బాబా ఇచ్చిన ఇటుక



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఓం సాయి రామ్

సాయి బందువులకు నమస్కారం.

నా పేరు లక్ష్మి ప్రసన్న.

బాబా దగ్గర ఒక ఇటుక ఉండేది మన అందరికి తెలుసు.

“ఇటుక కాదు, నా యదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు తోడు నీడ. దాని సహాయము వలననే నేను ఆత్మానుసంధానము చేయుచుండెడివాడను. నా జీవితమునందు నాకెంత ప్రేమయో దానియందు నాకంత ప్రేమ.”….శ్రీ సాయిబాబా (శ్రీ సాయి సచ్చరిత్రము అధ్యాయం 43-44)

బాబా శరీరం విడిచే కొన్ని రోజుల ముందు ఆ ఇటుక రెండు ముక్కలుగా విరిగిపోయింది. అది ఒక దుశ్శకునం .

చాలా సంవత్సరాలు బాబా వెంట ఉంది ఆ ఇటుక. అటువంటిది బాబా నాకు ఒక ఇటుకను ప్రసాదించారు.

ఒక రోజు నేను బాబా గుడికి వెళ్లాను అక్కడ ఒక అతను అమ్మ మీకు బాబా ఈ ఇటుక అందచేయమన్నారు. అందుకే పూజలో పెట్టాము అని చెప్పి పసుపుతో పూజలో ఉన్న ఒక ఇటుకని బాబాకి వేసిన ఒక తెల్లటి పంచెలో చుట్టి ఇచ్చారు.

నాకు ఏమి అర్ధం కాలేదు ఇటుక అనగానే బాబా ఇటుక కధ జ్ఞాపకం చేసుకుంటూ బాబా ఎదురుగా నిల్చున్నా. ఎదైనా మీ సన్నిదిలో జరిగింది మీ ఆజ్ఞ తండ్రి అని నేను ఇంటికి తెచ్చాను.

ఇంటికి రాగానే బాబా నాకు ఇటుక ఇచ్చారు అంటే ఇంట్లో సంతోషంగా ఫీల్ అవుతారు అనుకున్నా కాని బాద పడుతున్నారు.

ఎందుకు అంటే అది విరిగితేనే కదా బాబా మనకు శరీరంతో లేరు అని, అలాంటిది మరి నీకు ఇస్తే ఎలా!!! ఓహోఅవునా అని నేను జాగ్రత్తగా దాచాను కాని బాబాని అడగాలని ఉంది బాబా ఎందుకని నాకు ఇచ్చారు అని?

సరే అని బాబాని అడిగాను సరిగ్గా ఇటుక పేజి వచ్చింది! నేను ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఏమి చేసిన మీ నిర్ణయం బాబా నేను శిరసావహిస్తా అని చెప్పా.

మా ఇంట్లో వాళ్ళకి మాత్రం బాధ కలిగించిది, జాగ్రత్తగా దాచారు.

నాకు ఒక బయం ఉండేది ఎదో అవుతుంది అని కాదు కాని, అన్ని తెలుసుకొని జన్మ లేకుండా పరిపక్వత చెంది పోవాలి, గురువు దొరికారు జన్మ సార్ధకత చేసుకోవాలి ఇప్పుడే ఏమి జరగనివ్వకు నా పిల్లలు చాలా చిన్న వాళ్ళు అని బాధగా బాబాని అడుగుతూ ఉంటాను.

ఇలా అడగడం కూడా మనస్పూర్తిగా అడగలేను ఇంతా చెప్పి మళ్ళీ మీ ఇష్టం బాబా అనేదాన్ని.

ఈ లోగా మేము షిర్డీ వెళ్ళాము ద్వారకామాయి లో ఉన్నాను అది అర్ధరాత్రి ఒంటి గంట ఆ సమయంలో ఒక ఆవిడ నింబారు వైపు చూస్తూఉన్నారు ఆవిడ చూడడానికి భయం వేసేలాగ ఉన్నారు, చాలా సమయం అలానే ఉన్నారు.

నేను వెళ్లి అమ్మా కొద్దిసేపు కూర్చోండి అనగానే, ఆమెకు కోపం వచ్చి నా వైపు ఉరిమి చూసారు ఆమె ఎవరో తెలియదు, నాకు ఎందుకు కర్మరా దేవుడా అని నేను ద్యానంలో కూర్చున్నా.

ఎవరో తట్టారు, కళ్ళు తెరిచి చూస్తె ఆవిడ, ఏంటి  అమ్మా అన్నాను. బాబా నీ గురుంచి మాట్లాడుతున్నారు. అందుకే అక్కడ నించున్న అని చెప్పారు.!!!

మీరు ఎవరు, నేను ఎవరు, బాబా నా గురించి మీతోనా !!!

ఆవిడ చెప్పారు ఆ ఇటుక నేను పగలకొడితే పగులుతుంది లేక పొతే పగలదు బయం లేదు అన్నారు అని నీతో చెప్పమన్నారు మీ తాత.”

నిన్ను ఆయన చేతుల్లో చిన్న పాపా లాగా ఎత్తుకున్నారు అని, అన్నిటి కంటే ముందు నేను బాబాని తాత అనే పిలుస్తాను. ఆవిడ సంబోదించారు తాత అని.

ఆయన ప్రేమ, తాత నన్ను ఎత్తుకున్నారా నా ఆనందానికి గుర్తు ఇప్పుడు కన్నీళ్ళతో నిండిన నా కళ్ళు.

ఇక ఇంతకంటే రాయలేను తరువాతి  మళ్ళీ కలుస్తాను .

ఓం సాయి రామ్.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles