పరీక్షలున్నాయి … …. మహనీయులు – 2020… డిసెంబరు 5



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా పరీక్షలు పెట్టేవాడు. చాలాసార్లు అవి పరీక్షలని ఎవరికి తెలియదు. లద్దగిరి పొలిమేరలలో డిసెంబర్ 5, 1893న మహాసమాధి చెందిన రామదాసు స్వామి కూడా అంతే.

ఒకసారి స్వామి వద్దకు కర్నూలు నుండి సుబ్బారావు గారు వెళ్ళినాడు. అయితే సుబ్బారావు అక్కడకు చేరే ముందే స్వామి విస విస నడచి కొండ వైపు వెళ్లిపోయారు.

సుబ్బారావు వచ్చి విచారించగా, స్వామి కొండ వైపు వెళ్లారని తెలిసి అతను కూడా అటే వెళ్లాడు.

స్వామి  కొండపై నున్నారని తెలిసి పట్టుదలతో, కొండ ఎక్క ప్రయత్నించాడు. అలసిపోయి క్రింద పడపోయినాడు.

స్వామి వచ్చి హిందీ భాషలో మాట్లాడినారు. సుబ్బారావు ఇంటికి వెళ్లాడు. అపశకునాన్ని శంకిస్తూ. భార్య చనిపోయింది.

మరోసారి సుబ్బారావు స్వామి దగ్గరకు పోగా, స్వామి అంగ వస్త్రములో మలము విసర్జించి తినుమని సుబ్బారావు కి ఇచ్చారు.

భక్తులందరూ నిశ్చేష్టులయి చూస్తున్నారు. సుబ్బారావు సందేహించకుండా తినబోయినాడు. ఆ మలము మృష్టాన్నముగా మారింది. పరీక్షలో నెగ్గాడు.

“నీకు మరల పెండ్లి అవుతుంది” అని దీవించారు స్వామి. అటులనే జరిగింది. భార్యతో స్వామిని దర్శించాడు సుబ్బారావు.

“నీకు తగిన శాస్తి జరుగుతుంది” అన్నారు స్వామి. సుబ్బారావు కంగారుపడలేదు. జిల్లా అధికారిగా నియమించబడ్డాడు సుబ్బారావు. అది స్వామి అనుగ్రహమే.

ఆయన (స్వామి) నిరంతరం రామ నామం జపించేవారు. ఒకసారి అయన హంద్రీ నది ఇసుకలో కూరుకు పోయినారు. రామనామం మాత్రమే వినవస్తుంటే, ఆయన భక్తులు, “ఇసుకను త్రవ్వి స్వామిని పైకి తీశారు.

మరోసారి ఆయన ప్రవహించే నదిపై తుండు గుడ్డ పరచి, దానిపై రాజహంస వలె తేలేవారు.

లద్దగిరిలో శరభమ్మ అనే ఇల్లాలు స్వామికి చద్ది రొట్టెలు ఇచ్చేది. ఒకసారి ఆమెకు జ్వరం వచ్చింది. అది క్షయగా మారింది.

ఆమె విచారించసాగింది. కారణం తనకు క్షయ రోగం వచ్చినందుకు కాదు, స్వామికి రొట్టెలను పెట్టలేకపోతున్నాననే బాధ.

ఒక రాత్రి స్వామియే ఆమె ఇంటికి వచ్చి “శరభమ్మా! చాల దినాలైంది నీవిచ్చిన రొట్టె తిని, ఆకలేస్తున్నది, రొట్టెలు తినిపించు” అన్నారు.

ఆయాసపడుతూ, ఓపికతో ఆమె రొట్టె తయారు చేసి స్వామికి తినిపించింది. స్వామి కొంత తిని మిగిలినది ఆమెకిచ్చారు.

ఆమె దానిని మహాప్రసాదంగా స్వీకరించింది. గాథ అంతటితో ఆగిపోలేదు.

రెండు, మూడు రోజులలో క్షయ రోగం తొలగిపోయి, మామూలు మనిషి అయి, స్వామిని సేవించసాగింది. అడిగితె, అంతవరకే. అడగకుంటే అన్నీ ఇస్తారు స్వామి.

స్వామి డిసెంబర్ 5న లద్దగిరిలో మహాసమాధి చెందినా నేటికి పలుకుతారు.

నేడు డిసెంబర్ 5. ఆయన వర్థంతి. స్వామిని స్మరిద్దాం!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles