Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయి షిరిడీలో అడుగు పెట్టినప్పటి నుండి వైద్యం చేస్తూనే ఉన్నాడు. మంచి హకీం అనే పేరు తెచ్చుకున్నాడు.
ఆయన వైద్య సహాయం అందవేసిన సంఘటనలు ఎన్నో చిత్రాతి చిత్రంగా ఉంటాయి.
వైద్య ప్రక్రియలన్నిటినీ ప్రయత్నించినా తగ్గక, షిరిడీలోనే ప్రాణం విడుద్దామని వచ్చి, ప్రాణం విడచిన మలన్ బాయికి జీవం పోసాడు సాయి.
ఏ వైద్యం అక్కరకు రాకపోగా, సాయియే శరణ్యమని నమ్మి, నలుగురు ద్వారకామాయికి మోసుకురాగా, సాయి కరుణచే నడవగలిగి, రాత్రికి రాత్రే రోగ విముక్తుని చేశారు భీమాజీ పాటిల్ అనే వ్యక్తిని.
ఇంకా సాయి కొనఊపిరులకు ఊపిరి ఊదాడు అనేక సందర్భాలలో, ఊదీతోనే వ్యాధిని ఊదేశాడు సాయి.
సాయి మహా సమాధి చెందినంత మాత్రాన భక్తునకు సాయి దూరం కాడు.
అదీ కాక తన షిరిడీ సంస్థానంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని ఎలా మరుస్తాడు. భీకాజీ మహాదేవ్ బిద్వే సాయి సంస్థానం, షిరిడీలో చిన్న ఉద్యోగి.
నెలకు రూ. 36 /- జీతంతో సంసారాన్ని నడిపేవాడు. అదీ గాక ఆయనకు చెబుతాయి అనే చెల్లెలు ఉంది.
ఆమె ఆరోగ్యం కుంటుపడ్డది. వైద్యం చేయించాలంటే డబ్బు కావాలి . డబ్బు పెట్టలేని స్థితి మహాదేవ్ ది.
ఆయన చెల్లెలు కూడా బాధను వీలైనంత వరకు భరిస్తూనే వచ్చింది. సాయి ఎప్పుడూ వాడే పదం – ఓర్పు, ఆ పదం ఊతతోనే కొన్ని నెలలు గడుపుకుంటూ వచ్చింది.
ఆ రోజు 1951 డిసెంబరు 5 . ఆమె పరిస్థితి గడ్డుగా ఉన్నది. ఆమెను అతడు డాక్టరు దగ్గరకు తీసుకుపోదామన్నాడబ్బు లేదు.
సాయి కొలువుకు బయలు దేరాడు సాయిపైనే భారం వేశాడు. భక్తుడైన ఒక వృద్ధ కాక్టరు ఆఫీసుకు వచ్చి భీకాజీతో మాట్లాడసాగాడు.
భీకాజీ ఆయనను గుర్తించలేకపోయాడు. తనను తానే పరిచయం చేసుకున్నాడు ఆ డాక్టరు.
తన సోదరిని చూడవలసిందిగా డాక్టరును కోరాడు. డాక్టరు సంతోషంగా భీకాజీ ఇంటికి వెళ్లి అతని చెల్లిని పరీక్షించి, చికిత్స చేసి వెళ్ళాడు. ఆమెకు వ్యాధి పోయింది.
ఇంతకూ ఆ వైద్యుడెవరో?
వైద్యో నారాయణో సాయి:
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy..
Latest Miracles:
- తల్లిని మరువని బిడ్డ …..సాయి@366 డిసెంబర్ 16….Audio
- తెలియగలేరే నీ లీలలు! …..సాయి@366 ఆగస్టు 26….Audio
- బాధే సౌఖ్యం…..సాయి@366 అక్టోబర్ 31….Audio
- భోళా సాయి! …..సాయి@366 మే 31…Audio
- వైద్యులకే వైద్యుడు! …..సాయి@366 మే 9….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments