బుద్ది నొసగుమా, శక్తి నొసగుమా…..సాయి@366 జనవరి 2…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


శ్రీమతి బాపత్ సాయిబాబాను సందర్శించింది. ఎనిమిది అణాలు దక్షిణగా సమర్పించాలనుకుంది. ఆవిడ వద్ద డబ్బు ఉన్నది. మనసు మార్చుకున్నది.

ఎనిమిది అణాలు ఎందుకులే, 4  అణాలు చాలు అనుకున్నది. సాయికి 4 అణాలు ఇచ్చింది.

సాయి ఆమెతో “మిగిలిన 4 అణాలు ఇవ్వక ఎందుకీ పేద బ్రాహ్మణుడిని మోసగిస్తావ్?” అన్నారు. ఆమె తన తప్పుకు సిగ్గుపడి మరో నాలుగు అణాలు సమర్పించింది.

ధనము లేని సమయములో, సాయికి గాని ఎవరికీ గాని దక్షణగా గాని, ధన సహాయము చేద్దామనిపిస్తుంది. కానీ, శక్తి ఉండదు. డబ్బు ఇవ్వ శక్తి ఉన్నప్పుడు, ఇచ్చే బుద్ధి ఉండదు (మనస్సు అంగీకరించదు).

బాలాసాహెబ్ భాటే కుమార్తె జానకీబాయి  తంప్లే .  ఆమె భర్త మరణించాడు. ఆస్తికి వారసురాలయినది.

ఆమె తండ్రి (ఆమె వివాహమునకు పూర్వము) షిరిడీకి చేరాడు. సాయిని దర్శించాడు. ఇక ఉద్యోగం కూడా చేద్దామనిపించ లేదు భాటేకు.

జానకీబాయి  తంప్లేకు   ధనం వచ్చింది. తండ్రి భక్తిని చూచింది. సాయి మహత్తు ఆమెకు అవగతమే.

ఆమెకు ఉన్న స్థిర చిరాస్తులన్నీ సాయి సంస్థానానికి రాసి ఇచ్చింది. అది – జనవరి 2 వ తారీకు 1943 .

ఆమె కంటే చాలా ముందు రాధాకృష్ణమాయి సాయి సంస్థానాన్ని నెలకొల్పింది. ఏం తో సేవ చేసింది.

అరతులు, చావడి ఉత్సవము ఆ మహనీయురాలి రూప కల్పనలే, రాధాకృష్ణమాయి తనువు చాలించింది.

ఆమె మరణానంతరం ఆమె లేని లోటును తీర్చినది జానకీబాయి తంప్లే . ధనాన్ని సాయి పరం చేయటం ఒక మినహాయింపు. మరో విశేషం కూడా ఉన్నది.

ఆమె సంస్థాన భోజన గృహాన్ని అత్యంత సమర్థవంతంగా నడిపించింది. దానినే సాయినాధుని సేవ మందిరంగా మార్చింది.

ఆమె ఆరోగ్యముగా లేకున్నా, తన శరీరాన్ని సాయి భక్తుల కొరకు అరగతీసింది.

వారిని ఆదర్శంగా తీసుకుని అందరు ఏ కొంచెంగా నైనా ఆచరించి చూపిస్తే చాలు, అదే పది వేలు.

అప్పుడే మనకు సాయి ఆశీస్సులు లభిస్తాయి.

సాయి చెప్పినట్లు మనకున్న దానిలో కొంతైనా ఇతరులకు పంచి వారిని సంతోషపరిస్తే సాయి మనను సంతోషపరుస్తాడు.

బుద్ది నోసగుమా!

శక్తి నోసగుమా!!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles