Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా తన భక్తులు తనపై చూపే భక్తి కన్నా, సేవ కన్నా తాను నిర్వహించవలసిన కర్తవ్యమును చేయమని తెలిపేవారు.
కర్తవ్య నిర్వహణ అనంతరమే భక్తి అని తెల్పెడి వారు. ప్రథాన్ భార్య సాయి పూజ చేయుటకు ద్వారకామాయికి రాగా, ముందు వాడాలో ఏడ్చుచున్న పసిబిడ్డ వద్దకు పంపాడు.
షిరిడీలో ఒక రైతు ఉండేవాడు, పేరు అనంతరామ్ శివరాం పాటిల్ గోండ్కర్. అతను ఉదయం లేవగానే ద్వారకామాయికి పోయి భక్తితో నమస్కరించే వాడు.
సాయి స్వయంగా సపత్నేకర్ అనే భక్తునితో ‘అరె మాటిమాటికి ఎందుకు నమస్కారంపై నమస్కారం. గౌరవదరాలతో ఒకసారి చేస్తే చాలు” అన్నారు.
ఆ మాటలను క్రియ రూపంలో చూపే వాడు శివరాం పాటిల్. ఒక్క నమస్కారం భక్తితో చేస్తే చాలు. మనసు వేరొకచోట పెట్టుకుని తనువుచే పదే పదే నమస్కారములు, ఆనవాయితీగా చేసిన ప్రయోజనం ఉండదు.
అందుకే కాబోలు వేమన “భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు” అన్నాడు.
ఈయన ఎన్నడును అయోగ్యమైన పనికి డబ్బిచ్చే వాడు కాదు. గ్రామస్తులు అందరు పిసినిగొట్టు అనేవారు ఈయనను.
ఈయనకు చదవటం, వ్రాయటం రాదు. వచ్చినది సేద్యం చేసుకోవటం, సోదరి గోపబాయి ప్రభావంతో పాండురంగడి వైపు ఆకర్షితుడైనాడు.
తుకారాం గారి 20 , 25 అభంగాలు నోటికి వచ్చును. సమయం దొరికినప్పుడల్లా, అభంగాలను పాడుకునేవాడు.
సాయిబాబా క్షణం వృథా చేయరాదు అనేవారు, సాయి అట్లే తన జీవితాంతం ఆచరించాడు.
అయితే సాయి భక్తిని జీవితాంతం మరువలేదు. ఒకసారి అయన ఉదయాన్నే గడ్డం గీయించుకుని వచ్చాడు ఇంటికి, స్నానానికి వేడి నీరు కాస్తున్నారు ఇంటిలోని వారు.
వేడి నీరు కాగే వరకు సమయాన్ని ఎందుకు వృథా చేయటం అని, గోడకు చెరబడి తుకారాం అభంగాలను పాడటం మొదలుపెట్టాడు.
అట్లా పాడుతూ, పాడుతూ అక్కడే ఆ అనంతరామ్ శివరాం పాటిల్ గొండ్కర్ అనంతుని వద్దకు చేరుకున్నాడు. ఆ దినం మార్గశిర శుద్ధ దశమి, ఆదివారం.
అలా సునాయాసంగా శరీరాన్ని త్యజించటం మహాల్సాపతికే చెందింది. కాకా సాహెబ్ దీక్షిత్ కే చెల్లింది, అనంతరామ్ కే చెల్లింది.
జీవితంలో ప్రతి క్షణాన్ని భగవంతునికి అర్పించిన వారు మాత్రమే ఇటువంటి సునాయాస మరణాన్ని పొందటమే కాదు, తుది శ్వాస తీసుకునేటప్పుడు కూడా భగవంతుని నామం ఉచ్చరిస్తూ భగవంతుని వద్దకే చేరతారు.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- నమ్మినవారు నవ్వులపాలు కారు! …..సాయి@366 మే 15….Audio
- చిన్ని నా బొజ్జకు …..సాయి@366 డిసెంబర్ 17….Audio
- భక్తి ప్రదర్శన ….సాయి@366 డిసెంబర్ 8….Audio
- తల్లిని మరువని బిడ్డ …..సాయి@366 డిసెంబర్ 16….Audio
- రాత్రి నిద్రించని సాయి…..సాయి@366 డిసెంబర్ 21….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments