Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
తనని నమ్మి, తనని ఆశ్రయించిన భక్తులు ఆపదలో ఉన్నారని తెలిస్తే, వారెంత దూరంలో ఉన్నా సరే బాబా ఆదుకుంటారు. వందల వేలమైళ్ళ దూరంలో, అందరాని ఎత్తున ఉన్నా పరుగున వచ్చి భక్తుల్ని ఆదుకోవడం ఆయనకి అలవాటు. అలా అని ద్వారకామాయిలో బాబా లేకుండా పోరు.
బాబా ఇక్కడా ఉంటారు. అక్కడా ఉంటారు.
ఏకకాలంలో ఎన్ని చోట్లయినా ఉండే శక్తి బాబాకి మాత్రమే ఉందంటారు భక్తులు. అనేక రూపాల్లో ఆయన సంచరిస్తారు. సరయిన భక్తుడే బాబా ఏ రూపాన ఉన్నదీ గుర్తించగలడు.
నానా కుమార్తె మైనతాయి గర్భవతి. ఆమెకు తొమ్మిది నెలలూ నిండాయి. రెండు రోజులుగా పురిటి నొప్పులు పడుతోంది. ప్రసవం కావట్లేదు. డాక్టర్లు పరీక్షించారు. అనేక రకాల మందులిచ్చారు. అయినా ఫలితం లేదు. పురిటి నొప్పులు తట్టుకోలేక ‘అమ్మా! అబ్బా’ అని గోల చేయడం లేదు మైనతాయి. నొప్పుల్ని భరిస్తూ బాబా నామస్మరణ చేస్తోందామె.
భరించలేనంతగా నొప్పి కలిగిందేమో! ‘బాబా’ అని గట్టిగా అరిచింది మైనతాయి. ఆ పిలుపు ద్వారకామాయిలో భజనలో లీనమయిన బాబాకి వినవచ్చింది. అంతే! ‘ఆపండి’ అన్నట్టుగా సైగ చేశారు బాబా.
భజన ఆగిపోయింది.‘‘ఏమయింది బాబా?’’ శ్యామా అడిగాడు.‘‘ఏం కాలేదుగాని, ముందు నువ్వో పని చెయ్యి. బాపూగిర్‌ని త్వరగా ఇక్కడికి రమ్మను.
నేను రమ్మన్నానని చెప్పు, త్వరగా వెళ్ళు.’’ అన్నారు బాబా. శ్యామా అక్కణ్ణుంచి బయల్దేరాడు. భజన ఆగిపోవడంతో భక్తులు కూడా వెళ్ళిపోయారు. ఒంటరిగా ఉన్నారు బాబా.
కూర్చున్న చోటు నుంచి లేచి, మెల్లగా ధుని దగ్గరగా నడిచారు. గుప్పెడు ఊది తీసి పొట్లం గట్టారు. దగ్గరగా ఉన్న ఆరతి పాట కాగితాన్ని అందుకున్నారు. వచ్చి, దాన్ని చదువుతూ కూర్చున్నారు.బాపూగిర్ అసలు పేరు రామ్‌గిర్‌బువా.
అతను ఓ సన్యాసి. ఖాండేష్ జిల్లాకు చెందిన వాడు. చాలా కాలంగా షిరిడీలో ఉంటున్నాడు. బాబా అంటే అతనికి ఎనలేని భక్తి. బాబా పాదాలనంటే ఉంటాడెప్పుడూ.
అతన్ని ‘బాపూగిర్‌బువా’ అని వ్యవహరించడం బాబాకి అలవాటు. బాపూగిర్ స్వగ్రామానికి వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నాడు. దానికి బాబా అనుమతి తీసుకున్నాడు.
అయినా త్వరగా రమ్మన్నారంటే ఏమయిందో ఏమో! అనుకున్నాడు బాపూగిర్. శ్యామాతో హడావుడిగా బయల్దేరాడు.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ‘‘బాపూగిర్ అని బాబా ఒక్కరే నన్ను పిలిచేది. ఇంకెవరూ నన్నలా పిలవరు.
- “నానాసాహెబ్కి ఈ ఊదీనీ, ఈ ఆరతి పాటనీ అందించాలి. ఆ బాధ్యత నీదే.’’
- బాబా మనల్ని అనుక్షణం కనిపెట్టుకొని ఉంటారు–Audio
- బాబా మనల్ని సదా కనిపెట్టుకొని ఉంటారు
- బాబా పంపించారంటే అభయం లభించినట్టే
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments