Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
ఇద్దరూ ద్వారకామాయి చేరుకున్నారు.‘‘చెప్పండి బాబా, రమ్మన్నారట కదా?’’ అడిగాడు బాపూగిర్.
‘‘అవును! నువ్వు మీ ఊరికి వెళ్తున్నావు కదా, అటుగానే కదా జామ్నేర్, అక్కడికి వెళ్ళి, నానాసాహెబ్ని కలవాలి.’’ అన్నారు బాబా.
కలుస్తాననిగాని, కలవను అనిగాని సమాధానం చెప్పలేదు బాపూగిర్. బాబానే చూస్తూ నిల్చున్నాడు.
‘‘నీలాగే నానాసాహెబ్ కూడా నా భక్తుడు. అతనికి ఈ ఊదీనీ, ఈ ఆరతి పాటనీ అందించాలి. ఆ బాధ్యత నీదే.’’ అన్నారు బాబా. అప్రయత్నంగా చాచిన బాపూగిర్ చేతిలో వాటిని ఉంచారు.
అందుకుని అప్పుడు అన్నాడు బాపూగిర్.‘‘నా దగ్గర రెండే రూపాయలు ఉన్నాయి బాబా. ఆ రెండు రూపాయలూ జల్గాం రైలు టిక్కెట్‌కి సరిపోతాయి. జల్గాం నుంచి జామ్నేర్కి వెళ్ళాలంటే డబ్బులు లేవు. నడవాలంటే…ముప్పయి మైళ్ళు నడవాలి. ఆలోచించండి బాబా.’
’‘‘అన్నీ ఆలోచించే చెబుతున్నాను, నువ్వెళ్ళు. నీ సంగతి నేను చూసుకుంటాను.’’ అన్నారు బాబా. మరో మాట మాట్లాడేందుకు బాపూగిర్కి అవకాశం ఈయలేదు. తన సంగతి బాబా చూసుకుంటానన్నారు. ఇంకెందుకు భయం అనుకున్నాడు బాపూగిర్.
జామ్నేర్కి బయల్దేరాడు. బాబాకి చెప్పినట్టుగానే తన దగ్గరున్న రెండు రూపాయలతోనూ జల్గామ్కి టిక్కెట్ తీసుకుని రైలెక్కాడతను.రాత్రి రెండు అయింది. జల్గామ్కి చేరుకుంది రైలు. బాపూగిర్ రైలు దిగి చుట్టూ చూశాడు. నిర్మానుష్యంగా ఉంది స్టేషనంతా.
కుక్క ఒకటి పరుగుదీస్తూ కనిపించింది. తోడుంటుంది అనుకుంటే అదీ లేదు. చీకటిలో కలిసిపోయింది.భయం భయంగా స్టేషన్ బయటికి వచ్చి నిల్చున్నాడు బాపూగిర్.
అక్కడి గడియారం కేసి చూశాడు. రెండున్నర గంటలయింది. ఇంతలో ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసింది. కొండల్లో ఎక్కడో పిడుగు పడిన శబ్దం. సన్నగా వాన ప్రారంభమయింది. ఏం చెయ్యాలిప్పుడు? ఈ రాత్రివేళ, ఈ వర్షంలో జామ్నేర్ వెళ్ళడం సాధ్యమా? అనుకున్నాడు బాపూగిర్.
అంతలో గుర్రపు సకిలింత వినవచ్చింది. చెట్లు చాటున, చీకటిలో టాంగా కనిపించడం లేదు. కళ్ళు చిట్లించుకుని చూశాడు. అప్పుడో వ్యక్తి వెలుతురులోకి వస్తూ కనిపించాడు.
టాంగావాలాలా లేడతను. సర్కారు బంట్రోతులా ఉన్నాడు. బంట్రోతు అయితే మాత్రం వెలిగిపోతున్నాడు. అతని కళ్ళలో చెప్పలేనంత వెలుగు. అలాగే అతన్ని ఎక్కడో చూసినట్టనిపించింది బాపూగిర్కి.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా పంపించారంటే అభయం లభించినట్టే
- ‘‘బాపూగిర్ అని బాబా ఒక్కరే నన్ను పిలిచేది. ఇంకెవరూ నన్నలా పిలవరు.
- ‘‘సాయిబాబానే మీ మైనతాయిని రక్షించాడు.
- బాబా ఇక్కడా ఉంటారు. అక్కడా ఉంటారు.
- నీ కొడుకు తాత్యాని నేను కంటికి రెప్పలా కాపాడతాను. ఈ క్షణం నుంచి తాత్యా బాధ్యత నాది.’’
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments