Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా భక్తులకు సాయం చేస్తారన్నది అందరకు విదితమే. అయితే ఏరకంగా చేస్తారో, ఊహకు అందదు.
నానా సాహెబ్ చందోర్కరుకు భిల్లుని రూపంలో నీటిని ఇచ్చాడు.
బాలారాం మన్కడ్‌కు పల్లెటూరి బైతు రూపంలో టికెట్లు ఇచ్చాడు.
డేంగ్లే పొలంలో, సాయి తన రూపంలోనే కనబడి బిడ్డను వర్షం బారినుండి కాపాడాడు.
అలా ఎన్నో, ఎన్నెన్నో! మహా సమాధి అనంతరం?
అది 1956వ సంవత్సరంలో ఎస్.ఎస్.సి. పరీక్షలు చివరి రోజు తరువాత జరిగిన సంఘటన. అంటే స్కూలు సెలవులలో జరిగినది.
ఒక విద్దార్ధి ఎస్.ఎస్.సి. చివరి పరీక్ష వ్రాసాడు. జ్వరం వచ్చింది. అతనికి తండ్రి లేడు. జ్వరంలోనే గడ్డ లేచింది. అయినా అది తగ్గింది.
కానీ కాళ్ళు చచ్చుబడ్డాయి. నడవలేకపోతున్నాడు. అతని తల్లి కలవరపడ్డది. వైద్యం చేయించింది. డబ్బు ఖర్చు అయింది గాని వ్యాధి తగ్గలేదు.
ఎవరో షిరిడీ సాయినాథుని మహత్మ్యం గూర్చి తెలిపారు. ఆమెలో ఆశ జనించింది.
ఆశతో బాటుగా భక్తి కూడా మొదలైంది. ఆ తల్లి, కుమారులు ప్రయాసతో షిరిడీ చేరుకున్నారు.
ఆమె కుమారుని బాబా మహా సమాధి దగ్గరకు తీసుకుపోతానంటే అతడు రానన్నాడు. కారణం సాయిపైన భక్తి లేక కాదు. తనను ఎవరో మోసుకుంటూ తీసుకువెళ్లాలి. అది అతనికి నచ్చలేదు.
అందరూ నవ్వుతారని అతని బాధ. ఆమె ఒంటరిగానే సమాధి మందిరానికి, ద్వారకామాయికి వెళ్ళి బాబాను వేడుకుంది.
రెండవ రోజు కూడా అంతే. మూడవ రోజు కూడా అతను రానన్నాడు. ఆమె కాకడ ఆరతికి వెళ్ళి ఎంతో ఆర్తితో సాయిని ప్రార్ధించి బసకు వచ్చింది.
గదిలో పిల్లవాడు లేడు. ఆమె ఆశ్చర్యపోయింది. దుఃఖం ముంచుకు వచ్చింది.
మరల సమాధి మందిరం దగ్గరకు పోయి సాయిని కన్నీటితో ప్రార్ధించింది. వెనుకకు తిరిగి చూచింది.
ఒక స్తంభాన్ని పట్టుకుని నిల్చున్న కుమారుడు కనిపించాడు. ఆమె ఆశ్చర్యపోయింది.
కుమారుడు చెప్పాడు – సాయి అతని ముందు నిలబడి ”లే” అన్నాడని, అలా సాయి అనగానే, తాను లేచానని, సాయి తనను సమాధి మందిరములోనికి తెచ్చాడని చెప్పాడు. అది సాయి లీలే అనుకున్నది ఆమె.
కుమారునికి ఊతమిస్తూ సాయికి నమస్కారం చేయించింది. మెల్ల మెల్లగా ఒక నెల తిరిగేసరికి తన కాళ్ళ మీద నిలబడి నడవసాగాడు కుర్రవాడు. ఆ రోజు ఏప్రిల్ 29.
ఇది భక్తికి సాయి ఇచ్చే ప్రతిఫలం!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సజీవ గురువు! …..సాయి@366 ఏప్రిల్ 13…Audio
- మూకం కరోతి వాచాలం …..సాయి@366 మార్చి 29….Audio
- సాయి సేవలో 65 ఏండ్లు …..సాయి@366 ఏప్రిల్ 23….Audio
- కర్రలతో కొడతాను…..సాయి@366 నవంబర్ 5….Audio
- మనసెరిగినవాడు మా దేవుడు …..సాయి@366 ఏప్రిల్ 6….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “లే! నడువు!! …..సాయి@366 ఏప్రిల్ 29….Audio”
Puli Purushotham reddy
April 29, 2021 at 11:16 amOm Sai Ram Jai Sai Master🙏