బాబా మనల్ని సదా కనిపెట్టుకొని ఉంటారు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

బాబా కి సచ్చరిత్ర గ్రంధానికి ఎటువంటి బేదం లేదని సచ్చరిత్ర రచయత హేమాడ్పంత్ చెప్పారు. మనము ఆ గ్రంధాన్ని నిత్యం శ్రవణ, మనన, నిధి ద్యాసలు చేస్తూ ఉంటె, మనం ఏవైనా తప్పులు చేసే సందర్బాలలో సచ్చరిత్రలోని బాబా వాక్కులు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాయి.

అందుకే ఎప్పుడు బాబా చింతనలో ఉండటం అలవరుచుకోవాలి. అందువలన మనకెంతో మేలు జరుగుతుంది. నిత్యం సాయి స్మరణలో ఉండటం వలన ఎల్లప్పుడు బాబా మనతోనే ఉంటూ, ఆపదలందు ఆడుకుంటూ, మనకు ఏ కష్టం రాకుండా ముందుకు నడిపిస్తారు.

ఇక హైదరాబాదులోని మియాపూర్ కి చెందిన శ్రీమతి అర్చన గారు రెండు అనుభవాలు saileelas.com ద్వారా సాయి బంధువులతో పంచుకోవడానికి నాకు  whatsapp లో పంపించారు. అవి మీకోసం క్రింద ఇస్తున్నాను. ఆమె మాటలలోనే చదవండి. ఈ లీల చదివితే బాబా ఎలా మనల్ని కనిపెట్టుకొని ఉంటారో మనకు అర్థం అవుతుంది.

ఓం సాయిరాం ….

2017, మార్చి 2వ తేది  రాత్రి సాయి మాట్లాడటం లేదు, నా కష్టాలు తీర్చటం లేదు అని  చాలా బాధ పడ్డాను. మధ్యాహ్నం ఎప్పుడు పడుకోను. ఆఫీస్ వర్క్ ఉంటుంది. కాని మార్చి 3వ తేది రోజు మధ్యాహ్నం పడుకుంటే “షిరిడి దర్శనం అయింది” చాలా హ్యాపీగా అనిపంచింది. చాలా ప్రశాంతం గా  ఉంది. రాత్రి నుండి చాలా బాధ పడ్డ నాకు బాబా దర్శనం ఇచ్చి నా మనస్సు తెలికపరిచారు.

2017, మార్చి7వ తేదిన మా పని ఆమె రాలేదు .. బాగా లేట్ గా వచ్చింది ..  అందువలన పని అంతా నేను చేసుకుంటూ  హడావిడిగా ఉన్నాను. పని బారమంతా నా మీద పడేసరికి  చాలా చికాకుగా ఉన్నాను. ఆ చికాకులో పని మనిషి రాగానే కోపగించుకున్నను. ..

తరువాత బాబా “ప్రాణులన్నిటి రూపాలలో నేనే సంచరిస్తుంటాను. ఎవరెవరిపై కోపించినా, దూషించినా నాకు చాలా బాధ కలుతుంది” అన్నారు కదా! ఈ వాక్యం గుర్తుకు వచ్చి ఆమెపై కోపగించుకున్నందుకు చాలా బాధ వేసింది.  

పరిహారం కోసం ఆమె కి ఫుడ్ , మా బాబు 50 పెన్సిల్స్ వాళ్ళ మనవడికి ఇచ్చాను.

మార్చి 8వ తేది రాత్రి  “Dont harrass poor …” అని బాబా మెసేజ్ వచ్చింది. నేను చాలా ఆశ్చర్యపోయాను..

బాబా నా ప్రతి కదిలికను గమనిస్తూ, ఏ చిన్న తప్పు చేసిన సరిద్దుతున్నారు.

అంతేకాదు, నేను మా బాబు తో గుడి బయట ఉండే భిక్షువులకు ఫుడ్ పర్సెల్స్ యిప్పిస్తుంటాను. ఆలా చేసిన ప్రతిసారి  అన్నదానం గురించి బాబా మెసేజ్ వచ్చేది.

బాబా మనల్ని సదా కనిపెట్టుకొని ఉంటారు.  కేవలం బాబా కోరిన శ్రద్ధ, సహనంలనే రెండు నాణేముల దక్షిణ సమర్పించడమే మనం చేయవలిసింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాబా మనల్ని సదా కనిపెట్టుకొని ఉంటారు

సాయి అర్చన

ఓం సాయి రామ్.. నాకు అనుక్షణం మీ రక్షణ కావాలి బాబా. నా పరిస్తితి , బాధలు మీకు తెలుసు. అంత మీ మీదే భారం.
Don’t fear , i have seen your tears and pains my child. I will take care of you అన్నా మీ మాటే నమ్ముకున్న సాయి…

ఓం సాయి రామ్
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి నమో నమః
శ్రీ సాయి నమో నమః
జయ జయ సాయి నమో నమః
సద్గురు సాయి నమో నమః

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles