాణం (ఆత్మ) వదలి వెళ్ళేముందు చాలా బాథ పడుతుందని. యేమయినప్పటికి మా నాన్నగారు “బాబా నేను వస్తున్నాను” అంటూ చనిపోయారు. ఈ విథంగా బాబా తనతో భావూని తీసుకు వెళ్ళారు. ఒంటరిగా యింటికి వచ్చిన మా అమ్మగారి థైర్యానికి మెచ్చుకున్నాను. ఆవిడ, మీ దాదా స్వర్గానికి వెళ్ళారు అని చెప్పారు. అందరికీ తెలియపరచి ఆయన అంతిమ యాత్రకు ఏర్పాట్లు చేయమని చెప్పారు. నేను స్కూలులో చదువుకునేటప్పుడు “మరనాతా ఖరోఖరా జగ జగాతే” (యెవరైనా వాస్తవంగా జీవించే జీవితం వారి మరణంలోనే) అనే శీర్షికతో మాకొక పాఠం ఉందని నాకు గుర్తు. దాదా నూటికి నూరు పాళ్ళు ఆపేరును ఋజువు చేశారు. మా అమ్మగారికి నిజానికి ఆవేశం యెక్కువ. కాని ఆమె ఒక్క కన్నీటిబొట్టును కూడా రాల్చలేదు. అటువంటి అపూర్వమైన చావు దృశ్యాన్ని చూసి ఆవిడ అతి దుఃఖంలో మునిగిపోయి ఉండచ్చు లేక ఆరోజున కన్నీరు కార్చకూడదని బాబావారి ఖచ్చితమైన ఆదేశాలయినా అయి ఉండచ్చు. అలా మా అమ్మమ్మగారి సిథ్ఠాంతం ఆ శ్రావణ రోజు (హిందువుల నెల) ఆగష్టు, 16, 1965 న నిజమయింది.

రేపు తరువాయి భాగం…

ఈ సమాచారం http://telugublogofshirdisai.blogspot.in/ ద్వార సేకరించబడింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles