పాదుకా విజయం…..సాయి@366 జూన్ 13…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. jeevani


సాయిబాబా సగుణ భక్తిని ప్రోత్సహించే వాడా? లేదా నిర్గుణ భక్తిని ప్రోత్సహించే వాడా? అనే సందేహం కలుగవచ్చు.

ఎవరి భావం ప్రకారం వారిని నడుచుకోనిచ్చే వారని సమాధానం సాయి సాహిత్యం చెబుతుంది. అయితే కాస్త మొగ్గు సగుణ భక్తి వైపు ఉన్నట్లు కనిపిస్తుంది.

శ్రీ వసంతరావు పణ్‌శీకర్‌ సాయి భక్తుడు. ఆయన సాయి శరణా నందుకు ”సాయిబాబా ఆజ్ఞాను సారం 13 వేర్వేరు స్థానాలలో సాయిబాబా పాదుకలను స్థాపించాలని, సాయిబాబా ప్రచారం చేయాలని నా సంకల్పం. ఈ పనికి మీ ఆశీర్వాదం కావాలి” అని లేఖ వ్రాశాడు.

సాయి శరణానంద ఆయనకు ఉత్సాహం కలిగిస్తూ జాబు వ్రాశాడు.

పూనా, ఫణస్‌ వాడిలలో ఉన్న విఠల్‌ మందిరాలలో సాయి పాదుకలను స్థాపించి, ఇక అహమ్మదాబాదు లోని సాయి శరణానందులకు సమర్పించాలని ఆయన కోరిక.

అయితే వాటిని స్వీకరించేందుకు ఇచ్ఛలేదు శరణానందకు. ఎందుకంటే తాను సన్యాస ఆశ్రమం స్వీకరించాడు కనుక.

అందుకు పణ్‌శీకర్‌ అంగీకరించ లేదు. ఆమరణ నిరాహార దీక్ష సాగించాడు పణ్‌శీకర్‌. ఆయనకు బాబా యందు గల ప్రేమను సాయి శరణానందుల మనస్సును మార్చింది.

ఎందుకంటే ”సన్యాస వ్రతం అంటే ప్రాణుల పట్ల, కాయా, వాచా, మనసా అహింసను పాటించటమే. ప్రతి వారికి వారి నుండి అభయం లభించాలి.

బ్రాహ్మణులను ఆకలితో చంపటం నిష్కామ ప్రేమను లెక్క చేయక పోవటం సన్యాసి ధర్మం కాదు” అనే ప్రేరణను సాయియే కలిగించాడు.

పణీశ్‌కర్‌ నుండి పాదుకలను స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నారన్న వార్త సంతోషం కలిగించినా నిరాహార దీక్షను వీడలేదు.

పాదుకలను స్వీకరించిన తరువాతనే నిరాహార దీక్ష విరమిస్తానని పణ్‌శీకర్‌ చెప్పాడు. ఒక వాహనంలో సాయి చిత్రాన్ని, పాదుకలను తెచ్చారు. ఆ పాదుకలను సాయి శరణానందుల వారు స్వీకరించారు.

ఆనాడు జూన్‌ 13, 1954. అప్పుడే పణ్‌శీకర్‌ నిరాహార దీక్షను విరమించాడు.

పాదుకా పూజ అపరోక్ష జ్ఞాన ప్రాప్తికి హేతువు. శిరస్సు భాగంలో ఉన్న సహస్ర దళంలో గురు పాదుకలు ఉన్నాయన్న భావన చేస్తుంటే అపరోక్ష జ్ఞానం కలుగుతుంది.

నేడే జూన్‌ 13. సాయి పాదుకలను స్మరించెదము గాక.

పదములె చాలును సాయి,

నీ పద ధూళులె పది వేలు.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles