Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా ఆత్మహత్య చేసుకొనువారలను కాపాడు విధానము విచిత్రముగా నుండును.
గోపాల్ అంబాడేకర్ షిరిడీలోనే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు.
సమయానికి సగుణమేరు నాయక్ వచ్చి అక్కల్ కోట మహారాజు చరిత్రను ఇవ్వగా, దానిని చదివి ఆత్మహత్య ప్రయత్నం మానుకున్నాడు.
ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామని ఒక పొట్లంలో విషం కట్టి, తన తలగడ కింద పెట్టి నిద్రించారు శ్రీ బాపట్ల హనుమంత రావు గారు 27 – 12 – 1944 న.
అది చినగంజాము.కుగ్రామము. ఆయనకు స్వప్నము వచ్చింది తెల్లవారు జామున. సాయిబాబా పసుపు రంగు లాల్చీ, తలకు ముడితో స్వప్నంలో సాక్షాత్కరించాడు.
సాయిబాబాను గూర్చి అప్పటివరకు ఆయనకు ఏమి తెలియదు. అయిన హనుమంత రావు గారు ఆస్వప్నంలోనే “స్వామీ! మీరెవ్వరు? ఏమి కోరి వచ్చితిరి?” అని అడిగాడు.
సాయిబాబా “నేను సాయిబాబాను, నీవు పెక్కు గ్రంథములు రచించితివి. అది అట్లుండనిమ్ము నీవు వీనిని వ్రాయుము” అని పలికారు. పంతులు గారు మౌనముగా ఉన్నారు.
సాయిబాబా “ఏమి సందేహించు చుంటివి? నేను నీ ఇష్ట దైవమునే” అని శ్రీరామ, కృష్ణ, శివ, మారుతి , దత్త రూపములుగా దర్శనమిచ్చినాడు. తరువాత యథా రూపమును చూపినాడు.
సాయి తన వరదాభయ హస్తమును అయన శిరస్సుపై నుంచి ఆశీర్వదించి అంతర్దాన మయ్యాడు.
తెల్లవారింది. ఒక గంట గడిచింది. చీరాల నుండి పంతులు గారి మిత్రుడు, శ్రీ బండా ఆదినారాయణ రావు గారు అయన ఇంటికి వచ్చినారు.
“మిత్రమా! నీవెంత పుణ్యాత్ముడవు! అఖిల భారత సాయీ సంఘ అధ్యక్షులు శ్రీ బీ.వి. నరసింహ స్వామి గారు చీరాల విచ్చేసిరి. వారికి స్వప్నమున బాబా కనిపించి ఏవో గ్రంథములు మీ చేత వ్రాయించమని ఆదేశించారట.
నిన్ను నా వెంటకొని రమ్మని పంపిరి. బయలు దేరు” అని చెప్పాడు. స్నేహితునితో చీరాల చేరి, సాయి వ్యాస నరసింహ స్వామి వారి పాదాలపై పడ్డారు పంతులు గారు.
స్వామీజీ ఆయనకు కొన్ని గ్రంథములను ఇచ్చి “వీటిని తెనిగించి ఆంధ్ర దేశమున భక్తి ప్రచారము జరుపు సదావకాశము బాబా నీకు కల్పించాడు” అని చెప్పి బాబా పటమును ఆయనకు ఇచ్చారు.
హనుమంతరావు గారు సుసంపన్నుడయ్యాడు. అయన రచనలు కొన్ని “ఏమి! నిన్ను ఉపేక్షింతునా?, శ్రీ సాయినాథ బోధామృతము” సుప్రసిద్ధములు.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- జ్ఞానిని గుర్తించిన జ్ఞాని …..సాయి@366 డిసెంబర్ 1….Audio
- మరచిపోయేది మానవ హృదయం…..సాయి@366 జూలై 9….Audio
- భగవానుని పాదుకలు …..సాయి@366 ఆగస్టు 27….Audio
- అది నేనే…! …..సాయి@366 డిసెంబర్ 3….Audio
- నీ పాదం గంగాయమున సంగమ సమానం….. సాయి@366 ఫిబ్రవరి 24….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments