Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
తుకారాంకు ఒకనాటి రాత్రి స్వప్నం వచ్చింది. 300 సంవత్సరముల క్రిందటి బాబాజీ చైతన్య అను మహాత్ముడు స్వప్న దర్శనంతో పాటు మంత్ర దీక్ష నొసంగాడు.
బాబాజీ చైతన్యుల వారే తుకారాం గురువు. తుకారాంకు అట్టి గురువును ప్రసాదించింది పాండురంగడే.
గురుగీత పారాయణం చేస్తే సద్గురువు లభ్యమవుతాడని తెలుసుకున్న వినాయక దాజీభావే ఏప్రిల్ 13, 1932లో గురుగీత పారాయణ ప్రారంభించాడు శ్రద్ధతో.
నెల రోజులపాటు పారాయణ చేశాడు. స్వప్నమూ రాలేదు, ఆశించినట్లు దత్త దర్శనము కాలేదు.
ఆయనకు గురువు లభించాలని తపన. ఎటొచ్చి ఆ గురువు భౌతికంగా ఉండలనేది ఆయన ఆకాంక్ష. ఆయనకు మహా సమాధి చెందిన గురువులు అక్కరలేదు.
తుకారాంకు ఏనాడో సమాధి చెందిన బాబాజీ చైతన్య గురువు అయ్యాడు. మొన్నటి శ్రీ బి.వి. నరసింహ స్వామికి కొన్ని ఏండ్ల క్రితమే సమాధి చెందిన సాయిబాబా గురువయ్యాడు. నిన్న, మొన్నటి శ్రీ శివనేశన్ స్వామి గారి సంగతి అంతే.
వినాయక ఒక గురువారం దత్త మందిరానికి వెళ్ళాడు. ఆ దత్త మందిరంలో దత్తుడు ఉండవలసిన చోట ఒక చక్కని సమాధి దర్శన మిచ్చింది. ఇదేమిటా? అని అశ్చర్యపోయాడు.
మరునాడు ఆయన తన స్నేహితుని ఇంట సాయి మహా సమాధి చిత్రాన్ని చూచాడు.
తనకు దత్తమూర్తి స్థానంలో దర్శన మిచ్చినది సాయిబాబా మహా సమాధి అని గ్రహించాడు. అయినా అసంతృప్తిగా ఉన్నాడు సజీవ గురువు లభించలేదనే చింతతో.
ఒక వారం తరువాత ఆయన ఖేడ్ గాం భేట్ కు చెందిన నారాయణ మహారాజును దర్శించాడు. ఆయనే తన గురువుగా ఎంచుకున్నాడు.
ఏ గురువు పైసలు ఆ గురువువే. పైసలు అంటే శిష్యులు. సత్పురుషులు, సద్గురువులు ఇతరుల ఇలాకాలోని శిష్యులను తమ వైపుకు తిప్పుకోరు.
ఇక్కడ కూడా అదే జరిగింది. ఆ నాటి రాత్రి అతనికి కల వచ్చింది. ఆ కలలో నారాయణ మహారాజ్ ”నాకు, శ్రీ సాయి బాబాకు ఎటువంటి తేడా లేదు! అక్కడికి (షిరిడీకి) నువ్వెందుకు వెళ్ళలేదు?” అని ప్రశ్నించాడు. స్వప్నం అంతరించింది. మెలకువ వచ్చింది.
అతను షిరిడీ వెళ్ళి సాయిబాబానే తన గురువుగా భావించి ఆధ్యాత్మిక అభివృద్ధి పొందాడు. మనమూ సాయినాథుని పైసలమే.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- నీ కోసమే నే జీవించునది…..సాయి@366 అక్టోబర్ 27….Audio
- ఆనాడు ఈనాడు ఒకే స్పందన…..సాయి@366 ఏప్రిల్ 25….Audio
- కబీరు – సాయి…..సాయి@366 జూన్ 30…Audio
- మోక్ష గురువు …..సాయి@366 జూన్ 9…Audio
- గురువు తాను గురువును అని ఎవరికి చెపుకోడు,కానీ తన ఆచరణ ద్వారా తాను గురువు అని తెలుసుకుని సేవించుకోవలసినది మాత్రం మనమే.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments