Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా తన ఊపిరితిత్తులను క్రక్కి, నీటితో శుభ్రపరచి, నేరేడు (జంబు) వృక్షముపై ఆరవేసెడి వారు. ఇట్టి యోగ పురుషుడు దత్తావతారుడు.
తెలుగునాట దత్త సంప్రదాయము కూడ నున్నది. దానికి ఉదాహరణ జనవరి 27, 1714న పుష్య బహుళ చతుర్దశినాడు జన్మించిన ధరణి సీతారామ యోగీంద్రస్వామియే.
సాయి వలె ఈయన ఇతరుల బాధలను స్వీకరించెడివారు. ఈయన వీపుపై పెద్ద రాచపుండు ఉండెడిది. ఆ భాధను భరించేవాడు.
సంధ్యా వందనం, పూజా సమయాల్లో పుండును తీసి ప్రక్కకు పెట్టి, పనులు ముగించిన పిదప వీపుపై పెట్టుకొనెడివారు.
ఈ విచిత్ర చేష్టను గమనించిన శిష్య బృందం “సర్వ సమర్థులైన మీరు ఆ పుండును శాశ్వతంగా తొలగించుకొనరాదా?” అంటే ” ఈ జన్మలో జరగవలసిన దానిని నివారింపగలిగినా, ఆ ఫలితాన్ని మరో జన్మలో అనుభవించవలసి ఉంటుంది” అనేవారు.
అందుకే సాయి అగ్ని గుండం నుండి బిడ్డను కాపాడి, తాను జీవితాంతం బాధను అనుభవించారు.
దైవాన్ని గాని, గురువును గాని ప్రార్దించవలసినది బాధను తొలగింపమని కాదు – బాధను భరించే శక్తిని నొసంగమని.
రుద్రవరంలో పండిత సభ జరుగుతొంది. సుప్రసిద్ధ కవి క్రిష్టిపాటి సుబ్బకవి ఆ సభలోకి. సీతారాం యోగింద్రులు ఆయనను పలుకరింపలేదు. ఆ కవి నొచ్చుకున్నాడు.
కొంచెం సేపయింది సీతారామ యోగీంద్రులు “అయ్యా! నీ (సుబ్బకవి) కొడుకు మిద్దెపై నుండి క్రిందపడుతుంటే, రక్షించి ఇప్పుడే వస్తున్నాను” అన్నారు సుబ్బకవితో.
వెంటనే సత్యం తెలుసుకునేందుకు ఇంటికి వెళ్ళాడు. ఆయనభార్య “మనవాడు మిద్దెపైనుండి పడితే ఎవరో సాధువు వచ్చి ఒడిలో పట్టుకుని రక్షించి వెళ్ళిపోయాడు” అని చెప్పింది.
సుబ్బుకవి వెంటనే వెళ్ళి సీతారామ యోగీంద్రుల పాదాలపై పడ్డాడు. ఆయనకు శిష్యుడయ్యాడు.
సీతారామ యోగీంద్రస్వామి తన బాల్యంలో ఆవులను తోలి గుడి వద్ద ఆడుతుంటే ఒక యోగి వచ్చి ఆయన నాలుకపై బీజాక్షరములను వ్రాసి మంత్రోపదేశం చేసి వెళ్ళిపోయాడు.
అప్పటి నుండి ఆ బాలుడు దత్తోపాసకుడైనాడు. ఆయన 1796 దత్తజయంతి నాడు దత్తాత్రేయులను ఉపాసించి, ఆయన (దత్తుల) ఆజ్ఞమేరకు సజీవ సమాధి చెందుతానని శిష్యులకు చెప్పి సజీవ సమాధి అయ్యాడు.
ఒక భక్తునకు ఆయన సజీవముగా ఉన్నారా అని అనుమానము కలిగి సమాధి రాయిని తొలగించి చూడగా సీతారామ యోగీంద్రస్వామి తన చేతిని పైకి లేపి బెత్తం పైకి విసిరారు.
శంకించటం అపరాధమే గదా! “సీతామాయ గురుశ్రీ జగతాం కుర్యుత్సరా మంగళం”
యోగ చూడామణి సమస్త సన్మంగళములు ప్రసాదించు గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- నీ కోసమే నే జీవించునది…..సాయి@366 అక్టోబర్ 27….Audio
- ఒక్కడు చాలు! .. …. మహనీయులు – 2020… డిసెంబరు 27
- మరణం ముగింపుకాదు …. మహనీయులు – 2020 – జనవరి 24
- రామచంద్ర మాలిక్ ఊది! …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 27
- అడుసు తొక్కనేల…కాలు కడగనేల… …. మహనీయులు – 2020… డిసెంబరు 1
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments