జయ మాణిక్య…..సాయి@366 డిసెంబర్ 22….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


దత్త పంచకములో మధ్యముడైన శ్రీ మాణిక్య ప్రభు, నృసింహనాయక, బచ్చమ్మల ద్వితీయ సంతానం.  ఆయన డిసెంబర్ 22, 1817 న జన్మించారు.

ఆయనకు సాయిబాబాకు ఎన్నో పోలికలు. అతి ముఖ్యమైనది ఇతర మతస్తులతో సంబంధాలు.

మాణిక్య ప్రభువును “సకల మత స్థాపిత శ్రీ సద్గురు” అంటారు. సాయిబాబాను  “సమరస సన్మార్గ స్థాపనాయ నమః”  అని కీర్తిస్తారు.

ఇరువురు సమకాలికులే. అయితే ఆ దత్తావతారాలు కలసిన ఒకే ఒక సంఘటన ప్రసిద్ధి చెందినది.

ఒకసారి మాణిక్య ప్రభు దర్భారులో కూర్చున్నాడు. అన్నగారైన తాత్యా మహారాజు తమ్ముడైన మాణిక్య ప్రభువుతో వేదాంత చర్చలో తలమునకలై ఉన్నారు.

సుమారు 13 , 14  సంవత్సరముల వయస్సుగల ఒక తేజోవంతుడైన ఫకీరు వచ్చి తన వద్ద నున్న లోటాను భిక్షతో నింపమని కోరాడు.

మాణిక్య ప్రభు వారి అన్నను పిలిచి లోటాను తీసుకుని రూపాయలతో నింపి ఇవ్వమని చెప్పాడు. అన్న తన వేదాంత చర్చను వదలకుండా, లోటాను రూపాయలతో నింపుతూనే ఉన్నాడు.

ఎంత సమయం గడచినా, ఆ లోటాను రుపాయలతో నింపటం సాధ్యం కాలేదు. దీనినంతా మాణిక్య ప్రభువులు గమనిస్తూనే ఉన్నారు. ఫకీరు నిశ్శబ్దంగా చూస్తూ నిలబడ్డాడు అంతే!

మాణిక్య ప్రభు ఆ లోటాను తీసుకుని, రెండు ఖర్జూరపు  పండ్లు, కొన్ని పూలు వేయగానే ఆ లోటా నిండింది.

మాణిక్య ప్రభు నవ్వుతూ “సాయీ! తీసుకోండి”అంటూ ఫకీరుకు ఆ లోటాను ఇచ్చారు. ఫకీరు ఆ రెండు ఖర్జూరపు పండ్లు, పూలను మాత్రం స్వీకరించి, ఆ లోటాను మాణిక్య ప్రభువు ముందు బోర్లించాడు.

ఫకీరు మాణిక్య ప్రభువు ముందు లోటాను బోర్లించినప్పుడు ఆ లోటా నుండి లోగడ నింపబడిన రుపాయలకంటే రెండు రేట్ల రూపాయలు బయటకు వచ్చినవి. మాణిక్య ప్రభువు వద్ద తల వంచి, నమస్కరించి వెళ్ళిపోయాడు.

మాణిక్య ప్రభు వారి అన్నతో “ఆ ఫకీరు లోటాను నింపటంరాలేదు, కానీ ఫకీరు కుమ్మరించిన రూపాయలు చూడు” అన్నారు.

అన్న ఆ కుప్ప వైపు చూచి, ఆశ్చర్యపోయి, ఆ ఫకీరు జాడ కోసం ప్రయత్నించాడు. ఆ ఫకీరు ఆచూకి దొరకలేదు.

మాణిక్య ప్రభు దర్భురుకు ఫకీరు రూపములో వచ్చిన తేజోవంతుడైన యువకుడు వేరే ఎవరో కాదు – సాయిబాబాయే!

ఈనాడు డిసెంబరు 22 . మాణిక్య ప్రభు జన్మ దినం. ఆయనను స్మరించెదము గాక!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles