Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయి కరుణ ఈ విధంగా ఉంటుంది అని అంచనా వేయలేం. ఎవరిని ఏ విధంగా కటాక్షించాలో ఆయనకు తెలుసు.
సాయికి సేవ చేసిన భక్తురాలు లక్ష్మీబాయి షిండే. ఆమెకు సాయి తాను శరీరాన్ని వదిలేటప్పుడు 9 రూపాయలు ఇచ్చాడు.
వాటిని ఆమె ప్రాణప్రదంగా దాచుకున్నది – నేటికీ అవి ఆమె వారసుల వద్ద ఉన్నాయి.
సాయికి చందూలాల్ మెహతా అనే భక్తుడున్నాడు. ఈ చందూలాల్ సాయి శరణానంద అనుయాయుడు.
ఈయనకు కొన్ని ఏండ్ల పాటు రైల్వే టిక్కెట్లు వచ్చేవి. ఆ టిక్కెట్లతో ఆయన తన కుటుంబంతో (వెరసి 4 1/2) షిరిడీకి వెళ్ళి సాయిని దర్శించుకునే వారు.
గతంలో లాగా మరోసారి టిక్కెట్ల ఉదంతం నడిచింది. చందూలాల్ మెహతా, భార్య శ్రీమతి మనూబాయ్, ఆమె కుమార్తెతో కలసి సాయి శరణానంద మహా సమాధిని దర్శించుకున్నారు మార్చి 15, 1983న.
పూజా కార్యక్రమాలు ముగిసాయి. పూజారి వారికి ప్రసాదం ఇవ్వానికి ఒక తెల్లటి ప్లాస్టిక్ డబ్బాలో చేయి పెట్టాడు. చేతికి వచ్చిన ఒక ప్లాస్టిక్ సంచిని తిరిగి తీసుకుని వారి ముందే ఆ సంచిలోని రైల్వే టిక్కెట్లను తీశాడు. అవి 4 1/2 టిక్కెట్లు.
ప్రయాణపు తేదీ: 30.4.1983
రైలు : నవజీవన్ ఎక్స్ప్రెస్
అహ్మదాబాదు నుండి మన్మాడు వరకు
కంపార్టుమెంటు ఎస్-13
లోగడ కూడా ఇట్లాగే మూడు సార్లు ఆ కుటుంబానికి షిరిడీ పోవటానికి ఏర్పాట్లు చేశారు.
ఎవరో తెలియదు. సాయి కాక వారిపై అంత శ్రద్ధ చూపే వ్యక్తులు ఎవరుంటారు? ఈ సారి రైల్వే టిక్కెట్లును పూజారే స్వయంగా ఇవ్వటం జరిగింది.
ఇదంతా సాయి లీల అని వారు గ్రహించి పరవశులైరి. ఇది అపూర్వమైన వింతయే.
గతానికి ఇప్పటికి కాస్త తేడా చూపించాడు చందూలాల్ మెహతా.
41/2టిక్కెట్లతో షిరిడీ యాత్ర చేయకుండా, స్వంత ధనంతో 41/2 టిక్కెట్లు కొనుక్కొని సాయినాథుని దర్శించుకున్నాడు.
ఆ టిక్కెట్లను ఆయన సాయి ప్రసాదంగా భద్రపరచుకున్నాడు. అది నిజంగా సాయి ప్రసాదమే!
లక్ష్మీబాయి షిండేకి ఇచ్చినటు వంటి 9 రూపాయలే అవి!
సాయి ఇచ్చే ప్రసాదాలు విచిత్రంగా ఉంటాయి.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- వైష్ణవ జనతో… …. మహనీయులు – 2020… అక్టోబరు 2
- ప్రసాదం – ధన ప్రసాదం…..సాయి@366 ఆగస్టు 19….Audio
- బాధల బదిలీ…..సాయి@366 డిసెంబర్ 18….Audio
- అదా కారణం!…..సాయి@366 ఆగస్టు 1…Audio
- నిజ భక్తుల కోసం బాబా స్వయంగా వ్యక్తమవుతారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments