Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా జలాలుద్దీన్ రూమీని గూర్చి పలికారు. దైవాన్ని చేరటానికి కవిత్వం, సంగీతం, నృత్యం కూడా సాధనాలంటారు రూమీ.
సాయి ఆధ్యాత్మిక మార్గంలో అప్పుడప్పుడు కానవచ్చే సిద్ధులను గూర్చి తీవ్రంగా హెచ్చరించారు. అట్లాగే రూమీ కూడ.
రూమీకి ఎందరో శిష్యులున్నారు. ఆ శిష్యులలో ఒకరి వద్ద పనిచేసే పనిపిల్లకు సిద్దులు కలిగాయి. తనకు సిద్దులు కలగలేదని, ఆ శిష్యుడు తన గురువైన రూమీతో చెప్పాడు.
” కొందరి కనుపాపల్లో వింత దృశ్యాలు కనబడతాయి. వాటికి భ్రమపడి మోసపోతారు. అట్టి శక్తిని నాకు భగవంతుడు ఇచ్చి గొప్పవాడిని చేశాడు అనుకుంటారు వారు.
మరి కొందరికి వింత దృశ్యాలు కానరావు. ఒకానొక సమయంలో వారికి అప్రమేయమగు దివ్యానుభూతి కలుగుతుంది. అదే శాశ్వత భాగ్యము” అని సమాధానమిస్తారు రూమీ.
శిష్యునకు ఎలా ప్రవర్తించాలో, వేటి కొరకు తపనపడాలో అర్థమైంది.
రూమీ ‘దివానీ షంసీ తాబ్రీజ్, మాన్నవీ-ఇ-మానవి’ మొదలైన కృతులెన్నో రచించారు.
ఆయన రచన ‘దివానీ’ భగవంతుని గులాబీ వన వర్ణనమే పాటకు పల్లవి.
జీవుడు ‘బ్రహ్మైక్యాన్ని సాధించే ఆ గులాబీ వనానికే మన యాత్ర!” అంటారాయన.
ఆ దారిలో రాలిపోయే గులాబీ పుష్పాలే మన జీవితాలు. మనం మన జీవితాన్ని ఎంత కళంక రహితంగా దైవానికి ఏమి ఇవ్వగలం?
ఆయన (రూమీ) ఇలా వ్రాసారు –
“నీకు ఏదైనా కానుక నీయాలని నేనెంత అన్వేషించానో నీకు తెలియదు, సరైనదేదీ దొరకలేదు. బంగారు గనికి బంగారాన్ని, జల నిధికి నీటిని కానుకగా ఇవ్వటం ఏం బావుంటుంది?
నా హృదయాన్నో, ఆత్మనో ఇవ్వాలను కోవటం ఉచితం కాదు, ఎందుకంటే,
అవి అప్పటికే నీకు సమ్పరించేశాను.
అందుకే, ఒక దర్పణాన్ని (అద్దాన్ని) తీసుకొచ్చాను,
దానిలో నిన్ను చూసుకొని, నన్ను గుర్తు చేసుకో!…”
నేడు డిసెంబర్ 17. ఆయన 1273లో దేహాన్ని వదిలారు.
నేడు ఆయన వర్థంతి.
ఆయనను ఆయన మాటలలోనే ఇలా స్మరిద్దాం –
“మీ అందరికి నేనిచ్చే సందేశమిదే, ఇంటను, బయటకు భగవంతుని సేవిస్తూ, మీ జీవితాలను పవిత్రంగా ఉంచుకోండి. స్వల్పంగా తింటూ, కొద్ది సేపు నిద్రిస్తూ, కొద్ది మాత్రంగానే మీరు మాట్లాడాలి. ఇతరులను మంచి దారిన పెడుతూ కొద్దిగా మాట్లాడే వానిదే ఉత్తమ ప్రవచనం”.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- నీకు అర్ధం కాదులే! …. మహనీయులు – 2020… నవంబర్ 15
- తెలియగ లేరే నీ లీలలు …..సాయి@366 అక్టోబర్ 17….Audio
- ఎచట నుండి వీచెనో …. మహనీయులు – 2020… మార్చి 13
- దైవమె సుమా! .. …. మహనీయులు – 2020… డిసెంబరు 29
- పరీక్షలున్నాయి … …. మహనీయులు – 2020… డిసెంబరు 5
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments