అర్ధం కాదు పరమార్ధం…..సాయి@366 అక్టోబర్ 30….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యాన్ని నిర్వర్తించటానికి జన్మిస్తుంటారు. ఆ సంగతి వారికే తెలుస్తుంది.

ఐ.సి.ఎస్‌.లో ఉత్తీర్ణుడైతే అరవిందులు భారతమాతకు ముద్దు బిడ్డ అయ్యేవారా? అలాగే శ్రీ ఎక్కిరాల భరద్వాజగారు కూడా వారు కూడా ఐ.ఏ.ఎస్‌.లో చేరివుంటే మహాత్ముల ముద్దు బిడ్డడై ఉండేవారా?

1963, ఫిబ్రవరి 9న షిరిడీ సాయి సమాధిని సందర్శించి బ్రహ్మానుభూతిని పొందారు.

‘సాయిబాబా’ను విశ్వపురుషునిగా దర్శింపచేయాలనే తపన ఉన్నవారికి, శ్రీ శివనేశన్‌ స్వామి వారి అండ దొరికింది – బంగారు పళ్లేనికి గోడ చేరువ అయినట్టు.

ఇక ఆయన సాయినాథుని తత్వ వ్యాప్తి చేయ నారభించారు.

”చిరిగిన కఫ్నీయే చీనాంబరం,

తల చుట్టూ రుమాలే రత్న కిరీటం,

మసీదు ముంగిటనున్న రాయే సింహాసనం,

శిధిలమైన మసీదే రాజసౌధం,

చేతనున్న సటకాయే రాజ దండం

ధునిలోనున్న విభూతియే ధనాగారం” గా

సాయి ఆయనకు దర్శనమిచ్చినట్టున్నారు. లేకుంటే అంతగా సాయిని ఎవ్వరు వర్ణింపగలరు?

ఆయనను మహాత్ముల ముద్దు బిడ్డు అనుకొని ముచ్చటపడితే చాలదు. ఆ మహాత్ముల జీవనంలోని కొన్ని, కొన్ని అంశాలను ఆయన ఆచరించి చూపారు.

ఒక ఉదాహరణ: పెళ్లి అంటే పులి కాదనేవారు అనసూయమాత, జిల్లెళ్లమూడి అమ్మ. ఆయన ఆ విషయాన్ని ప్రపంచానికి రుజువు చేయదలచి వివాహం చేసుకుని, ఆధర్శపురుషు డయ్యాడు – ఆదర్శ దాంపత్యంతో.

సాయిని ఆయన దర్శింపచేయటమే కాదు, అర్థం అయేటట్టు సులభ రీతిని సాయి సాహిత్యాన్ని అందించటమే కాదు, సాయి కథలలోని, పలుకులలోని, అంతరార్థాలను అత్యంత సులువుగా, పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో వ్రాయటంలో ఆయనకు ఆయనే సాటి.

అవి దేశ, విదేశాలలోని వారు ఆనందించటం కృషితో సాధ్యమయ్యే పనియేకాదు. అంతటి కృపను పొందిన ఆచార్యులవారి సిద్ధులను ప్రస్తావించకపోవటమే సబబు.

ఆచార్యులవారు జన్మించిన దినం ముప్పదవ తారీకు, అక్టోబరు నెల (1938).

ఈ విశ్వంలోని మహనీయులలో సాయిని దర్శింపచేయగలిగిన ఆచార్యుల వారు ప్రాచ్యులలో ఆధునికుడు, ఆదునికులలో ప్రాచ్యుడు.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles