ఏమీ కోరని జీవితం …. మహనీయులు – 2020… జూలై 10



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భాస్కరానంద సరస్వతి పూర్వనామం మతీరాం మిశ్రా. ఈయనకు 12 ఏటనే వివాహమైంది. 18 ఏట కుమారుడు జన్మించాడు.

యువకునిగా, భర్తగా, తండ్రిగా తన కర్తవ్యం నిర్వహించాననుకుంటూ సత్యాన్వేషణకు బయలుదేరాడు. భారత దేశం అంతటా తిరిగాడు. చివరకు కాశీలో స్థిరపడ్డాడు.

ఈయన త్రైలింగస్వామి సమకాలికుడు. ఈయనను దర్శించేందుకు దేశ, విదేశీయులెందరో వచ్చేవారు, మహారాజులు, మహారాణులు,

ఉన్నత ప్రభుత్వోద్యోగులు ఇలా ఎందరో ప్రఖ్యాత ఆంగ్ల రచయిత మార్క్ ట్వైన్ కూడా ఈయనను దర్శించాడు. సజీవ దైవమే అని శ్లాఘించాడు.

శీతోష్ణములను లెక్కచేయు వాడు కాదు. విదేశీయులు వచ్చినప్పుడు, ఒక వస్త్రాన్ని కప్పుకునేవాడు. అయన ఏమీ కోరడు. ఎవరైనా బంగారు బిళ్ళను ఇస్తే, వెంటనే దగ్గరుండే వారికి ఇచ్చేసేవాడు.

సాయిబాబా వాలే మూఢ నమ్మకాలను ఖండించేవాడు. మతం అంటే ఒక అటక. దానిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. లేకుంటే సాలెగూళ్ళు, చెదలు, ఎలుకలు పాడుచేస్తాయనేవారు.

అయన ఎల్లప్పుడు దేనికోసమో నిరీక్షిస్తున్నట్లుండేవారు. ఒకసారి ఆయన వద్దకు ఒక ఉన్నత న్యాయాధికారి, ఆయన తల్లి వచ్చారు.

వారు ఆయన భక్తులే. ఆ తల్లి భాస్కరానందుని పాదాలను వదలక పట్టుకుని ఏడ్వసాగింది. కారణం అడిగాడు భాస్కరానందుడు.

తన మనుమనికి ఆయుస్సు 17  ఏండ్లేనాని, ఆ ఆయుస్సు త్వరలో చెల్లిపోతుందని చెప్పి ఏడ్వసాగింది. కాపాడమని పరి పరివిధాల ప్రార్ధించింది.

ఆమె కన్నీటికి కరిగిపోయాడు భాస్కరానందుడు. “నేను జీవించి ఉన్నత కలం, అతడు జీవించి ఉంటాడు” అని ఆమెకు భరోసా ఇచ్చారు భాస్కరానందులు.

సాయిబాబా కూడ “నేను జీవించునంత కాలం మరణం నీ దరిదాపులకు రాదు” అని నందూరాం సంక్లేచాకు అభయమిచ్చారు.

భాస్కరానందులకు కలరా సోకింది. ప్రభుత్వ ఉన్నత వైద్యులు, రాజులు, మహారాజులు ఆయన చుట్టూ చేరారు ఆయన నిరీక్షణ ఫలించింది.

తన ఆత్మను పరమాత్మలో లీనం చేశారు. ఆయన జూలై నెలలో 1899లో కన్నుమూసారు.

అదే సమయంలో ఉన్నత న్యాయాధికారి కుమారుడు, స్వారీ చేస్తున్న గుర్రం పైనుండి పడి తక్షణం మరణించాడు.

భాస్కరానందులు తన ఆయువులో కొంత ఆయువును ఆ న్యాయాధికారి కుమారునికి బదిలీ చేయటంవలననే అప్పటివరకు బ్రతికి ఉన్నాడు.

భాస్కరానందుల మహాసమాధి కాశీలోని దుర్గాకుండ్ వద్ద ఉంది.

కోర్కెలు లేకుండా, ఎలా జీవించాలో ఆయన జీవితం తెలుపుతుంది.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles