Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
గోవిందుడు అందరి వాడైనట్లు సాయి కూడా అందరి వాడే. బాబా భక్తులందరూ బాబా యెడల భక్తిని చూపిన చాలదు.
ఎందుకంటే గతంలోని సాయి భక్తులు, సాయి భక్తులు కానీ వారికి, సాయి భక్తులకు అనేక సేవలు చేసేవారు. భక్తి అని బాబాను పూజించిన చాలదు అని ఆ భక్తుల జీవితాలు తెలుపుతాయి.
నానా సాహెబ్ చందోర్కర్ సాయిని గూర్చి ఇతరులకు చెప్పి ఆ అద్భుతాన్ని వారు కూడా ఆస్వాదించేటట్లు చేశాడు. నానా ఇంకా ఇతరుల వ్యాధులను వరప్రసాదమయిన ఊదీతో తొలగించాడు.
శ్రీ శివనేషన్ స్వామీజీ వివిధ భాషలలో ఉన్న సాయి తత్వాన్ని, గాథలను ఇతరులకు వివరించి చెప్పేవారు.
డిసెంబరు 3 , 1923 న అందరూ చూచుచుండగా ఒక చిన్నారి పాపకు కారు ప్రమాదం జరిగింది.
అక్కడే ఉన్న నాచ్నే “బాబా! పాపను కాపాడు” అని ఆర్తితో ప్రార్దించాడు. ఆ కారుకు బ్రేకులు పాడైనవి. అయినను కారు ఆ పాపకు మెల్లగా గుద్ది అగిపోయింది.
కారు ఆగకుంటే ఆ పాప మీద నుండి పోయేది. అయితే బ్రేకులు పనిచేయని ఆ కారు హఠాత్తుగా నిలచిపోయిందట. “ఇది సాయి బాబా ప్రార్థన యొక్క దివ్య లీల” అంటాడు నాచ్నే.
ఇక ఆ పిల్లను వెంటనే ఆసుపత్రికి తీసుకుపోయాడు నాచ్నే. పాపని పరీక్షించిన డాక్టరు, ఆ పిల్ల బ్రతకటం కష్టం అని చెప్పాడు. కానీ నాచ్నే “బాబా ఆ పాపను కాపాడతాడు” అని నిశ్శంసయంగా చెప్పాడు.
ఆ పాప 15 రోజులు హాస్పటల్ లో ఉండి పూర్తిగా కోలుకుంది. ఇదీ సాయి కరుణే. అంటే ఆమె సుమారు డిసెంబరు 17 న ఇంటికి వచ్చింది.
అయితే ఆ పిల్లకు మాట పడిపోయింది. పిల్ల బ్రతికిందని సంతసించాలా? మాట పోయిందని విచారించాలా? అలా 9 నెలలు గడిచాయి.
దాసగణుకు ఈ విషయం చెప్పాడు నాచ్నే. దాసగణు ఆ పాప నోటిలో ఊదీ వేయమని సలహా ఇచ్చాడు.
నాచ్నే ఆ పాప నోటిలో ఊదీ వేయగానే వెంటనే మాట్లాడసాగింది. ఇదంతా సాయి లీలయే గదా!
సాయి భక్తులు తాము భక్తి మార్గంలో నడుస్తున్నా ఇతరులకు సేవ చేయటం మరువరాదు. ఈ సంఘటన అదే చెబుతుంది.. సాయిని అందరి కోసం ప్రార్ధించాలి.
చిన్ని నా బొజ్జకే కాదు అందరకు శ్రీ సాయి రక్ష ఉండాలి.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- బాబా నన్ను క్రింద పడకుండా పట్టు కున్నారు….Audio
- మొదటి మాసికము…..సాయి@366 నవంబర్ 13….Audio
- దెబ్బకు దెబ్బ…..సాయి@366 నవంబర్ 21….Audio
- సాయి! కన్నులలో నీరెందులకు?…..సాయి@366 నవంబర్ 1….Audio
- నామ స్మరణ…..సాయి@366 మార్చి 31….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments