Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
ప్రతి పనిని శ్రద్ధా భక్తులతో చేయాలని బాబా సూచిస్తారు.
శ్యామరావ్ జయకర్ చిన్న వెండి పాదుకలను చేయించాడు. షిరిడీలోని సాయినాథునకు సమర్పించాడు.
సాయి ఆ పాదుకలను చూచాడు. తన చేతులలోకి తీసుకున్నాడు. తీసుకుని జయకర్‌కు ఇవ్వకుండా చేతులను క్రిందకు వంచాడు సాయిబాబా.
ఆ పాదుకలు నేలపై పడ్డాయి. ఆ పాదుకలను పూజింపదలచి జయకర్ వాటిని తీసుకుని, తన జేబులో పెట్టుకుని బసకు వెళ్ళాడు.
అదే రోజు సాయంత్రం మాసిన గుడ్డలతో పాటుగా, పాదుకలున్న చొక్కాను చాకలికి వేశాడు. అవి తిరిగి తనవద్దకు చేరలేదు చాకలివద్ద నుండి.
తన నిర్లక్ష్యానికి తనను తానే నిందించుకున్నాడు. సాయి తన చేతికి ఇవ్వకుండా పాదుకలను జారవిడచుటలోని అర్థం అప్పుడు తెలిసింది శ్యామరావ్ జయకర్‌కు.
కోరిక ఉండటమే కాదు, శ్రద్ధా ఉండాలి ప్రతి విషయంలోనూ. శ్రద్ధ లేని చోట భక్తి ఉండదు.
ఆత్మారాం హరి చౌబాల్ సాయిబాబా దర్శనానికి పోతూ, తాను ప్రత్యేకంగా చేయించుకున్న పాదుకలను సాయికి చూపాడు.
సాయిబాబా తన కాలి బొటన వ్రేళ్ళను పాదుకలపై ఉంచి, చౌబల్‌తో ”పాదుకలను పూజించుకో” అన్నారు. హరాభావ్ అలానే చేసాడు.
ఆనాడు ఆశ్వయుజ బహుళ త్రయోదశి. అంటే 20 అక్టోబరు 1930. యధావిధిగా పూజ చేద్దామనుకున్నాడు హరిబావ్.
రెండు పాదుకలలో ఒక పాదుక కనిపించలేదు. ఎంతో వెతికి వేసారిపోయాడు. మిగిలిన ఆ ఒక్క పాదుకనే పూజింపసాగాడు.
కొన్నాళ్ళకు రెండవ పాదుక కూడా మాయమైంది. మరింత విచారగ్రస్తుడయ్యాడు. సాయి తన పట్ల అసంతృప్తితో ఉన్నాడేమోనని బెంగ పెట్టుకున్నాడు.
కొత్త పాదుకలను కొందామని వెళితే, ఎన్ని షాపులు తిరిగినా పాదుకలు దొరక లేదు. ఇక తనకు పాదుకా పూజ ప్రాప్తి లేదని, సాయి పటాన్నే పూజింపసాగాడు.
అయినా పాదుకలను పూజింపలేకున్నానే అన్న అసంతృప్తి ఉన్నది అతనికి.
ఒక రోజున అకస్మాత్తుగా పోయిన రెండు పాదుకలు కనిపించాయి. అతని ఆనందానికి అవథులు లేవు. సంతోషంగా సాయి పాదుకా పూజ కొనసాగించాడు.
సాయి ఎక్కడో లేడు. మన హృదయాలలోనే ఉన్నాడు మనలోని మంచి కోర్కెలు తీర్చటానికి. శ్రద్ధతో చేసే ఏ పనైనా సఫలీకృతం అవుతుంది.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఓం సత్యనారాయణ స్వామినే నమః…..సాయి@366 జూలై 10….Audio
- పాదుకా విజయం…..సాయి@366 జూన్ 13…Audio
- భగవానుని పాదుకలు …..సాయి@366 ఆగస్టు 27….Audio
- ఉన్నది చాలును!…..సాయి@366 మే 17….Audio
- విదేశాల్లో ప్రథమ సాయి మందిరం…..సాయి@366 జూలై 29….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments