బాబా మాట జవదాటవద్దు మొదటి బాగం…



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

బాబా మాట జవదాటవద్దు మొదటి బాగం…

ఈ రోజు మరొక అద్భుతమైన సాయి లీల గురించి తెలుసుకుందాము.  బాబా గారు జీవించి ఉన్న రోజులలో భక్తులందరూ ఆయన అనుమతి తీసుకున్న తరువాతనే షిరిడీ నుండి బయలుదేరేవారు. ఆయన అనుమతి లేకుండా బయలుదేరినవారు కష్టాలపాలయ్యేవారు.  బాబా ఆజ్ఞలను ఉల్లంఘించకుండా సత్ప్రవర్తనతో జీవిస్తూ ఉంటే ఆయన అనుక్షణం మనలను కనిపెట్టుకుని కాపాడుతూ ఉంటారు.

1956వ సంవత్సరంలో సుభాష్ యొక్క తండ్రి కృష్ణారావు సప్తఋషి గారు ఒక క్రొత్త కారును కొన్నారు.  ఆయన పూనా నివాసి.  ఆయన బాబా భక్తుడు.  తను కొత్తగా కొన్న కారును షిరిడీకి తీసుకుని వెళ్ళి పూజ చేయించి బాబా ఆశీస్సులు పొందుదామని నిశ్చయించుకున్నారు. మన భారతదేశంలో  ఏదయినా క్రొత్త వాహనాన్ని కొన్నపుడు గుడి దగ్గరకు తీసుకుని వెళ్ళి పూజ చేయించి భగవంతుని ఆశీస్సులు పొందడం అనాదిగా వస్తున్న ఆచారం.

ఆరోజు గురువారం. కృష్ణారావుగారు కుటుంబంతో సహా తమ క్రొత్త కారులో బయలుదేరి మధ్యాహ్నానికి షిరిడీ చేరుకున్నారు.  ఆరోజుల్లో షిరిడీ ఒక చిన్న గ్రామం. ఇప్పుడున్నంతగా భక్తులతో రద్దీగా ఉండేది కాదు.  షిరిడీ చేరుకున్న తరువాత కృష్ణారావుగారు తన కారుని సమాధి మందిరం వద్ద నిలిపి, బాబాని ప్రార్ధించుకోవడానికి లోపలికి వెళ్ళారు. 

ఆ తరువాత దర్శించుకోవలసిన అన్ని పవిత్ర ప్రదేశాలకు వెళ్ళి, కారు దగ్గరకు వచ్చారు. పూజారి వచ్చి క్రొత్త కారుకు పూజ చేశారు. అప్పటికి సాయంత్రం దాటి ప్రొద్దుగూకింది. పూజారిగారు పూజ చేసిన వెంటనే, సుభాష్ తండ్రి వెంటనే పూనాకి తిరిగి వెళ్ళిపోదామనే ఆతృతలో ఉన్నారు. అక్కడ ఆయన అర్జంటుగా చూసుకోవలసిన వ్యాపార వ్యవహారాలు ఉండటం వల్ల వెంటనే తిరుగు ప్రయాణమవడానికి సిద్ధంగా ఉన్నారు.

ఆరోజుల్లో షిరిడీకి వచ్చిన వాళ్ళెవరూ గురువారంనాడు తిరిగి వెళ్ళే ఆలోచన చేసేవారు కాదు. ఇప్పటికీ భక్తులందరూ ఈ పద్ధతినే పాటిస్తూ ఉన్నారు. మా నాన్నగారు షిరిడీ నుండి బయలుదేరబోతుండగా గ్రామస్థులు ఆయనను గురువారం నాడు బయలుదేరవద్దనీ, రాత్రికి షిరిడీలో మకాం చేసి మరునాడు బయలుదేరమని చెప్పారు. ఈ విషయం సుభాష్ చెప్పాడు.

గ్రామస్థులు చెప్పిన మాటను కాదనలేక వారి మీద గౌరవం కొద్దీ మా నాన్నగారు శేజ్ ఆరతి చూసిన తరువాత బయలుదేరదామన్నారు. శేజ్ ఆరతి అయిపోగానే మా నాన్నగారు ఇక బయలుదేరడానికి తొందరపడ్డారు. అప్పుడు సమాధి మందిరంలో ఉన్న పూజారిగారు, ఈరోజు గురువారం మీరు బయలుదేరవద్దు అని చెప్పారు.

ఆయన మా నాన్నగారితో, “చూడు తమ్ముడూ, ఈరోజు బయలుదేరవద్దు.  ఒకవేళ మీరు అత్యవసరంగా చూసుకోవలసిన వ్యవహారాలు ఏమన్నా ఉంటే కనీసం అర్థరాత్రి వరకు ఉండి ఆ తరువాత బయలుదేరండి.  అర్ధరాత్రి దాటితే శుక్రవారమే కాబట్టి నియమాన్ని ఉల్లంఘించినట్లు కూడా అవదు” అని హితవు చెప్పారు.

మా నాన్నగారు ఆయన మాటలని పట్టించుకోకుండా మమ్మల్నందరినీ కారులోకి ఎక్కమని పూనాకి బయలుదేరదీశారు. వెంటనే కారు రోడ్డు మీదకు వచ్చింది. రోడ్డు మీద వీధి దీపాలు కూడా లేకపోవడంవల్ల చిమ్మచీకటిగా ఉంది. కారుకు ముందున్న హెడ్ లైట్ల కాంతి తప్ప రోడ్డు చుట్టు ప్రక్కల ఏమీ కనపడటల్లేదు. రోడ్డు ముందర ఏముందో తెలియదు. రోడ్డుకు ఇరువైపులా పొలాలు. కారు రోడ్డు మీదే వెడుతోందో లేక మలుపులు తిరిగిన చోట పొలాల్లోకే వెళ్ళిపోతోందో తెలియని పరిస్థితి.

ఇరువైపులా ఉన్న పొలాలలోంచి కీచురాళ్ళ శబ్దంతో ఆ చిమ్మచీకటిలో వాతావరణం భీతి గొలిపేలా ఉంది.  రోడ్డు మీద వచ్చేపోయే వాహనాలు ఏవీ కనపడటల్లేదు. హఠాత్తుగా మా కారు హెడ్ లైట్లు ఆరిపోయాయి.  ఒక్క కుదుపుతో మాకారు కీచుమని శబ్దం చేస్తూ ఎవరిదో పొలంలో ఆగిపోయింది. 

మా నాన్నగారు కారు హెడ్ లైట్లు వేద్దామని, కారుని స్టార్ట్ చేద్దామని ఎంతగానో ప్రయత్నించారు.  శ్రమ తప్ప కారు మాత్రం ముందుకు ఒక్క అంగుళం కూడా కదలలేదు.  లైట్లు కూడా వెలగలేదు.  మా నాన్నగారు కారు దిగి ఆ చీకటిలోనే రోడ్డు మీదకు వచ్చి నుంచున్నారు.  ఏదయినా వాహనం వస్తే వారి సహాయం అర్థిద్దామని ఎంతో ఆశతో ఉన్నారు. 

ఒకటి రెండు ట్రక్కులు వెళ్ళాయిగాని, మమ్మల్ని పట్టించుకోకుండా ఆగకుండా వెళ్ళిపోయాయి.  ఎవరో ఒకరు రాకపోతారా, సహాయం చేయకపోతారా అనే ఆశతో అలాగే రోడ్డు మీద నిలుచున్నారు మా నాన్నగారు.  గ్రామస్థులు, పూజారిగారు వెళ్ళవద్దు అని ఎంతగానో చెప్పినా వినకుండా బయలుదేరినందుకు చాలా బాధపడ్డారు.  తనని ఆ దురవస్థనుండి కాపాడమని రెండు చేతులు ఎత్తి బాబాని ప్రార్ధించారు.

రేపు తరువాయి బాగం….

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles