బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు పదహేనవ భాగం–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



This Audio Prepared by Mrs Lakshmi Prasanna


సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

బాబా గారి కఫ్నీని ఉతుకుట

నా ప్రయత్నంలో యిప్పుడు యింకా ముందుకు సాగుతూ, నేను బలంగా భావించేదేమిటంటే మా నాన్నగారు తన డైరీని రాసి ఉండవలసిందని. యిది, ఆయన బాబాతో సాంగత్యం దాని ఫలితంగా మిక్కుటంగా పెరిగిన అనుభూతులు దాని వల్ల లార్డ్ సాయి మీద ఆయనకు పెరుగుతూ ఉండే ప్రేమను గురించి కాలక్రమానుసారంగా వాటిని ఒక పథ్థతిలో తెలియచెప్పి ఉండేది.

ఆయన లార్డ్ సాయిని మొట్టమొదటి సారి కలుసుకున్నపుడు తాను ఒక మహాశక్తిని కసులుసున్నానని గాని అది తన జీవితాన్ని కొత్త మలుపు తిప్పుతుందనే మంచి భావం ఆయనకి వచ్చి ఉండకపోవచ్చును. నేననుకునేదేమిటంటే ఆ కాలంలో శ్రీ నరసింహ సరస్వతి అనే ఒక స్వామి, బాబా లీలలను గురించి వివరంగా తెలియ చేసే డైరీని రాశారు.

యిపుడివన్నీ కూడా తరువాతి ఆలోచనలు. నేను కూడా నాకు కలిగిన కొన్ని సంఘటనలు తేదీల వారీగా వాటిని రాసి పెట్టుకోలేదు.

మా నాన్నగారి అనేకమైన మహాద్భుతమైన అనుభవాలతో పోల్చుకుంటే నా అనుభవాలు చాలా కొద్ది మాత్రమేనని చెప్పనవసరం లేదు.

బాబా మీద మా నాన్నగారి భక్తి ఆరోహణక్రమంలో ఉన్నప్పటికీ, బాబాకి తన భక్తునితో బంథాన్ని బలపరచుకోవడానికి ప్రత్యేకమైన నేర్పు ఉండేది.

మా నాన్నగారు షిరిడీలో ఉన్నప్పుడు అక్కడి స్థానికుల ద్వారా బాబా వారి స్నానం కూడా ఒక ప్రత్యేకమైన పథ్థతిలో ఉండేదని తెలుసుకున్నారు.
ఆయన తన శరీరాన్ని మనందరిలాగా బాహ్యంగా తోముకుని శుభ్రం చేసుకోవడమే కాదు, తన లోపలి భాగాలని కూడా తోముకుని శుభ్రం చేసుకునేవారు.

ఆయన తమ ప్రేవులను బయటకు తీసి, శుభ్రం చేసుకుని తిరిగి శరీరంలో పెట్టుకునేవారు. రాముడు, కృష్ణుడు మాత్రమే అటువంటి అష్ట సిథ్థులతో జన్మించారని మా నాన్నగారు చెపుతూ ఉండేవారు.

ఆ కారణం చేతనే వారు మానవ రూపంతో ఉన్న దేవుళ్ళని పిలవబడ్డారు. ఆయన అభిప్రాయం ప్రకారం బాబా పుట్టుకను గురించిన వివరాలు తెలియవు.

కాని ఆయన లీలలు అన్ని విషయాలలోనూ సరిసమానంగా మహా శక్తితో పోటీపడుతూ, సరిపోలుతూ ఉంటాయి.

ఆయన షిరిడీకి వెళ్ళినపుడు ఒకసారి, బాబా ఆయనతో తనతో కూడా తాను స్నానం చేసే ప్రదేశానికి రమ్మని అక్కడ ఒక ప్రత్యేకమయిన పని ఇస్తాననీ చెప్పారు.

మా నాన్నగారు అటువంటి పనికి యెప్పుడూ ఇష్టమే. తనకు మరొక దివ్యానుభూతి కలగవచ్చని ముందే ఊహించారు.

బాబా “భావూ ! ఈ పని చాలా సులువు. నేను స్నానం చేస్తాను. స్నానం చేస్తూండగా నువ్వు నా కఫ్నీని ఉతికి పెట్టు. ఉతికిన తరువాత, దానిని నీ రెండు చేతులతో యెత్తి యెండలో ఆరే దాకా పట్టుకుని వుండు.

నేను చాలా సేపు స్నానం చేస్తానని నీకు తెలుసు. అంచేత నేను స్నానం పూర్తి చేసేటప్పటికి అది ఆరిపోతుంది. దానిని నేను  మరలా వేసుకుంటాను. గుర్తుంచుకో అది ఆరేటప్పుడు అది నేలను తాకకూడదు” అన్నారు.

మా నాన్నగారు వెంటనె ఒప్పుకుని ఆపని చేయడానికి తయారయారు.

వారిద్దరూ లెండీ బాగ్ కి వెళ్ళారు. అక్కడ రేకులతో కట్టబడిన గది ఉంది. ఒక పెద్ద నలుచదరంగా ఉన్న రాయి బాబా స్నానికుపయోగించేది ఉంది.

మా నాన్నగారు స్నానాల గది బయట బాబా గారు, ఉతకడానికి కఫ్నీ యిస్తారని యెదురు చూస్తున్నారు. బాబా గారు పిలిచి కఫ్నీ యింకా యివ్వకపోయేసరికి మా నాన్నగారు కొంచెం అసహనంతో ఉన్నారు.

బాబా చేస్తున్న చమత్కారాలలో అది ఒకటి అనుకున్నారు. తలుపుకి ఉన్న చిన్న ఖాళీ గుండా గది లోపలికి చూద్దమని నిర్ణయించుకున్నారు.

నమ్మశక్యం కాని విథంగా బాబా శరీరం ప్రతి అణువునుంచి వెలుగు కిరణాలు ప్రసరిస్తూ ఉండటం చూశారు. 

అటువంటి శక్తివంతమైన కాంతిని ఆయన భరించలేకపోయారు. కళ్ళు పోతాయేమోనని భయం వేసింది. తన తప్పుడు పని కూడా బయట పడుతుందేమోనని కూడా అనుకున్నారు.

అదే క్షణంలో బాబా తన కఫ్నీని తీసుకుని ఉతకమని చెప్పి పిలవడం వినపడింది. మా నాన్నగారు కఫ్నీ తీసుకుని దగ్గరనున్న బావి వద్దకెళ్ళి సబ్బుతో బాగా శుభ్రంగా ఉతికారు. నీరు బాగా పిండి, దాన్ని తన రెండు చేతులతో యెత్తి యెండలో యెత్తి పట్టుకున్నారు.

బాగా తేలికగా ఉండటంతో మొదట బాగానే భరించారు, కాని సమయం గడిచే కొద్దీ యెండకు యెండి తేలికవడానికి బదులు బరువుగా అవడం మొదలెట్టింది.

తాను ఆపరీక్షలో తప్పుతానని మా నాన్నగారికి అర్థమయింది. కారణం తొందరలోనే కఫ్నీ నేలని తాకుతుంది.

ఈ కఠినతరమైన కార్యంలో కృతకృత్యుడవటానికి తగిన బలాన్నిమ్మనమని ఆయన హనుమంతుడిని ప్రార్థించి ఆయన సహాయం తీసుకుందామని నిర్ణయించుకున్నారు.

ఆయన హనుమంతుడిని ప్రార్థిస్తుండగా బాబా లోపలినించి అరుస్తూ “హే భావూ ! హనుమాన్ ని సహాయం కోసం యెందుకు పిలుస్తున్నావు?” అన్నారు.

సంశయం లేకుండా బాబా ‘అంతర్ద్యాని’ (మనసులోని ఆలోచనకు గ్రహించే శక్తి కలిగి ఉండటం) మనసులోని ఆలోచనను ఉన్నది ఉన్నట్లుగా చదవగలగడం. బాబా దిగంబర శరీరాన్ని చూడటానికి ప్రయత్నించి తప్పు చేశానని అందుకు మన్నించమని మా నాన్నగారు బాబాని కోరారు. బాబా ఆయన తప్పుని మన్నించగానే, మా నాన్నగారు కఫ్నీ తేలికగా అయిపోవడం గమనించారు.

మా నాన్నగారు బాబాకు కృతజ్ఞతలు చెప్పి, అటువంటి సాహసకార్యాలు చేయనని ఒట్టు పెట్టుకున్నారు. బాబా నుంచి యెవరూ యేదీ దాచలేరని అర్థమయిందాయనకి.

అందుచేత బాబా వారి బోథనలు అంత గొప్పవి. మీ అనుమతితో నేను స్వతంత్రంగా ఈ మాట చెప్పనా, “బాబా ప్రత్యక్షంగా స్వయంగా చేసిన బోథనలతో దీవెనలు అందుకున్నవారు అదృష్టవంతులు”

రేపు తరువాయి భాగం…

ఈ సమాచారం http://telugublogofshirdisai.blogspot.in/ ద్వార సేకరించబడింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు పదహేనవ భాగం–Audio

kishore Babu

Thank you So much Sai Suresh..

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles