ఏ దేశమేగినా…. …. మహనీయులు – 2020… మే 3



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


తమకు ఇష్టంవచ్చిన రీతిలో తమ గురువును గాని, దైవానికి గాని సేవను చేసుకుంటారు శిష్యులు, భక్తులు.

హేమాడ్ పంత్ సాయి సచ్చరిత్ర వ్రాశాడు. దాసగణు హరికథలు చెప్పాడు. నానా సాహెబ్ చాందోర్కర్ తన పలుకుబడితో సాయిబాబాకు విస్తృత ప్రచారం చేశాడు.

గౌతమ బుద్దిని అనంతరం అశోక చక్రవర్తి బౌద్ధ మత వ్యాప్తిని విస్తృతంగా చేశాడు.

ఒకానొక సమయంలో ప్రభుత్వ ఖజానాలో ధనంలేదు. అశోకుడే కాదు, అశోకుని కుమారుడు మహేంద్రుడు బౌద్ధ భిక్షువయ్యాడు. అశోకుని కుమార్తె సంఘమిత్ర కూడా అంతే.

చిన్ననాటి నుండి బౌద్ధంపట్ల మక్కువ కలిగి ఉండేది. బౌద్దమతంలో ఆమెకు గల బంధం విడదీయరానిదైనది. బౌద్దున్నే పెండ్లాడింది. అంతేకాదు, ఆమె బౌద్ధ భిక్షుణి అయింది.

అశోకుడు దేవానాం ప్రియటిస్సా (శ్రీలంక మహారాజు) కోరికపై తన కుమారుని శ్రీలంకకు బౌద్ధమత వ్యాప్తికై పంపాడు. ఎందరో పురుషులకు ఖిక్షకులుగా దీక్షనిచ్చాడు.

ఐనా రాజ వంశీకులైన మహిళలు కూడా భిక్షుకులవవుదామనుకున్నారు.

అందుకని శ్రీలంక మహారాజు అశోకుని కుమార్తెను శ్రీలంకకు పంపవలసిందని ఆమెతో పాటుగా బుద్ధ గయలోని బోధి వృక్ష కొమ్మను పంపవలసినదని కోరుతూ ఉత్తరం వ్రాశాడు దేవానాంప్రియటిస్సా.

అశోకుడు తన కుమార్తెను పంపటానికి మొదట్లో ఇష్టపడలేదు.

తన్, మన్, ధన్ లను సంఘమిత్ర బౌద్ధ మతానికే వినియోగింపదలచుకుంది. సంఘమిత్రను శ్రీలంకకు పంపదలచుకున్నాడు.

ఆమె మహిళా భిక్షుణిలతో ప్రయాణంచేయటానికి సిద్ధమైంది. అశోకుడు సంఘమిత్రకు ఒక భిక్షా పాత్ర, బుద్ధుని అవశేషాన్ని ఇచ్చాడు. బౌధి వృక్షపు కొమ్మను బంగారు పాత్రలో పెట్టి నావలో పంపాడు.

సంఘమిత్ర ఆ కొమ్మను ప్రాణప్రదంగా ఆ నావలో చూచుకుంటోంది. అయితే హానికర శక్తులు విజృంభించాయి.

కొన్ని పాములు (నాగములు) అడ్డుతగిలాయి. సంఘమిత్ర గరుడుని రూపంలో ఆ పాములను చెల్లాచెదరుగా పారిపోయేటట్లు చేసింది.

ఆ నవ తీరమును తాకకముందే మహారాజు సముద్రములోనికి పోయి ఆ రావి వృక్షము కొమ్మకు మ్రొక్కాడు.

దాదాపు 12 మైళ్ళు తీరమునుండి కాలినడకన సంఘమిత్ర, మిగిలిన వారితో ఆ కొమ్మను తెచ్చినది.

తెచ్చే దారిలో విచిత్రంగా ఆ కొమ్మకు ఎండ తగలకుండా మేఘము వచ్చెడిది. కావలసినమేరకు వర్షము కురిసెడిది. అనూరాధపురంలో దానిని నాటారు.

ప్రపంచ సుప్రసిద్ధ చరిత్రకారుడు హెచ్. జి. వెల్స్  ప్రపంచంలో నాటబడిన అతి ప్రాచీన వృక్షం ఇదేనంటారు.

సంఘమిత్ర తిరిగి భారత దేశానికి పోలేదు. ఎందరినో బౌద్ధమతంలోకి మార్చింది.

ఈ నాటికి డిసెంబరులో వచ్చే మార్గశిర మాసంలో ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ సంఘమిత్ర దినం ఘనంగా చేసుకుంటారు.

శ్రీలంక ప్రభుత్వం మే 3, 1979న స్మారక తపాలాబిళ్ళను విడుదల చేసింది.

నేడు మే 3, సంఘమిత్రను, బుద్ధ భగవానుని స్మరించెదము గాక!

బుద్ధం శరణం గచ్చామి!!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles