Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
సాయిబాబా ద్వారకామాయిలో దర్శనమిస్తున్న చిత్రాన్ని భావితరాలకు అందించిన కీర్తి శ్యామరావు జయకర్‌కు చెందుతుంది.
ఆయన అనేక అనుభవాలను సాయి సన్నిధిలో పొందాడు. 1917 ఆషాఢ మాసం (సుమారు జూలై నెలలో వచ్చేది)లో జరిగిన సంఘటన ఆయన తెలిపారు.
వర్దే అనే భక్తుడు సత్యన్నారాయణ పూజను చేసుకుంటాను అనుమతి ఇవ్వమని సాయిని అర్ధించాడు. సాయి సరే అన్నాడు.
వర్దే చాలా గడుసు పిండం. వర్దే నా దగ్గర డబ్బు లేదు ఇవ్వమని సాయినే అడిగాడు. సాయిబాబా వద్ద ఆ సమయంలో డబ్బు లేదు.
సాయిబాబా అప్పుడు శ్యామరావ్ జయకర్‌ను చూపారు. ఆతడు ద్వారకామాయి సభామండపంలో కూర్చుని ఉన్నాడు.
జయకర్ అనేకసార్లు సాయి సన్నిధిలో చూచాడు వర్దేను. అంతేగాని ఎట్టి పరిచయం లేదు ఆయనకు.
వర్దే సరాసరి జయకర్ వద్దకు వచ్చి తాను సత్యన్నారాయణ పూజ చేసుకోవానికి డబ్బును జయకర్ వద్ద నుండి తీసుకోమన్నారు సాయి అన్నాడు.
డబ్బు ఎంతకావాలని అడిగాడు జయకర్. రెండు రూపాయల అయిదు అణాలు అవుతుందని వర్దే చెప్పాడు. జయకర్ జేబుల్లో ఉన్న డబ్బంతా తీసి లెక్కించాడు. సరిగ్గా రెండు రూపాయల అయిదు అణాలు మాత్రమే ఉన్నాయి.
ఇది సాయినాథుని చమత్కారమని భావించాడు జయకర్. ఆ డబ్బును వర్దేకు ఇచ్చాడు. పూజకు కావలసిన సరంజామా తెచ్చాడు వర్దే.
వర్దే గడుసరి భక్తుడు. సాయిబాబానే సత్యన్నారాయణునిగా భావించి పూజ చేసుకుంటానన్నాడు వర్దే. కుదరదన్నాడు సాయి.
కానీ భక్తుని ఒత్తిడికి సరే నన్నాడు సాయి. సాయిబాబాకు రెండు వైపులా అరటి పిలకలను పెట్టి, పాలవెల్లిని కూడా కట్టి పూజించాడు.
సత్యన్నారాయణ వ్రత కథను మంటపంలో పురోహితుడు చదివాడు. అందరూ శ్రవణం చేశారు. అది ఒక మథుర మనోహర దృశ్యం. దానిని ఊహించుకొని మనం ఆనందించాలి.
సాయిబాబా మహాసమాధి అనంతరం ఎం.వి. సహస్ర బుద్ధే అను భక్తునకు సాయి సమాధి మందిరంలో సత్యన్నారాయణ పూజ నిర్వహించినట్లు, నివేదనలు సాయి సమాధిలోనికి చేరినట్లు కల వచ్చింది.
సత్యన్నారాయణ పూజ ఆ రోజు జరిగినట్లు సంస్థానం వారు ధృవీకరించారు.
”ఓం శ్రీ సాయి సత్యన్నారాయణ స్వామినే నమః”
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- శ్రద్ధా భక్తులు …..సాయి@366 అక్టోబర్ 20…Audio
- ఉన్నది చాలును!…..సాయి@366 మే 17….Audio
- ఓం శ్రీ దత్త స్వామినే నమః …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 7
- ఓం కర్మ ధ్వంసినే నమః…..సాయి@366 సెప్టెంబర్ 3….Audio
- ఓం శేష సాయినే నమః …..సాయి@366 సెప్టెంబర్ 24…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments