బుద్ది నొసగుమా, శక్తి నొసగుమా! …. మహనీయులు – 2020… జూన్ 17



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఉస్మాన్ మహమ్మదీయ మతంలో చేరాడు. ఆ మత వ్యాప్తికోసం సర్వస్వం ధారపోయటానికి సిద్ధపడ్డాడు.

బద్ర్ యుద్ధం నిర్ణయమైంది. ఆ యుద్ధంలో పాల్గొనటానికి ఉస్మాన్ తయారయ్యాడు. ఉస్మాన్ భార్య రుక్క అనారోగ్యంతో మంచంలో ఉంది.

అట్టి పరిస్థితిలో కూడా యుద్దానికి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు ఉస్మాన్. ఐతే మహమ్మద్ ప్రవక్త అతనిని యుద్ధంలో పాల్గొనవద్దని భార్య వద్దనే ఉండమని ఆదేశమిచ్చాడు, అల్లా తరువాత ప్రవక్తయే ఉస్మాన్  కు.

ఆయన ఆదేశాన్ని పాటించాడు. యుద్దానికి పోయివుంటే ఆమెను ఉస్మాన్ మరల చూడలేక పోయేవాడు, ఆమె కూడా ఉస్మాన్ ను చూడలేకపోయేది.

ఉస్మాన్ ధనవంతుడు, అందగాడు. ధనవంతులందరకూ దాతృత్వం ఉండకపోవచ్చును.

ఉస్మాన్ మరణించి వేయి సంవత్సరములు దాటినా, ఆయన దాతృత్వాన్ని నేటికి కథలుగా చెప్పుకుంటారు. ఉస్మాన్ ప్రతి శుక్రవారం ఒక బానిసకు విముక్తి కలిగించేవాడు.

ఒక సంవత్సరం మదీనాలో వర్షాలు పడలేదు. భూమంతా ఎండిపోయింది. వ్యాపారుల వ్యాపారం సాగటంలేదు.

ప్రజలకు ఆహారం లేక ఆకులు అలములు తింటున్నారు. ఒక దినం మదీనాలో వెయ్యి ఒంటెలతో ఉస్మాన్ ఆహార పదార్దాలను తెస్తున్నాడని వార్త తెలిసింది.

అందరు ఎంతో ఆనందంగా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. సంతోషపడని వారు వర్తకులు మాత్రమే.

ఎందుకంటే ఉస్మాన్ ఆహార పదార్దాలను ఉచితంగా పంచిపెడతాడు కనుక.

ఐనా ఉస్మాన్ వ్యాపారి. వ్యాపారి కొద్దో, గొప్పో ధన లాభం లేకుండా పనిచేయడనే ఆశ ఆ వ్యాపారులలో కలిగింది. ఉస్మాన్ రానేవచ్చాడు.

వస్తూనే “నాకు మంచి బేరం దొరికింది. ఈ సరుకులను మీకు అమ్మలేకపోవచ్చును” అన్నాడు. వర్తకులందరూ తాము రెండురెట్ల డబ్బు ఇస్తామన్నారు.

ఉస్మాన్ అంగీకరించలేదు,  ఎన్నోరెట్లు ధరను పెంచారు. ఉస్మాన్ ఒప్పుకోలేదు – “నాకు అల్లానుండి మంచి బేరం వచ్చింది. అల్లా పేరుతొ ధర్మాన్ని చేస్తే, ఎన్నోరెట్ల సంపద నాకు వస్తుంది” అని ఉస్మాన్ చెప్పి ఆ వేయి ఒంటెలు మోసుకువచ్చిన ఆహార పదార్దాలను అందరకూ ఉచితంగా పంపిణీచేశాడు.

బీదలనాదరించు బుద్దిని శక్తిని అల్లా ఇచ్చాడు ఆయనకు.

ఉస్మాన్ ఖాలీఫా ఐనప్పుడు రాజ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించాడు.

ఖురాన్ శుద్ధ ప్రతులను తయారుచేయించాడు.

ఆయనను జూన్ 17 (656)న హత్యచేశారు గిట్టని వారు.

నేడు జూన్ 17.

ఉస్మాన్ వర్థంతి.

ఆయనను స్మరిద్దాం! ఆయనలోని దాన గుణాన్ని మనము అలవరచుకుందాం!!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles