ఒక్కడు చాలు! .. …. మహనీయులు – 2020… డిసెంబరు 27



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


గురువు శారీరక బాధను శిష్యుడు చూడలేడు.

దీపకుడు, నారాయణ భట్టాద్రి గతంలోని వారు. నాగమహాశయుడు నిన్నమొన్నటి వాడు. రామకృష్ణ పరమహంస గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.

నాగమహాశయుడు (దుర్గాచరణ్‌) వచ్చాడు. పరిస్థితిని (గ్రహించాడు. గురుదేవుల వ్యాధిని తన శరీరం పైకి తీసుకోవాలని ఉంది.

“మీ కెలా నయం చేయాలో నాకు తెలుసు, మీ అనుగ్రహంతో ఇప్పుడే, ఈ క్షణంలోనే నయం చేస్తాను” అంటూ నాగమహాశయుడు రామకృష్ణులను సమీపించబోయారు.

రామకృష్ణులు అతనిని త్రోసివేశారు.. “అవును. ఈ వ్యాధిని నయం చేయగల శక్తి నీకు ఉందని నాకు తెలును” అన్నారు ఆయన. తన వ్యాధిని తీసుకోనివ్వ లేదు.

గురువు పరీక్షిస్తాడు అంతే! శిష్యుని కష్టాలపాలు చేయడు. నాగమహాశయుడు లాంటి ఒక్క శిష్యుడు చాలు!

గంగా స్నానం అంటే అందరికి ఇష్టమే. అర్దోదయ యోగం అంటే యాభై ఏండ్ల కొకసారి వచ్చే దినం అది.

అ సమయంలో గంగలో స్నానం చేయాలని ఎందరో ఎదురు చూస్తూంటారు. అటువంటి సమయంలో నాగమహాశయుడు ఇంటికి వస్తున్నాడు.

తండ్రి తన కుమారుడు (నాగమహాశయుడు) ఇంటికి రావటం చూచి “అందరూ ఉన్నదంతా తెగనమ్మి గంగలో స్నానం చేయటానికి పోతున్నారు. నువ్వేమో గంగను వదిలిపెట్టి ఇంటికి తిరిగి వన్తున్నావు.

ధార్మిక జీవితంవట్ల నీ వైఖరి నాకు అర్ధం  కావటం లేదు. ఇంకా రెందు, మూడు రోజులున్నాయి. నన్ను గంగా స్నానానికి తీనుకువెళ్లు” అన్నాడు.

అందుకు నాగమహాశయుడు వినమ్రంగా “నిజమైన భక్తి కలిగి ఉన్న వ్వక్తకి గంగా మాత అతడి ఇంట్లోనే దర్భనమిన్తుంది” మరో చోటుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు అన్నాడు.

తండ్రికి అప్పుడు ఏమి అర్థం కాలేదు.

అర్దోదయ పర్వదినాన ఎందరో నాగమహాశయుని దగ్గరకు వచ్చారు. ఒక స్రీ నాగమహాశయుని పెరటిలోనికి వెళ్లింది.

ఆగ్నేయ మూలలో నేల నుండి నీరు చిమ్ముతూ, గంగా ప్రవాహంలాగా రావటం గుర్తించింది. వెంటనే అందరనీ పిలచింది. అది గంగా ప్రవాహమే.

 నాగమహాశయుని భక్తులు, నాగమహాశయుని కుటుంబమే కాదు ఆ ఊరులోని వారందరూ వచ్చి ఆ గంగా వాహినిలో స్నానాలు చేశారు.

నాగమహాశయుడు వినమ్రంగా గంగా దేవికి వంగి నమస్మరించాడు. నాగమహాశయుని భక్తి, గంగపై గల నమ్మకము సాటిలేనివి.

నాగమహాశయుడు తన గురువును మనసా వాచా కర్మణా నమ్మాడు.

నాగమహాశయుడు తన ఆఖరి క్షణంలో రామకృష్ణుల చిత్తరువు చూచి “రామక్ష్రృమ్ణులు నన్ను కరుణించి ఈ దేహాన్ని తీనుకుపోతున్నారు” అన్నాడు.

ఆ దినం డిసెంబర్‌ 27, 1899వ సంవత్సరం.

నేడు డిసెంబర్‌ 27 నాగమహాశయుని వర్థంతి.

నాగమమహాశయుని వంటి భక్తి స్థిరముగా మనకు ఉండుగాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles