త్యాగధనుడు …. మహనీయులు – 2020… జూన్ 3



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నారాయణ మహారాజు గారి ఆశ్రమంలో సప్తాహం జరిగింది.

వంటశాల, భోజనశాలలు వేరు వేరుగా కొద్ది దూరంలో ఉన్నాయి. అందరూ భోజనాలకు కూర్చున్నారు.

సంతృప్తిగా భుజిస్తున్నారు మారు వడ్డనకు పదార్దాలను తేవటానికి వడ్డించే వారందరూ పాత్రలతో వంటశాలలోకి వచ్చి పాత్రల నిండా పదార్దాలను నింపారు.

నారాయణ మహారాజులు పర్యవేక్షిస్తున్నారు. అకస్మాత్తుగా పెద్ద వర్షం కురవనారంభించింది. వడ్డించేందుకు పదార్దాలు నిండుగా ఉన్నా వానలో తడిసిపోతాయని వడ్డించేవారు వంటశాలలోనే ఉండిపోయారు.

క్షణాలు గడుస్తున్నాయి. వాన తగ్గనేలేదు. అయ్యో భోజన పదార్దాలను వడ్డింపలేకపోయామే అనే ఆదుర్దా వడ్డించే వారి ముఖాలలో కనిపిస్తోంది. అయినా వారేమి చేయగలరు?

వాన తగ్గింది. వెంటనే పాత్రలతో భోజనశాలకు పోయారు వడ్డించేవారు.

అందరూ లేవబోతుంటే, “ఆగండి, ఆగండి. పదార్దాలను తెచ్చాం వడ్డిస్తాం” అని వడ్డించేవారు చెప్పారు అతిధులకు.

“అదేమిటి? మేము పూర్తిగా భోజనం చేశాము. నారాయణ మహారాజు గారే మాకు స్వయంగా వడ్డించారు” అని చేతులు కడుగుకున్నారు అతిధులు.

“నారాయణ మహారాజుగారు వడ్డించటమెలా? ఆయన మాతో వంటశాలలోనే మా వద్దే ఉన్నారు ఇప్పటిదాక” అన్నారు వడ్డించేవారు. అప్పుడు కూడా నారాయణ మహారాజు వంటశాలలోనే ఉన్నారు.

ఒక్క క్షణం అందరూ ఆలోచించారు. నారాయణ మహారాజుగారు సర్వాంతర్యామి. ఎక్కడైనా ప్రత్యక్ష మవ్వగలరు.

నారాయణ మహారాజు తన గురువైన రామకృష్ణ మహారాజు వద్ద దీక్షను పొందారు.

“శ్రీరామ జయ రామ జయ జయ రామ” అనే త్రయోదశాక్షరిని కొన్ని లక్షలసార్లు జపించి సిద్ధిపొందారు.

సమర్థ రామదాసు స్వామి సాక్షాత్కారాన్ని పొందారు. అయన చూపిన లీలలు ఎన్నో ఉన్నాయి.

ఒకసారి చార్మినార్ దగ్గరలో ఉన్న మచిలీకమాన్ ప్రక్కన ఉన్న రామనాథ్ సాహి కువ్వాయి ఇంటికి పాదపూజ నిమిత్తం శిష్యులతో వెళ్ళారు నారాయణ మహారాజు.

ఎందరెందరో భోజనానికి వచ్చారు. నారాయణ మహారాజ్ ఆనాడు ప్రత్యేకంగా చేయబడిన పాలకోవాను తెప్పించారు.

ఒక పళ్ళెము తెప్పించారు. దైవానికి సమర్పించారు. ఒక పళ్ళెములోని ప్రసాదమును తాను మాత్రమే తిన్నారు. ఇతరులకు పెట్టలేదు.

ఆయనకు వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. ప్రత్యేకంగా చేయబడిన పాలకోవాలో పైనుండి పాము విషము పడ్డది.

అది తెలియని వంటవారు మహారాజుల కిచ్చారు. ఆ విషాన్ని కేవలం ఒక చిన్న పళ్ళెంలో ఉంచిన పదార్థంలోనికి తెప్పించి తాను తిని ఇతరుల ప్రాణాలను కాపాడారు.

ఆనాడు ఆ విష పదార్థం తిని మృతి చెందేవారి బదులు తన్ను సమర్పించుకున్నారు నారాయణ మహారాజులు.

సాయిబాబా కూడా తాత్యా కోతే పాటిల్ కోసం తన ప్రాణాన్ని విడిచారు.

నారాయణ మహారాజ్ జూన్ 3, 1914న మహాసమాధి చెందారు. నారాయణ మహారాజ్ వర్థంతి దినాన వారిని స్మరించి, ఏ కొద్దిపాటైనా త్యాగమును చేయ ప్రయత్నిద్దాం!  

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles