బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు మొదటి భాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

మనం బాబా లీలలను చదవడం యెంతో ఆనందాన్నిస్తుంది. కాని బాబాతో ఉండి ఆయన లీలలను స్వయంగా అనుభవించినవారు తమ అనుభూతులను చెప్పినప్పుడు మనకి యింకా ఆనందం కలుగుతుంది. అటువంటి అనుభూతులను తార్ఖడ్ కుటుంబము వారు అనుభవించిన అనుభూతులను తమ తండ్రిగారు చెప్పగా శ్రీ వీరేంద్ర తార్ఖడ్ గారు మన సాయి భక్తులందరికీ అందించారు.

ముందు మాట

ముంబాయి సాంతాక్రజ్ శ్రీ జ్యోతీంద్ర రామచంద్ర తార్ఖడ్, షిరిడీ సాయిబాబా వారి యొక్క తమ ప్రత్యక్ష అనుభవాలని చక్కగా చెప్పారు. నిజానికి సాయిబాబా చెప్పిన బొథనలని తమ వివరణ ద్వారా యెంతో విశిష్టంగా మన ముందుకు తెస్తున్నారు. (మనముందుంచుతున్నారు) రచయిత, పబ్లిషర్ (ప్రచురణకర్త) అయిన శ్రీ వీరెంద్ర జ్యోతీంద్ర తార్ఖడ్ శాంతాక్రజ్ ముంబాయిలో నివసిస్తున్న విశ్రాంత యింజనీర్ గారు. సాయి భక్తులందరికీ వీరి గురించి తెలుసు. రచయిత వ్రాసిన 17 అథ్యాయాలలో 16 అథ్యాయాలు వారి తండ్రిగారి స్వీయానుభవాలు. తనకు బాగా గుర్తున్నంతవరకు రాసిన ఈ విషయాలని పాఠకులు, స్వర్గీయ శ్రీ అన్నా సాహెబ్ ధాబోల్కర్ గారు వ్రాసిన సచ్చరిత్రతో పోల్చి సరి చూసుకోవచ్చు. శ్రీ వీరేంద్ర తార్ఖడ్ గారు తమ తండ్రిగారి స్వీయానుభవాలని సాయి భక్త పాఠకులందరికీ అందించారు, నేను వారిని వాటి యొక్క రుచిని, సారాన్ని, ఆస్వాదించమని కోరుతున్నాను.

లార్డ్ బాబా వారి సాహచర్యంతో జ్యోతీంద్ర గారు, అనుభవించిన సంఘటనలు, రచయిత తనకు గుర్తున్నంత వరకు ప్రచురించినవి. నిజాలకు చాలా దగ్గరగా ఉండి బాబా వారి యొక్క శౌర్యాన్ని చాలా చక్కాగా చెప్పబడ్డాయి. రచయిత ఒక అద్వితీయమైన రీతిలో లార్డ్ సాయితో తన తండ్రి గారి చాలా దగ్గరి అనుబంథాన్ని వర్ణించి చెపుతున్నారు. నేను ఖచ్చితంగా చేప్పేదేమిటంటే యిది చాలా ప్రశంసించదగ్గది. నేననుకునేదేమిటంటే వివరణలన్నీ యేమి చెపుతున్నాయంటే, భక్తులు షిరిడీని దర్శించినప్పుదు, సమాథి మందిరాన్ని, ఖండోబా మందిరాన్ని తప్పక దర్శించాలి. బాబా చెప్పిన సూత్రాలు శ్రథ్థ, సబూరీ (నమ్మకము, ఓర్పు) వారి జీవితం సాఫీగా సాగాలంటే వీటిని ఆచరించాలి.

పరిచయం

ప్రియ పాఠకులారా, నేను (శ్రీ వీరెంద్ర జ్యోతీంద్ర తార్ఖడ్) ఈ ప్రత్యక్ష అనుభవాలని రాసే ముందు ఇవి నా స్వంత అనుభవాలు కావన్నఒకే ఒక్క కారణంతో మిమ్ములని క్షమాపణ వేడుకుంటున్నాను. కాని అవన్నీ కూడా మా తండ్రిగారయిన శ్రీ జ్యోతీంద్ర రామచంద్ర తార్ఖడ్ గారు తాము జీవించి ఉన్నపుడు మాటి మాటికి చెప్పినవె.

నా చిన్నతనంలో ఆయన చెబుతూండగా నేను వింటున్నప్పుడు నా కవి అద్భుతమైన కథలలాగా అనిపించేవి. నేను పెద్దవాడినవుతూండగా శ్రీ షిరిడీ సాయిబాబా మానవాతీత శక్తుల గురించి అర్థం కాసాగింది. మా నాన్నగారు, సామాన్య మానవుడు పొందడానికి కష్టసాథ్యమైనటువంటి అమూల్యమైన అనుభవాలని, ఒక విథమైన ఆథ్యాత్మిక అనుభూతిని సాయిబాబా వారి సాన్నిహిత్యంలో తన 10 సంవత్సరాల జీవిత కాలంలో అనుభవించారు. నేనెప్పుడు అనుకునేదేమిటంటే ఈ బహూకరింపబడిన అనుభవాలని మీకు తెలియ చెప్పాలని, కాని మన రోజు వారి కార్య క్రమాలలో అటువంటి ఆథ్యాత్మిక రచనల మీద దృష్టి పెట్టడం మనకు కష్ట సాథ్యం.

యిప్పటికి నేను చాలా సార్లు సాయిబాబా వారి కర్మ భూమి యైన షిరిడీని చాలా సార్లు దర్శించాను. ఈ దర్శనాల్లో నేను చాలా మంది సాయిభక్తులని కలుసుకున్నాను. ఈ కలుసుకోవడాలలో, సామాన్యంగా ఒక ప్రశ్న వచ్చేది, నేను కూడా సాయి భక్తుడినేనా అని. నేనలా చెప్ప్పుకోవడానికి నాకు కొంచెం చిన్నతనంగా అనిపించేది, యెందుకంటే మా నాన్నగారు చేసే సాయి పూజ పథ్థతి వల్ల. నేను అటువంటి ఆథ్యాత్మిక విథికి దగ్గరగా లేను. యింకా సాయి భక్తులకి శ్రీ సాయిబాబా తో నాకు అద్వితీయమైన అనుబంథం ఉండేదని చెపుతూ ఉండేవాడిని. యెందుకంటే మా నాన్నగారు జీవించి ఉన్నపుడు ఆయనతో సాన్నిహిత్యం. షిరిడీలో చాలా చురుకుగా ఉండేవారు. ఆ ముఖ్యమైన కారణం వల్లే నేను షిరిడీ దర్శించాను.

మా తర్ఖడ్ కుటుంబంలో అటువంటి సాన్నిహిత్యానికి ప్రథాన కారణమైన ముఖ్యమైన వ్యక్తులు ముగ్గురు ఉన్నారు. మా నాన్నమ్మ గారు ( మా నాన్నగారి తల్లి),  మా తాతగారు, శ్రీ రామచంద్ర ఆత్మారాం తర్ఖడ్, మరియు మా నాన్నగారు శ్రి జ్యోతీంద్ర రామచంద్ర తార్ఖడ్. ఈ ముగ్గురికీ కూడా శ్రీ సాయిబాబాతో 1908 నుంచి 1918 వరకూ అంటే ఆయన మహాసమాథి చెందే వరకు అనుబంధం ఉంది. ఈ అనుబందం ఫలితంగా, ఆ తరువాత మా కుటుంబంలోని వారందరికీ సాయి బాబా భగవంతుడయారు.

సాయి భక్తుడు, మా నాన్నగారు అనుభవించిన దివ్యానుభూతిని వర్ణించి చెప్పమని నన్ను కోరేవాడు. అప్పుడు నేను (బలవంతాన) అందుకు బథ్థుడనై నా మదిలోకి అప్పటికప్పుడు యేది వస్తే అది చెప్పేవాడిని. యిది షిరిడీలోని లెండీ బాగ్ లో జరుగుతూ ఉండేది. ముఖ్యంగా ఆ అనుభవాన్ని విన్న తరువాత ఆ భక్తుడు నా ముందుకు వంగి నా పాదాలని స్పృశించేవాడు. నాకప్పుడు నేను యేమీ చాతకాని వాడిని అని అనిపిస్తూ ఉండేది.

ఒకసారి పూనాలోని సాయి బృందం వచ్చి నన్ను పూనా వచ్చి సాయి అనుయాయీలందరికి ఆ అనుభవాలన్నిటినీ వివరించి చెప్పమని నన్ను కోరడం జరిగింది. నేనందుకు ఒప్పుకుని నేను నా భార్యా పిల్లలతో పూనా వెళ్ళాను. ఆ కార్యక్రమం రెండు గంటల పాటు జరిగింది. నేను చెప్పడం పుర్తి అయ్యాక నాకు నమస్కారం చేయడానికి నా ముందు పెద్ద లైను ఉంది. నేను గృహస్తుడిని కాబట్టి ఆ అనుభవాలన్నీ మా నాన్నగారివనే సామాన్య కారణంతో నేనిటువంటి వాటికి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాను. యింకా నేను చెప్పేటప్పుడు కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు. యిదే సమయంలో నేను ఉద్యోగ విరమణ చేసిన తరువాత, మా తార్ఖడ్ కుటుంబసభ్యుల అనుభవాలను వ్రాయడానికి చాలా సమయం ఉంటుందని, దానిని ఉపయోగించుకోవాలని నిశ్చయించుకున్నాను.

షిరిడీ సాయిబాబా మీద నాకున్న ప్రేమను, భక్తిని, తెలియచేయడానికనుకోండి. 2003, జూన్ 18న నాకు 60 సంవత్సరములు నిండాయి. మరియు ఈ రోజు ఆగష్టు 15, 2003 అనగా మన ప్రియమైన భారత దేశ 57 స్వాతంత్ర్య దినము నాడు నేను ఈ పుస్తకం రాయడానికి ఉపక్రమించాను. ప్రియమైన సాయి భక్త పాఠకుడా నేను, శాశ్వతమైన సాయి సచ్చరిత్ర వ్రాసిన కీర్తిశేషులు అన్నా సాహెబ్ థబోల్కర్ గారి లాగ గౌరవనీయులైన హేమాడ్ పంత్ నూ కాదని చెప్పదలచుకున్నాను.

షిరిడీ సాయిబాబా గారి జీవితమంతా తెలియచెప్పేటటువంటి 54 అథ్యాయాలు కల ఈ పవిత్రమైన పుస్తకాన్ని నేను క్రమం తప్పకుండా చదువుతూ ఉంటాను. ఈ పవిత్రమయిన గ్రంథంలో షిరిడీ లో మా నాన్నగారు ఉన్నప్పటి సంఘటనలు కూడా ఉన్నాయి. మా నాన్నగారు చూచి, నాకు చెప్పిన వాటిని మీకు నేను సవినయంగా వివరిస్తున్నాను.

ప్రియ పాఠకులారా దయ చేసి నన్ను మన్నించండి. యెందుకనగా ఆ సంఘటనలు జరిగిన ఖచ్చితమైన తేదీలు గాని, సమయం గాని తెలియ చేప్పే స్థితిలో లేను కాని, 1908 నుంచి 1918 వరకూ మా నాన్నగారు షిరిడి 17 సార్లు దర్శించారు. ఒకసారి షిరిడీ వెడితే అక్కడ 8 రోజుల నుంచి ఒక నెల వరకు ఉండేవారు. ఈ 17 సార్లు వెళ్ళే క్రమంలో, నన్ను నమ్మండి మా నాన్నగారికి మొట్టమొదటి శ్రీ షిరిడీ బాబా వారి యొక్క దివ్యమైన అనుభూతి కలిగింది. నిజం చెప్పాలంటే అవి అతీంద్రియము. నిజానికి, ఆయన సెంట్ గ్జేవీయర్ స్కూల్ లో విద్యార్థి గా ఉన్నప్పుడే రాసి ఉండవలసినది అనుకున్నాను. నేను ఈ రాస్తున్నదానికి కారణం, శ్రీ సాయిబాబా మీద మనకున్న గాఢమైన, మనః పూర్వకమైన శ్రథ్థ (నమ్మకం). స్వచ్చంగా తెలియచేప్పటానికి అది నాకు అపరిమితమైన మనశ్శాంతినిస్తుంది.

ప్రియమైన సాయి భక్త పాఠకుడా, ఈ పుస్తకం చదివిన తరువాత నాకు కూడా కొన్ని దివ్య్యానుభూతులు కలిగి ఉండచ్చని మీరు అనుకోవచ్చు, కాని నేను సవినయంగా మనవి చేసేదేమిటంటే ఖచ్చితంగా మానాన్నగారు అనుభవించినలాంటివి మాత్రం కాదు. నేను గట్టిగా నమ్మేదేమిటంటే, ఆయన పూర్వ జన్మ సుకృతం వల్ల శ్రీ సాయిబాబా గారితో అనుబంధం యేర్పడింది. యింకా ఆయన అనుభవాలన్ని కూడా ఆయన వివాహనికి ముందువి అనగా ఆయన వయసు 14 నుంచి 25 సంవత్సరాల కాలంలో జరిగినవి. చాలా సార్లు నేను ఆశ్చర్య పోతూ ఉంటాను, అటువంటి దివ్యమైన అనుభూతులను పొందుతూ మా నాన్నగారు సంసార జీవితాన్ని యెందుకు కోరుకున్నట్లు. సరే, అప్పుడు నేను ఉండేవాడిని కాదు, ఈ పుస్తకం కూడా, వెలుగు చూసి ఉండేది కాదు.

రేపు తరువాయి భాగం…

ఈ సమాచారం http://telugublogofshirdisai.blogspot.in/ ద్వార సేకరించబడింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు మొదటి భాగం

kishore Babu

Thank you so much Sai Suresh…

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles