కాలదర్ప దమనుడు…..సాయి@366 అక్టోబర్ 13…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


మతీరాం మిశ్రా జీవితం సామాన్యుని లాగానే  ప్రారంభమైంది. 9వ ఏట ఉపనయనం, 12వ ఏట వివాహం జరిగాయి. 18వ ఏట పుత్ర ప్రాప్తి కలిగింది మతీరాం మిశ్రాకు.

సత్యాన్వేషణకై ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదలి వెళ్ళిపోయాడు. పరమహంస పరమానంద స్వామి దీక్షనిచ్చారు.

మతీరాం మిశ్రా భాస్కరానంద సరస్వతి అయ్యారు. కాశీలో ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. ఆయనని ఎందరెందరో దర్శించి వారి కోర్కెలను తీర్చుకునే వారు.

ఒకసారి ఆయన వద్దకు ఉన్నత న్యాయాధికారి తల్లితో కలసి వచ్చాడు. వారు ఆయనకు అంకిత భక్తులే.

ఆ తల్లి భాస్కరానందుని పాదాలపై పడి ఏడ్వసాగింది. కారణం అడిగారాయన. తన మనుమని ఆయుర్దాయం 17 ఏండ్లేనని, ఆ ఆయవు అతి కొద్ది కాలంలో చెల్లిపోతుందని చెప్పి ఏడ్వసాగింది.

కన్నీటికి కరుగని కరుణామయుడుండడు.

ఆ తల్లికి మాట ఇచ్చారు – ”నేను జీవించి ఉన్నంత కాలం అతడు జీవించి ఉంటాడు” అన్నారు భాస్కరానందులు. ఆ మాట, ఆ భరోసా చాలు. ఆయనకు మరి మరి మొక్కి వెళ్ళిపోయారు వారు.

కొన్ని ఏండ్లు గడిచాయి. భాస్కరానందులు వారి ఆయువులో కొంత న్యాయాధికారి కుమారునికి బదిలీ చేశారు. భాస్కరానందులకు కలరా వచ్చింది.

ఆయన ఆత్మ పరమాత్మలో లీనమైంది. అదే సమయంలో న్యాయాధికారి కుమారుడు గుర్రపు స్వారీ చేస్తూ గుర్రం మీదనుండి పడి చనిపోయాడు.

ఇక సాయిబాబా భిక్ష చేసే గృహాలలో ఒకి నందురాం మార్వారీ గృహం. 1911లో షిరిడీలో ప్లేగు వ్యాధి వ్యాపించింది.

ఆ భయంతో నందురాంకు విపరీతమైన జ్వరం, కళ్ళు ఎర్రబారాయి. అవి ప్లేగు లక్షణాలని గ్రహించి కేరీ అనే గ్రామానికి పోదాలచి సాయిని అనుమతి వేడగా సాయి ”నేను మరణించే వరకు నీ చెంతకు మృత్యువుని రానివ్వను” అని అభయం ఇచ్చారు.

అతనికి సాయి అభయంతో విశ్వాసం కుదిరింది. ఆ సాయి భక్తుడు అక్టోబరు 13, 1946లో పరమపదించాడు.

అది సాయి అహేతుక కృప.

అందుకే సాయిని ”కాలదర్పదమనాయ నమః” అని కీర్తిస్తారు.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles