Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
1949 లో జరిగిన సంఘటన. శాంతవం మహారాజ్ స్వామీజీకి బాల్యం నుండి ఆధ్యాత్మికత వైపే చూపు ఉండేది. గృహాన్ని త్యజించాడు.
ఎందుకో కారణం తెలియని మనో చాంచల్యం ఏర్పడ్డది ఆయనలో. అలాగే సంచారం చేస్తూ ‘బాలారాం’ అనే ప్రదేశం చేరాడు.
అచ్చటి పరిసరాలు ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడతాయి. 4 , 5 రోజులు ధ్యానంలో నిరాటంకంగా అయన గడిపేవాడు.
అయినా మనస్సు లగ్నం కావటం మానేసింది. జీవితమంతా ఆధ్యాత్మిక చింతనకు అంకితం చేద్దామనే ఉద్దేశంతో ఇల్లు కూడా వదలి వచ్చిన ఆయనకు నిస్పృహ ఏర్పడ్డది.
ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. శివాలయములో ఆఖరి ప్రార్థన చేసి, నదీ తీరానికి చేరాడు. అంతా నిర్మానుష్యంగా ఉంది.
నదీమతల్లిలో ఐక్యమవటానికి దూకబోయే సమయంలో ఆయనను ఒక ఫకీరు పట్టుకుని ఆపాడు.
ఆ ఫకీరు నల్లని వస్త్రములు ధరించాడు. పొడుగు జుట్టు, గడ్డము, కరుణాపూరిత దివ్య నేత్రాలు కలిగి ఉన్నాడు. కారణం అడిగాడు ఫకీరు. కారణం విన్న ఫకీరు, తనను అనుసరించి రమ్మన్నాడు.
ఆ ఫకీరు అయస్కాంత శక్తికి బద్దుడయ్యాడు. ఆ ఫకీరు దగ్గరున్న ఛేతృసాని రైల్వే స్టేషన్ కు చేరాడు శాంతవన్ జీతో.
శాంతవన్ జీ స్వగ్రామమైన శౌర్ధన్ కు టికెట్టు కొని ఇచ్చి వెంటనే అదృశ్యమయ్యాడు ఫకీరు. ఆ ఫకీరు ఎవరో తెలియదు. ఇంకా అయన జీవితంలో ఖేదం ఏర్పడలేదు.
రామశర్మ శిష్యుడైనాడు. నర్మదా నదీ తీరంలోని కర్మాలీ వద్ద ఆశ్రమం నిర్మించుకుని, గాయత్రీ అనుష్ట నవరాత్రులు చేసేవాడు.
దేశం నలుమూలల నుండి అయన వద్దకు వచ్చేవారు ప్రజలు. అలా 30 సంవత్సరాలు గడిచాయి.
అది 1979వ సంవత్సరము. సూరత్ లోని సాయి మందిరం వారు ఆయనను దత్త జయంతికి సాయినాధుని పూజ, గాయత్రీ యజ్ఞమునకు ఆహ్వానించారు.
ఆ రాత్రి నిద్రించే ముందు “నేను సాయి భక్తుడను కాను. షిరిడీలో గాని, ఇతర సాయి మందిరములను సందర్శించలేదు. మీ పూజకు నన్ను ఎందుకు ఎన్నుకున్నావు బాబా?” అనుకుంటూ నిద్రించాడు.
స్వప్నములో సాయి సాక్షాత్కరించి “30 సంవత్సరముల క్రితం బాలారాం గ్రామం వద్ద నిన్ను ఆత్మహత్యా ప్రయత్నం నుండి విరమింప చేసి కాపాడితిని గదా? నన్ను మరచితివా?” అన్నారు.
వెంటనే ధ్యానంలో కూర్చున్నాడు. గాయత్రి దేవి స్థానంలో సాయి గోచరించాడు. దత్త జయంతి 1979 డిసెంబరు 3 న సాయి-గాయత్రి మాతను సేవించాడు శాంతవన్ జీ.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- కుదరదా? సరేలే! ….. సాయి@366 మార్చి 13….Audio
- జయ మాణిక్య…..సాయి@366 డిసెంబర్ 22….Audio
- అది మాత్రం అడగకూడదు …..సాయి@366 డిసెంబర్ 30….Audio
- భాగ్యనగరిలో సాయి ఫకీరు…..సాయి@366 జూన్ 14….Audio
- జిత్తులమారితనం…. సాయి@366 ఫిబ్రవరి 12….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments