బాబా సదా, సర్వదా, నా చెల్లి వెనకే ఉండి, దానికి పండంటి కొడుకు పుట్టేవరకు తోడుగా వున్నారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి రాం..

నేను Sadha Siva( AIR.. Sambalpur.)

నాకు జరిగిన మరో మహాద్భుతం. మీతో పంచుకుంటాను..సాయిబాబా కృపాకటాక్షాలకు సీమలే లేవు.చదివి మీరు కూడా నతమస్తకం అవ్వక తప్పదు.

ముందుగా సాయినాధూని చరణద్వయాలకు నా శతకోటి ప్రణామములు సమర్పించుకుంటున్నాను.తప్పులుంటే మన్నించమని వేడుకుంటున్నాను.

“చివరి క్షణం వరకు నీ భక్తునిగానే ఉండని ప్రభు.”  ఇప్పుడు అసలు కథ చెప్తాను.

నా చెల్లికి పెళ్లి అయ్యి  అత్తగారింట్లో అడుగు పెట్టింది. పాపం తలరాత ఇలా మారుతుందని దానికి కానీ, నాకు కానీ తెలీదు.

ఒక సంవత్సరం వరకు గర్భము రాలేదు. ఇక్కడ ఒరిస్సా లో చాలా వెనకపడి వున్నవాళ్ళము మేము.

ఒక సంవత్సరం లో పిల్లలు పుట్టకుంటే, ఇంకా ఆ అమ్మాయికి నరకమే చూపిస్తారు అత్తగారింటి వాళ్ళు. దాని పరిస్థితి అలాగే అయ్యింది.

ఇక్కడ నాకు తెలీని విషయం, దాని మామగారు చాలా పెద్ద తాంత్రికుడు. (ఈ తంత్రవిద్యలు ఇక్కడ చాలా వాడుకలో ఉన్నాయి,నేను చూసాను…..మాధవి).

మేము కట్నకానుకలు పెద్దగా ఇవ్వలేదని వేధించడం మొదలెట్టాడు. ఒకరోజు, నన్ను పిలిచి, నీ చెల్లికి ఇంక పిల్లలు పుట్టరు, నీవు వెనక్కు తీసుకెళ్లు, అని గోల పెట్టాడు.

నేను ఈ మాటలు విని రాయిలా అయిపోయినాను. “బాబా, మళ్ళీ ఏంటి ఈ పరీక్ష??” అని చాలా వేదన పడ్డాను.

ఏమిచెయ్యాలో తెలీలేదు. ఇంతలో, నాకే తెలీని ధైర్యం వచ్చింది.

అంతపెద్ద తాంత్రికునితో challenge చేసాను,” మీరు ఎంతపెద్ద తాంత్రికునివి ఐన మా సాయిబాబా నీ కన్నా పెద్ద తాంత్రికుడు, ఆయనే నా చెల్లికి రక్షగా ఉంటాడు, మీ ఇష్టం, ఏమన్న చేసుకోండి” అని మా చెల్లిని వదిలేసి వచ్చాను.

ఇలా మూడు నెలలు గడిచాయి, నా చెల్లి గర్భవతి అయ్యింది(బాబా కృప ఉంటే, అంతే మరి).

నేను దాన్ని ఇంటికి తెచ్చాను. పిల్లాడు పుట్టాక పంపుతాను, అని చెప్పాను.

నా చెల్లి భయపడుతూ ఉండేది, “ఆయన చెప్పినట్లు పిల్లలు పుట్టరేమో, అనేది”.

నేను బాబా మీద విశ్వాసం ఉంచు. అన్ని బాబానే చూసుకుంటారు, అనే వాడిని.

కానీ నేను మనసులో భయపడే వాడిని. బాబాను వేడుకునే వాడిని, “బాబా, నేను ఛాలెంజ్ చేసి వచ్చాను, కానీ నిన్ను నువ్వే నిరూపించుకోవాలి, ఎలా చేస్తావో” అని.

నా చెల్లికి మధ్య, మధ్య లో కడుపులో చాలా నొప్పి వచ్చేది, ఎందుకో డాక్టర్ కు కూడా తెలిసేది కాదు. అలాంటి సమయం లో విభూతి నీళ్లలో కలిపి ఇచ్చేవాడిని.

ఒకసారి, చాలా నొప్పి ఉండగా, విభూది నీళ్లు ఇద్దాము అని, విభూతి వెతికాను, అంత విభూతి ఎక్కడో పోయింది. ఇంట్లో లేదు. అప్పుడు, అగరబతి వెలిగించి, ఆ కిందపడిన విభూతిని బాబా స్మరణతో ఇచ్చేవాడిని.

మా చెల్లి కడుపు నొప్పి తగ్గిపోయ్యేది. ఆయన తంత్రం వలన అది ఇన్ని బాధలు పడింది. ఆయన గుణీ చాలా చేసేవాడు. అయ్యో, తన మనవడే నష్టపోతాడు…అన్న ఆలోచన ఉండేది కాదు.

కానీ, నాకు పూర్తి నమ్మకం ఉండేది, బాబా తప్పకుండా రక్షిస్తాడు, అని. అలాగే బాబా సదా, సర్వదా, నా చెల్లి వెనకే ఉండి, దానికి పండంటి కొడుకు పుట్టేవరకు తోడుగా వున్నారు.

ఓ నా సాయి బంధువులరా! ఇది రాస్తూవుంటే, నా కళ్ళలో నీళ్ళు ఆగటం లేదు. ఇలా ఎన్నో రకాలుగా, నన్ను బాబా రక్షించారు.

అందుకే నేను ఖరాఖండి గా చెప్పగలను, మన సాయి బాబా “అనాధనాదధీనబంధావుడు” అని.

లాస్టుకు ఆ తాంత్రికుడు( మా చెల్లి మామగారు) కూడా వచ్చి, “అవును సదాశివ, నీ సాయి బాబా నాకన్నా పెద్ద తాంత్రికుడు..నా మాటలు వమ్ము చేసి ఒక మంచి మనవడికి ఇచ్చాడు” అని ఆయన కూడా చాలా సంతోషం పడ్డాడు.

నేను ఇవన్నీ మాధవి మేడం కు చెప్పాక, మేడం అన్నారు నాతో” అవును సదాశివ, సాయి చరిత్రలో, కుశభావు, అనే తంత్రవిద్య తెలిసిన వాడిని, బాబా మార్చేశారు.

నీ చెల్లి లాంటి కథలు చాలా వున్నాయి, అందుకే నేను అంటాను, మన జీవితాలు సాయి చరిత్రలు” అనింది.

నిజానికి నేను సాయి చరిత్ర చదవలేదు. ఇప్పుడు చదువుతాను. నేను ఎలా రక్షించ పడ్డానో మీరే ఆలోచించండి.

ఇంకో లీలతో మళ్ళీ కలుస్తాను.

సర్వం సాయి నాతర్పణమస్థు.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles