పాదుకా ప్రతిస్తాపన – 2



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

నిన్నటి తరువాయి….

అక్కల్ కోట మహరాజ్ వారు ఆలీబాగ్ కర్ ఆరాధ్య దైవం అయినందువలన ఆలీబాగ్ కర్ అక్కడికి వెళ్ళాలనుకున్నాడు. అప్పుడు బాబా “అరె, అక్కల్ కోటలో ఎముందిప్పుడు? అక్కడికి యెందుకు వెడుతున్నావు? స్వామీ సమర్ధ షిరిడీ లోనే యిక్కడే కొలువైవున్నారు”  అనడంతో భాయి ఆలీబాగ్ కర్ అక్కల్ కోటకు వెళ్ళడం మానుకుని, అప్పటినుండి షిరిడికి తరచుగా వస్తూవుండేవాడు.

(ఈవివరాలన్నీ డాక్టర్ కే.బీ.గావన్ కర్ గారు వ్రాసిన ’శిలధీ’ అను పుస్తకం నుండి సేకరించి షిరిడి నివాసిని విన్నీ చిట్లూరి గారు “బాబా’స్ గురుకుల్ షిరిడి” – స్టెర్లింగ్ పేపర్ బ్యాక్స్, న్యూఢిల్లీ, 2009 – అనే ఆంగ్లపుస్తకంలో ప్రచురించారు. సాయి జిజ్ణాసులకు వుపయుక్తమవుతుందన్న వుద్దేశ్యంతో అనువదించబడిన ఈ వ్యాసం లో ఏమైనా పొరపాట్లు వుంటే, నా అనువాదం లోనె లోపం గానీ, డాక్టర్ గావన్కర్ గారు కానీ, విన్నీ చిట్లూరి గారు కానీ ఎంత మాత్రం భాద్యులు కారు అని సవినయంగా మనవి చేసికుంటున్నాను).

శ్రీసాయి సచ్ఛరిత మూల గ్రంధం (పోతీ) లో మాత్రం పాదుకలను గురించి న వివరాలు 51వ ఒవీ నుండి 60వ ఒవీ వరకూ ఈక్రింది విధంగా ప్రస్తావించబడింది. (శ్రీ సాయి సత్చరిత, తెలుగు, ఒవి నుండి ఒవి, అనువాదం: మణెమ్మగారు, సద్గురు సాయిబాబా మందిర్, కిషన్ బాగ్, హైదరాబాద్)

51. ఇక్కడే వేపచెట్టు క్రింద “భాఈ” అను ఒక భక్తుడు అక్కల్ కోట స్వామి యొక్క పాదుకలను సాధకులు పూజించాలనే ఉద్దేశ్యంతో స్థాపించాడు.
52. అతడు తన ఉపాస్య దైవమైన స్వామి వారి పాదుకలను అక్కల్ కోటస్వామి సమర్ధ పటాన్ని నిత్యం నియమ నిష్టలతో పూజించేవాడు.
53. అక్కల్ కోట వెళ్ళి స్వామి వారి దర్శనం చేసికోవాలనీ, భక్తిగా పూజోపచారాలను సమర్పించుకోవాలని అతనికి సంకల్పం కలిగింది.
54. ముంబాయి నుండి బయలుదేరాలని ప్రయాణానికి సిద్ధం చేసికుని అక్కడికి ఆ మరునాడు వెళ్ళాలన్న నిశ్చయం మారి షిరిడి మార్గం పట్టాడు.
55. కారణం అతడు ప్రయాణమవ్వాలని తలచిన ముందురోజున అతనికి స్వప్నంలో ’ప్రస్తుతం నా స్థానం షిరిడి లో, నీవు అక్కడికి వెళ్ళు’ అని స్వామి సమర్ద ఆదేశించారు.
56. వారి ఆదేశాన్ని శిరసావహించి ముంబయి నుండి ప్రయాణమై షిరిడి వెళ్ళి అక్కడ ఆరు నెలలు ఆనందంగా గడిపే భాగ్యాన్ని పొందాడు.
57. పూర్ణనష్ఠావంతుడైన భాఈ తనకు కలిగిన ఈ దృష్టాంతం చిరస్మరణీయంగా ఉండాలని వేపచెట్టుక్రింద పాదుకలను స్థాపించాడు.
58. శక సంవత్సరం 1834 లో శ్రావణ మాసం, శుక్లపక్ష పర్వకాలంలో స్వామి పాదుకలను వేప చెట్టు క్రింద భక్తి శద్ధలతో స్థాపించాడు.
59. ఒక శుభముహుర్తాన దాదా కేల్కర్ చేతుల మీదుగా విధివిధానాలతో శాస్త్రోక్తం గా ఉపాసనీ మహరాజ్ స్వయంగా పాదుకలను స్థాపింపచేసారు.
60. తరువాత ఈ పాదుకల పూజావ్యవస్థను బ్రాహ్మణుడైన దీక్షిత్ చేసేవాడు. ఇతర ఏర్పాట్లను సగుణ్ మేరు నాయక్ చూసేవాడు.
తొలిరోజుల్లో కమలాకర్ దీక్షిత్, తదుపరి ఎల్.కె.జాకడి మంగళస్నానం, నిత్యపూజనిర్వహించేవారు. ప్రస్తుతం సంస్థాన్ తరపు పూజారి వీనిని నిర్వహిస్తున్నారు. 2007 లో వెండి పాదుకలను 5” ఎత్తుగల వేదికపై ప్రతిష్టించడం జరిగింది.

విన్నీచిట్లూరి గారి ’బాబాస్ గురుకుల్, షీరిడి’ ప్రకారం గురుస్థాన్ గా ప్రఖ్యాతి పొంద్ది్, భక్తులు వారివారి కర్మ వినాశనానికి, ఆద్యాత్మిక అభ్యున్నతికి, కోరికల సాధనకూ ప్రదక్షిణ చేసే ఈ ప్రదేశం లో 1920 నాటికి వేపచెట్టు కి ఆనుకుని పశ్చిమ ముఖంగా చిన్నగుడి వుండేది. 1941 లో ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున అంటే 30.9.1941 న ఆ చిన్నమందిరం రాగితో చెక్కిన నెమళ్ళ, పువ్వల బొమ్మలతో, ప్రకాశవంతమైన రంగులతో అందమైన మందిరంగా ఒక అడుగు వేదికపై పునర్నిర్మించబడింది. గోపురం పైన చిన్న కలశం కూడా వుండేది. 1974లోఅందమైన ఈచిన్న మందిరం పెద్ద మందిరంలోని కి పరివేష్టించబడింది. చిన్నమందిరానికి కుడివైపున బాబా విగ్రహం వుంచబడింది, ఎడమవైపున వేపచెట్టు వుండేది. పాలరాతి పాదుకలు వేపచెట్టు ఎదురుగా ఒక వేదికపై వుండేవి. రాయి మీద కూర్చుని వున్న బాబా మూడు అడుగుల ఈ విగ్రహాన్ని ముంబాయి చెందిన యశ్వంతరావ్ డి.దవే అను భక్తుడు సమర్పించాడు. సమాధి మందిరంలో వున్న విగ్రహాన్ని చెక్కిన దివంగత బాలాజీ వసంత్ తాలీమ్ కుమారుడు హరీష్ బాలాజీ తాలీమ్ ఈ విగ్రహాన్ని చెక్కారు.

2007 ఏప్రెల్ ప్రాంతంలో ఈవేప చెట్టు ఎండిపోతున్న పరిస్థితిని గమనించిన సాయిబాబా సంస్థాన్ వారు ఉద్యానవన శాఖ వారి సహాయాన్ని అర్దించారు. వేపచెట్టుకి మూలాలకి, వేరులకీ కావల్సిన నీరు, ప్రాణవాయువు, పోషకాలూ లభించేందుకు వీలుగా గురుస్థాన్ మరుయూ ఆ మందిరమూ తొలగించి, గురుపూర్ణిమ చాలా త్వరలో వస్తున్నందువలన ప్రస్తుతం వున్న గురుస్థాన్ నిర్మించడం జరిగింది.

శ్రీ సాయి సఛ్చరిత భారతదేశం లోని చాలా భాషలలోనికి అనువదించబడింది. ఈ అనువాదాలన్నిటికీ శ్రీ నాగేశ్ వాసుదేవ్ గుణాజీ ఆంగ్లంలోకి సంక్షిప్తీకరించిన అనువాదమే మూలం. బహుశ సంక్షిప్తీకరణ కారణం గానే శ్రీ గుణాజీ ఆంగ్ల అనువాదం మక్కీకి మక్కీగా కాక స్వేఛ్చానువాదంగా కొనసాగుతుంది. తెలుగు లో శ్రీ ప్రత్తి నారాయణరావు గారి గ్రంధం కూడా గుణాజీ ఆంగ్లాని కి అనువాదమే. అందువలనే పాదుకల వృత్తాంతం చివరన ’హేమాఢ్ పంతునకీ వివరములు తెలిసియుండవు. తెలిసి యున్నచో సచ్చరిత్రలో వ్రాయుట మానియుండరు’ అని ప్రస్తావించబడింది.

శ్రీ బి.వి.దేవ్ గారు సేకరించి శ్రీ సాయి లీల మాస పత్రిక రెండవ సంపుటము, మొదటి సంచిక, 25 వ పేజీలో ప్రచురించిన వివరాల (శ్రీసాయి సచ్చరిత్ర, తెలుగు, శ్రీ ప్రత్తి నారాయణరావు) ను అనుసరించీ మరియూ డాక్టర్ గావన్కర్ గారందించిన  వివరాలను బట్టీ షిరిడి లో గురు పాదుకల ప్రతిష్ట జరిగి ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి కి వంద సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి (2.8.2012) గురువారం కావడం సద్గురు కృపకాక మరేమిటి?

చాగంటి సాయిబాబా
సాయి దయాల్ విహార్

జట్నీ, ఒడిషా.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles