Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
వియోగ బాధ ఎంతటి వారినైన కృంగదీస్తుంది! ఇక సామాన్యులైతే చెప్పేదేముంటుంది. జయదేవుని మరణ వార్త వినిన పద్మావతికి వెంటనే ప్రాణము పోయినది.
తమ గురువు, దైవము అయిన మెకన్‌దాదా సజీవ సమాధి చెందుతారని తెలిసింది శిష్యులకు, భక్తులకు.
అచ్చటనే ఉన్న ఐదుగురు శిష్యులు, వేరొక ప్రదేశంలో ఉన్న 15 మంది శిష్యులు మెకన్‌దాదా సజీవ సమాధి అగు సమయానికి తాము కూడా సజీవ సమాధి అగుట ఆశ్చర్యకరమైన వార్త అయినది.
జ్ఞానేశ్వరుని సజీవ సమాధికి కలవరం చెందిన నామదేవుడు, పాండురంగని దర్శనం వలన మరి కొన్ని సంవత్సరములు జీవించినాడు.
సాయిబాబా చరిత్రలో నానావళి పేరు తెలియని వారుండరు. సాయితో ఆయనకు సంబంధించిన విషయాలు అతి కొద్దిగా మాత్రమే తెలుస్తాయి.
ఆయన అసలు పేరు శంకరనారాయణ వైద్య. ఆయన పుట్టినప్పుడే నాసిక్ వెళ్ళే మార్గంలో ఉన్న నానావళి అనే మహాత్ముని సమాధి వద్ద తల్లి దండ్రులు వదలి వేశారని అనేక గాథలు వ్యాప్తి చెందాయి.
ఒకప్పుడు హిందువుగా, మరొకప్పుడు ముసల్మాన్‌గా, వేరొకప్పుడు నగ్నంగా ఉండేవారాయన, ధైర్యానికి, వైరాగ్యానికి మరో పేరు నానావళి.
ఆయన బాబాను ”కాకా” (మామా) అపి పిలిచేవాడు. నానావళి షిరిడీకి తన గురువు ఆదేశంమేరకు వచ్చాడని, బాబా షిరిడీకి రాగానే ”మామా! నువ్వొచ్చేశావా?” అని అడిగాడని, సాయి ”నోరు మెదపొద్దు” అన్నారని అందరూ అనుకుంటారు.
ఒకసారి సాయిని గద్దె నుండి దిగమని తాను గద్దెపై కూర్చుండి, సాయి హావభావాలు పరీక్షించాడు. కీర్తి, భోగ భాగ్యాలు సాయిని చలింపలేక పోయాయని గ్రహించాడు. సాయికి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళి పోయాడు.
సాయికి నీడలా ఉండే ఆ జీవికి సాయి లేని జీవితం గడపటం దుర్భరమైంది.
‘కాకా’, ‘కాకా’ అంటూ సాయి మహా సమాధి చెందిన క్షణం నుండి అన్నపానీయాలు విడనాడి సాయి మహాసమాధి చెందిన 13వ రోజున అంటే 27 అక్టోబరు 1918న జీవము వీడి సాయి సన్నిధికి చేరాడు.
సాయిబాబా తరహాలోనే నానావళిని కూడా ముస్లిం సాంప్రదాయం ప్రకారం సమాధి చేసారు. ఈ సమాధి లెండీ వనానికి వెళ్ళే దారిలో ఉంది.
వియోగ బాధను అనుభవించటం కన్నా విదేహిగా మారటానికి ఇష్టపడిన మహనీయుడు నానావళి.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- నీ కోసమే నే జీవించునది …. మహనీయులు – 2020… ఆగస్టు 30
- ‘‘లే బాబా లే! గద్దె మీద నుంచి లే’’
- పాహి దత్తప్రభో! …. మహనీయులు – 2020 – జనవరి 27
- తెలియగ లేరే నీ లీలలు …..సాయి@366 అక్టోబర్ 17….Audio
- సజీవ గురువు! …..సాయి@366 ఏప్రిల్ 13…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments