బాబా శక్తి అంతుతెలియనిది



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

తన భక్తుని జీవితంలో జరగబోయే ఉపద్రవాన్ని బాబా వెంటనే జోక్యం చేసుకొని అడ్డుకొన్నారు. అది 1943వ.సంవత్సరములో మొదటి నెలలో మొదటి వారం.  నా యొక్క సోదరికి నెలలు నిండుతున్నాయి.  యింతకు ముందే ఆమెకు యిద్దరు పిల్లలున్నారు.  వారు పసి వయసులోనే మరణించారు.  ఆమెకు ఏడవనెల.  అందరికీ ఆమె ఆరోగ్యం గురించి ఆందోళనగా వుంది.  కాని, నాకు ఆమె ఆరోగ్యం గురించి ఎటువంటి బెంగా లేదు.  అంతా బాబా చేతులలోనే వుందని ఎంతో నమ్మకంతో నిబ్బరంగా ఉన్నారు.

నేను  రోజు మాదిరిగానే పూజ చేసుకుంటున్న సమయంలో నా  సోదరి  ఏడుస్తూ వచ్చి లేడీ డాక్టర్ ను పిలవమని చెప్పింది.  తనకు అబార్షన్ అవచ్చనే భయాన్ని వెలిబుచ్చింది.  ఆసమయంలో నా యొక్క భావాలని ఒక్కసారి ఊహించుకోండి.  బాబా మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్న నా నమ్మకానికి విఘాతం ఏర్పడబడబోతోందా? నా నమ్మకానికి ఈ పరిణామం ఒక దిగ్భ్రాంతి. 

యిటువంటి సంక్షోభ సమయంలో బాబా తన భక్తుని శిక్షిస్తున్నాడా?  జాంనేర్ లో నానా కుమార్తె ప్రసవ వేదన పడుతున్న సమయంలో ఆమెకు సుఖప్రసవమవడానికి బాబా సహాయం చేయలేదా?  ప్రధాన్ బిడ్డ చావు బతుకులలో ఉన్నపుడు అతనిని బాబా  వెన్వెంటనే రక్షించలేదా?  బాబాయే దైవికమైన  వైద్యుడు.  అటువంటిది ఆయనే చేయలేనపుడు ఒక లేడీ డాక్టరు చేయగలదా?  కాదు, అలా జరగడానికి వీలులేదు. ఇక్కడ చావా, పుట్టుకా, బాబా తేల్చవలసిన సమస్య. 

యిక విచక్షణా జ్ఞానం కోల్పోయి కోపోద్రేకంతో నేను బాబా విగ్రహంలో కొంత భాగాన్ని పగులగొట్టి, పొడి చేసి ముద్దగా తయారుచేసి దానిని తన సోదరి పొట్టమీద రాశాను.  భగవంతుని నిర్ణయమేమిటో తెలియక, విచక్షణా జ్ఞానం కోల్పోయి కోపంతో ఒక అంధ భక్తుడు చేసిన చర్య యిది.  మందే విచిత్రమనుకుంటే నివారణ కుడా చాలా విచిత్రమైన విషయం.   ఒక్క క్షణంలోనే ఆమెకు జరగబోయే గర్భస్రావం ఆగిపోయి, ఆమె కోలుకొంది.  ప్రమాదకరంగా రజగబోయే అబార్షన్ అదృశ్య శక్తితో నివారణయింది.  అది బాబా విగ్రహం పగులగొట్టి దాని పొడిని ముద్ద్గచేసి రాయడం వల్లనా?  లేక నేను  కోపోద్రేకంతో బాబా మీద దుడ్డుకఱ్ఱతో బాదినట్లుగా చేసిన చర్యా?  నేను యిటువంటి సున్నితమయిన ప్రశ్నలకు కలత  చెందలేదు.

సాయిసుధ  1943
రామనాధన్
కరూర్

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాబా శక్తి అంతుతెలియనిది

Sudha

I FEEL VERY HAPPY READING THE SAI LEELAS

Sudha

Baba is a legend

kishore Babu

Thank you Sai..Baba bless you so much

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles