Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
సూరి నాగమ్మ గారు ప్రతి తెలుగు ఉగాది పండుగకు భగవాన్ రమణులకు ఒక కొత్త ఖద్దరు గుడ్డ, కౌపీనము తెచ్చి ఇవ్వడం, భిక్ష చేయటం మామూలు.
అలాగే ఆమె 19 మార్చి 1950 తేదీన తెలుగు ఉగాది పండుగ కావటం వలన 18న సాయంకాలం 7 గంటలకు తుండు గుడ్డ, కౌపీనము తీసుకొని భగవానులు ఉన్న చిన్న గదిలోనికి వెళ్ళి, ఆ బట్టలు బల్లమీద పెట్టి, ”రేపు ఉగాది” అన్నది.
భగవాన్ ఉలిక్కిపడ్డట్టు కదలి ”ఓహో వచ్చిందీ ఉగాది? వికృతి వచ్చింది” అని అదొకరకమైన ధ్వనితో అన్నారు.
ఆ మాటల ధ్వనికి, ఆమె, అక్కడున్న వారు నిశ్చేష్టులయ్యారు. ఒక అమంగళకరమైన వార్తకు సూచనగా భావించారు. కొలది రోజులకే భగవానులు కనుమరుగయ్యారు
అది రమణులు సూచన.
1918 దసరాకు కొద్ది రోజులముందు సాయినాథుని ద్వారకామాయిని ఊడ్చి శుభ్రంచేసే వ్యక్తి మాధవ్‌ఫస్లే, తన విధిని యధావిధిగా చేస్తున్నాడు.
మాధవఫస్లే చేతినుండి సాయినాథుడు ప్రతి దినం ఉపయోగించే ఇటుక జారి క్రిందపడి రెండు ముక్కలైంది. ఈ విషయం విన్నాడు సాయి బాబా.
మాధవఫస్లేపై చేయి చేసుకోలేదు. పైగా పల్లెత్తు మాట కుడా అనలేదు. ”దాని (ఇటుక) సహకారంతో ఆత్మ చింతన చేసేవాడిని. అది నా ప్రాణం. నాకు తోడుగా ఉన్నది. విరిగి పోయింది. అదిలేక నేను ఉండలేను.
ఆ ఇటుక నా జన్మకు తోడుగా ఉన్నది. అది ఈ రోజు నన్ను వీడి వెళ్ళిపోయింది” అని బాధపడ్డాడు సాయి.
మరునాడు కాకా సాహెబ్ దీక్షిత్ వచ్చి ఆ ఇటుక ముక్కలను వెండి తీగతో చుట్టించి తెస్తాను అంటే ”బంగారంతో చుట్టించినా లాభం ఏమి ఉంటుంది. పగలటం చెడును సూచిస్తోంది” అన్నారు సాయి బాబా.
అయితే సాయి మాటలలోని అర్థాన్ని గ్రహించింది ఒక్క మహల్సాపతి మాత్రమే అనవచ్చును.
మిగిలిన అందరూ భౌతికమైన ఇటుక కోసం, సాయి దుఃఖిస్తున్నాడు అనుకున్నారు.
రమణులు, సాయివంటి వారు సూచనలనేకం ఇస్తూనే ఉంటారు. కాలచక్రాన్ని తిరగనివ్వాలి.
ఏ విషయముపట్ల, మోదమూ కూడదు, ఖేదమూ కూడదు. అది అందరూ గ్రహించి ఆచరించాలి.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ‘‘ఇది వట్టి ఇటుక అనుకుంటున్నారేమో! కాదు. ఇది గురుప్రసాదం.”
- బాబా ఇచ్చిన ఇటుక
- నేనెవరు?…..సాయి@366 అక్టోబర్ 22….Audio
- నిన్ను నిన్నుగా ప్రేమించుటకు…..సాయి@366 జనవరి 3….Audio
- సాయి వారసత్వం! …..సాయి@366 మే 3….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments