శివపూర్ బాబా మందిరము మహిమలు మొదటి బాగం….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

బాబా మందిరాల నిర్మాణంలో ప్రతి చోటా బాబా గారి శక్టి ఉంటుంది. ఆయన ప్రేరణే కనక లేకపోతే మందిర నిర్మాణం జరగదు. అంతా ఆయన ఆశీర్వాదమే. ఈ రోజు మనము పశ్చిమ బెంగాల్ లోని శివ పూర్ బాబా మందిరం గురించి తెలుసుకుందాము.

శివపూర్ బాబా మందిరము మహిమలు మొదటి బాగం….

అమిత్ విశ్వస్ గారికి బాబా గారు కలలో కనిపించారు. మందిరాన్ని నిర్మించమని బాబా గారు ఆజ్ఞాపించారు, నిర్మాణానికి సంబంథించిన ఏ ర్పాటులన్నీ తనే చూస్తానని చెప్పారు. ఈ విషయం  అమిత్విశ్వాస్ గారు ఇలా చెప్పారు.

“నేను కలలో వేలకు వేలు నియాన్లైట్లు ఉన్నట్లుగా వెలుగుని చూసాను. నేను చాలా దిగ్భ్రమ చెందాను. తరువాత “నేను సాయిబాబాని“ అనే మాటలని విన్నాను .

“మీ ముత్తా తగారు ఈ గుడిలో గంటల తరబడి పూజలు చేసేవారు. మీ ముత్తాత గారు ప్రతిరోజూ గంటల తరబడి పూజలు చేసేవారు .ఆయనతో నాకు చాలా ఆనందంగా ఉండేది.  యిప్పుడీ ప్రాంతమంతా అరణ్యంలా మారిపోయింది. మరల యిక్కడ భక్తితో పూజలు పునస్కారాలు జరగాలని ఆశగా ఉంది” అన్నారు.

బాబా గారు కలలో చెప్పిన విషయాలు.

1. నాకు గుడి కట్టించి ప్రతిరోజూ పూజలు చేయవలసిందిగా నిన్నుఆజ్ఞాపిస్తున్నాను.

2. ఈ వేప చెట్టుకింద యెవరియెతే నిలబడతారో వారు నేను ఉన్నట్లు గా అనుభూతి చెందుతారు. ఈ వృక్షం వారి పాపలన్నిటినీ తొలగించి వేస్తుంది.

౩. ఈ మందిర నిర్మాణానికి నా పని చేయడానికి నేను ఉంటాను. మందిర నిర్మాణము ఆగకూడదు.

4. ఈ మందిర నిర్మాణానికి నా నిజమైన భక్తుడు తప్ప ఎవరు యివ్వలేరు.

5. ఎవరియితే పూర్తి భక్తితో వచ్చి నా దర్సనం చేసుకుంటారో అతని/ఆమె కోరికలన్నీ నెరవేరతాయి .

బాబా గారు కలలో ఇంకా చాలా విషయాలు చెప్పారు కానీ, అవి ప్రజలకి వెల్లడించకూడదని, అమిత్ చెప్పారు.

భక్తుల విరాళాలవల్లా, ఆశీర్వాదం వల్లా బాబా మందిరాలు చాలా వచ్చాయి. కానీ బాబా గారి ఆజ్ఞతో ఈ మందిరమొక్కటే ఇంత పెద్దదిగా నిర్మించబడుతోంది. బాబా  విగ్రహం కూడా తను కలలో చూసినట్లే వుందని అమిత్ చెపుతూ ఉండేవాడు. దానికి కూడా కథ ఉంది.

ఈ సాయి సద్గురు కార్యకలాపాలు విన్న తరువాత ప్రముఖ జాతీయ శిల్ప కళాకారుడు, జాతీయ బహుమతి గ్రహిత అయిన సుబీర్ పాల్ ఊరికే కూర్చుండ లేకపోయాడు. బాబా ప్రేరణతో మనిషంతా సైజుతో బాబా విగ్రహాన్ని ఫైబర్ గ్లాసుతోతయారుచేసాడు.

పాల్ చెప్పినదేమిటంటే ఆరు నెలలుగా ఈవిగ్రహం తయారు చేస్తున్నప్పుడు ఏదో తెలియని దివ్య శక్తి తనలో ప్రవేశించిందని చెప్పాడు. ఇటువంటి సంపూర్ణమైన విగ్రహాన్ని తను ఇంతకుముందు తయారు చేయలేదని చెప్పాడు.

మందిరము యొక్క చరిత్ర

మనం 1850 సంవత్సరం ప్రాంతాలలోకి వెడితే, నాదియా వద్ద శివాపూర్ గ్రామంలో రామదాస్ విశ్వాస్ అనే ఆయన పెద్ద ధనవంతుడు. తన ఇంటి ఆవరణలోనే మందిరాన్ని నిర్మించి ప్రతిరోజూ పూజలు చేస్తువుండేవాడు. యెప్పుడు ఎవరి వద్దనించి సహాయము తీసుకోలేదు, కాని తన స్వంత ఖర్చుతో మందిరాన్నినిర్మించాడు.

గతం గురించి విచారిస్తే రామదాస్ విశ్వాస్ గారు తను ఉండగా మందిరంలో బాబా విగ్రహాన్ని పెట్టారా లేదా అన్నది తెలియదు. కానీ ఇంతవరకు లభించిన సమాచారం ప్రకారం 1920 లో మందిరంలో రోజు వారి పూజలు ఆగిపోయాయి. దాని వెనుక కారణం తెలియదు.

మెల్లగా మందిరం చుట్టూ పొదలు పెరిగి, బూజు, సాలిడులు విషపు పురుగులకి నిలయంగా మారింది.  గ్రామస్తులు, పాముల భయంతో గుడిలోకి  వెళ్ళడం పూజలు చేయడం  మర్చిపోయారు.

ఏమయినప్పటికీ చీకటి వెంటే వెలుతురు ఉన్నట్లు, వర్షం వెంటే ఇంద్రధనస్సు ఉన్నట్లు, శిధిలమవుతున్న మందిరం వద్ద పొదలలో ఒక వేప చెట్టు పెరగడం 1992 లో శివపూర్ గ్రామస్తులు చూశారు.

వారిని ఆశ్చర్య పరచిన విషయమేమంటే, ఆ వేప చెట్టు పుట్టగానే విషపు పాములు కుడా వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి. పాములు వెళ్ళిపోగానే గ్రామస్తులు,  పొదలు అవీ తీసి అంతా శుభ్రం చేయడం మొదలుపెట్టారు. అక్కడ పచ్చని మొక్కలు వచ్చాయి, పిల్లలు కూడా అక్కడ ఆడుకోవడం మొదలుపెట్టారు. తరువాత మందిరానికి వెళ్ళే దారి కూడా కనపడింది.

రేపు రెండవ బాగం….

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles