Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
కొలిమిలో పడబోతున్న పసిబిడ్డను కాపాడాడు సాయిబాబా 1910 ధనత్రయోదశి నాడు.
”సాయిబాబాది మూర్తీభవించిన పరోపకారం. వారు పరోపకారం కోసం తమ శరీరాన్ని శ్రమపెడతారు” అంటారు హేమాద్‌పంత్.
భక్త రక్షణ సాయిలో ఉన్నది. పోతన మహాభాగవతంలో మహావిష్ణువు చేతిలో ఏ ఆయుధం లేకుండానే (ధరించకుండానే) గజేంద్రుని వద్దకు పోయి ప్రాణరక్షణ చేశాడు, గజేంద్రుని ఆర్తనాదం విని.
ఇక సాయి కూడా ఏ ఆయుధం లేకుండానే, ఆ పసిబిడ్డ ఏ ఆర్తనాదం చేయకుండానే, కాలు కదపకుండా కాపాడాడు.
అయితే మహావిష్ణువును మించిన భక్త రక్షణ సాయిలో ఉంది. భక్తుని కాపాడే తొందర్లో తన చేతికి గాయమవుతుందన్న ఆలోచనే లేకుండా, తన చేతిని కొలిమిలో పెట్టి బిడ్డను కాపాడతాడు సాయి.
”ఇదేమిటి బాబా” అంటే ”ఈ చేయి కాలితే కాలనీ, బిడ్డ ప్రాణం దక్కింది కదా!” అంటాడు సాయి.
పోనీ, చేయి కాలితే కాలింది మందూమాకూ ఇప్పించేందుకు నానా సాహెబ్ చందోర్కరు బొంబాయి నుండి డాక్టరు పరమానందను వెంటపట్టుకొచ్చాడు.
”నా వైద్యుడు అల్లాయే” అని ఆ డాక్టరును మందుల పెట్టె తెరవనివ్వలేదు సాయి. కొంత కాలం (3, 4 రోజులు) ఆ డాక్టరు అక్కడే ఉన్నాడు సాయి మనసు మార్చుకుని కాలిన చేయి చూపిస్తాడేమోనని. సాయి ససేమిరా అందుకు అంగీకరించలేదు.
అంటే, సాయిబాబా డాక్టరుకు అన్ని రోజులు తన సందర్శన భాగ్యాన్ని ప్రసాదించారని అనుకోవాలి. ఎందుకంటే సాయి సమకాలికుడైన రామకృష్ణ పరమహంస డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ వద్ద వైద్యం చేయించుకునేవాడు.
కారణం ఏమి చెప్పారంటే ఆయన (డాక్టరు) మందు ఇచ్చే సమయంలో తనను (రామకృష్ణ పరమహంసను) స్మరించటానికే అని.
సాయిబాబా ఇంకా భాగోజీ షిండేతో కాలిన చేతికి కట్టు కట్టించుకున్నారు దాదాపు ఎనిమిది ఏండ్ల వరకు.
ఎనిమిది ఏండ్లవరకు తగ్గని గాయమా సాయిది? అన్ని సంవత్సరాలను తనను సేవించే భాగ్యాన్ని ప్రసాదించాడు భాగోజీ షిండేకు.
సాయి తన ఒక్క చేష్ట వలన బిడ్డను కాపాడాడు, దర్శన భాగ్యాన్ని, సేవా భాగ్యాన్ని, ఇలా ఎన్నో రకాలుగా కలుగచేశాడు.
”ఓం అవ్యాజ కరుణాసింధువే నమః ”
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- వేయి కనులు చాలవుగా!…..సాయి@366 అక్టోబర్ 7…Audio
- భోళా సాయి! …..సాయి@366 మే 31…Audio
- చోర్ – పోలీస్…..సాయి@366 అక్టోబర్ 14….Audio
- ఔనా! నిజమేనా?…..సాయి@366 జూన్ 17….Audio
- సాయి అభిన్నత్వం…..సాయి@366 సెప్టెంబర్ 2….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “బాధే సౌఖ్యం…..సాయి@366 అక్టోబర్ 31….Audio”
K v sasidhar
November 2, 2020 at 4:00 pmThis is a very great work by Saileelas.com..thank you so much