Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయి భక్తులు అన్ని రాష్ట్రాలలోను, అన్ని దేశాలలోను ఉన్నారు.
సికిందాబాదులో పాట్ మార్కెట్ లో బంగారం షాపులుంటాయి. అందులో ఒక షాపు యజమాని నేమీచంద్ జైన్.
వారు జైన మతానికి చెందిన వారు. ఆయన తల్లిదండ్రులైన శ్రీమతి తారాబాయి, మేఘరాజ్ జైన్ దైవ భక్తి పరాయణులు.
1960 జూన్ 14న నేమీచంద్ దుకాణంలో ఉన్నాడు. కొనుగోలు దారులందరికీ అన్నీ చూపిస్తున్నాడు.
ఆజానుబాహుడైన, ఒక దృఢ ఫకీరు షాపు ముందు నిలబడ్డాడు. ఫకీరు వద్దకు నేమీచంద్ జైన్ వచ్చి ”నీకు ఏం కావాలి?” అని అడిగాడు. ఫకీరు ”ఐదు అణాలు” అన్నాడు.
నేమీచంద్ గల్లాపెట్టెనంతా వెదికాడు. నాలుగు అణాలే కనిపించాయి, ఐదవ అణా కనిపించ లేదు.
ఐదు అణాలకు తక్కువ తీసుకోనన్నాడు ఫకీరు. ”నీవు కడుపు నొప్పితో బాధ పుతున్నావు కదా?” అని అడిగాడు ఫకీరు.
ఈ ప్రశ్నకు ఆశ్చర్యపడ్డాడు జైనుడు. ”అవును” అన్నాడు. ”నీవు కొన్ని నిబంధనలు పాటిస్తే నేను మందిస్తాను” అన్నాడు ఫకీరు. ”సరే” అన్నాడు నేమీచంద్.
”మొట్ట మొదట ఇతర మందులు మానివేయాలి. గురువారం నాటికి నొప్పి తగ్గుతుంది. అప్పటి నుండి షిరిడీ సాయి పూజ ప్రారంభించాలి” అన్నాడు ఫకీరు. దానికి అంగీకరించాడు జైన్.
పూజా విధానం సులభ పద్ధతిలో ఉన్నది. ”వీలుంటే తీపి పదార్ధాలను నైవేద్యంగా పెట్టాలి. లేకుంటే లేదు.
రెండు అగర వత్తులను అయినా వెలిగించి నమస్కరించాలి” అన్నాడు. అంగీకరించాడు జైన్.
కొంత విభూతిని ఇచ్చాడు ఫకీరు. నోటిలో కొంత వేసుకుని, కొంత నుదుటన వ్రాసుకోమన్నాడు. అలాగే చేశాడు.
అయితే ఫకీరు రూపాయి నాలుగు అణాలు అడిగాడు. డబ్బు కోసం వెదుకుతుండగా ఫకీరు మాయమయ్యాడు. మరోసారి ఆశ్యర్యపోయాడు జైనుడు.
ఫకీరు చెప్పినట్టు గురువారం కల్లా కడుపు నెప్పి పోయింది. ఇక సాయి జైన్ పూజా మందిరంలో కొలువుదీరాడు.
జైన్ కుటుంబ సభ్యులతో షిరిడీ దర్శించాడు. సమాధి మందిరం చేరాడు.
అక్కడ సింహాసనంపై సికింద్రాబాదులో తనకు కనిపించిన ఫకీరు మహారాజులా కూర్చున్నాడు. కలకాదు కదా అనుకున్నాడు. నమస్కరించాడు.
వెంటనే రూపాయి నాలుగు అణాలను దక్షిణగా హుండీలో వేశాడు.
మరల సింహాసనం వైపు చూశాడు. ఇప్పుడు పాలరాతి విగ్రహం రూపంలో సాయి ఫకీరు కనిపించాడు చిరునవ్వుతో.
ఇది సాయి ఫకీరు లీల!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- నాస్తికులకు సాయే శరణం…..సాయి@366 ఆగస్టు 14….Audio
- కుదరదా? సరేలే! ….. సాయి@366 మార్చి 13….Audio
- సాయి నాణెము …..సాయి@366 జూలై 31…Audio
- మనసు ….. సాయి@366 మార్చి 17…Audio
- శివనేశన్ స్వామి ఫకీరు రూపంలో యున్న బాబాకు వస్త్రముల నిచ్చుట.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments