Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
బుద్ధుని కాలంలో శ్రావస్తి నగరంలో ఒక దంపతులుండేవారు. వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.
భార్య పేరు సోనా. ఆమెను అందరూ పిల్లల కోడి అనేవారు. ఆమెకు పదిమంది సంతానం. పిల్లను, కానీ, పెంచి, పోషించేది.
కను రెప్పల కంటే మిన్నగా వారిని ఆదరించేది. ఒకరి తరువాత ఒకరి వివాహాలు అయ్యాయి.
అందరూ ధనవంతులు కాబట్టి, సంఘంలోను, ఇంట్లోను ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేవి.
సోనా భర్త బౌద్ధ మతంపట్ల ఆసక్తిగా ఉండేవాడు. వృద్దుడయ్యాడు. అప్పటి వరకు గృహస్థాశ్రమంలోనే గౌతమ బుద్ధుని బోధలు పాటిస్తూ ఉండేవాడు.
ఇక సానా సన్యాసిగా మారదలచాడు. ఈ మాటను భార్యకు చెప్పాడు. ఆమె మనస్సు చివుక్కుమంది.
అయినా భర్త ఆధ్యాత్మికలో అడుగిడుతుంటే సంతసించి అంగీకారం తెలిపింది.
ఆయన ఇల్లు విడిచి బౌద్ధ సన్యాసి అయ్యాడు. కొంత కాలం తరువాత, సోనా కూడా గృహస్తాశ్రమంలో ఉంటూ బుద్ధుని బోధలు పాటిద్దామనుకుంది.
ఆస్తి అంతటిని – తనకంటూ ఏమీ ఉంచుకోకుండా – పంచింది. ఇక కొడుకులు, కోడళ్ల పెత్తనంలో జీవితం గడపవలసి వచ్చింది. ఒకప్పటి పులి, నేడు సర్కసు పులిలా అయింది. ఆమె జీవితం.
ఆమె బౌద్ధ సన్యాసినుల బోధలను విన్నది. మనసులో ఆలోచనలు కలిగాయి – తాను నిష్కామంగా బిడ్డలను సాకిందా? ఆ పిల్ల నుండి ముందు, ముందు ఏమీ ఆశించకుండా పెంచి పెద్ద చేసిందా? తాను అలా చేయలేదు అనిపించింది.
ఇక బిడ్డల దోషం లేదు. ఏదో కోరిక – పెద్దతనంలో ఆదుకుంటారనే ఆశతోనే ఆమె బిడ్డలను సాకింది.
ఇక ఆమె గౌతమ బుద్ధుని శరణు వేడింది. బౌద్ధ సన్యాసినిగా ఆ ఆరామంలో ఉండిపోయింది. అయితే వెంటనే ఆమె ఇతర సన్యాసినులతో కలవలేకపోయింది.
ఒకనాడు సోనాను ఇతర సన్యాసినులు బయటకు పోతూ, తాము వచ్చేటప్పటికి, నీటిని తెచ్చి వేడి చేసి ఉంచమని చెప్పిపోయారు.
ఇక సోనా దీర్ఘ ఆలోచనలో పడ్డది. ఇతరులకు తనకు మధ్య ఉన్నది ఒక తెర అని గమనించింది. తానెవరు? ఇతర భిక్షణులు ఎవరు? అనే తాత్విక చింతనలో మునిగిపోయింది.
ఆ మానసిక కృషిలో సత్యం తళుక్కున మెరిసింది. ఆమెకు మహదానందం కలిగింది.
భిక్షిణులు తిరిగి వచ్చారు, వేడి నీటి కోసం. సోనా నీరే తేలేదు, నిప్పు అంటించలేదు. పాత్రలో నీరు పోయలేదు.
ఆమె నీటి పాత్రల వంక చూచింది. అంతే! వెచ్చని నీటితో నిండాయి ఆ ఖాళీ పాత్రలు. ఈ విషయాన్ని బుద్ధునికి చెప్పారు సన్యాసినులు.
“అవును సాధక జీవితాన్ని సత్యాన్వేషణకు క్షణ క్షణం ఉపయోగించాలి. సోమరిపోతుల్లా జీవించరాదు. సోనా సాధకుని స్థాయి నుండి అర్హత స్థాయికి చేరింది” అన్నాడు బుద్ధుడు. (తేదీ వివరాలు అలభ్యం)
సాధన చేయుమురా నరుడా! సాధ్యము కానిది లేదురా!!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- ఆనందదాయకుడు…. మహనీయులు – 2020 – జనవరి 23
- బుద్ధునకు షరతులా!? …. మహనీయులు – 2020… సెప్టెంబరు 2
- ఏ దేశమేగినా…. …. మహనీయులు – 2020… మే 3
- కృషి…. మహనీయులు – 2020…ఫిబ్రవరి 8
- మహా భిక్షు …. మహనీయులు – 2020… మే 24
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments