శివపూర్ బాబా మందిరము మహిమలు మూడవ బాగం….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

శివపూర్ బాబా మందిరము మహిమలు మూడవ బాగం….

లీల నంబర్ 1.

2009 సెప్టెంబర్ లో ఒక రోజు పీ. డబ్ల్యు. డి. యింజనీరు గారి భార్య ఈ మందిరం ప్రెసిడెంట్ అయిన అమిత్విశ్వాస్ గారిని కలుసుకొంది. సంసారం సుఖంగా ఉన్నప్పటికీ తనకి ఇంకా సంతానం లేకపోవడంతో జీవితం నిస్సారంగా ఉందని చెప్పింది . పెండ్లి అయి 10 సంవత్సరములు కవోస్తున్నప్పటికి సంతానం లేదని బాధ పడింది.

దంపతులిద్దరూ యెంతో మంది డాక్టర్స్ దగ్గిరకి వెళ్లి అన్ని మందులు వాడినా కూడా ఏమి ఫలితం కలగలేదని చెప్పింది. ఒకసారి వెహికిల్ మీద వస్తుండగా ఒకషాపులో  బాబా ఫోటో చూశానని చెప్పింది. ఆమె అమిత్ గారిని బాబా దర్సనం చేసుకుని పూజ చేయచ్చా అని అడిగింది.

అమిత్ గారు వారిని లోపలి రమ్మని పూజ చేసుకోమని చెప్పారు. ఆమె బాబా దర్సనం చేసుకుని సంతానం కోసం బాబా ముందు గట్టిగా విలపించింది. పెళ్ళయిన 10సంవత్సరాలకు  బాబా గారు  వారికి సంతానాన్ని ప్రసాదించారు.

లీల నంబర్. 2:

గుడ్డు గురంగ్, సైనా గురు నేపాల్ దేశస్తులు. వారికి సంతానం లేదు. వారు ఆ గ్రామంలో వాచ్ మన్లు గా ఉన్నారు. ఒకరి తరువాత ఒకరుగా వారి పిల్లలు పుట్టక ముందే మరణించారు. యెంతో మంది డాక్టర్స్ ని కలిసారు.

సైనా కు ఓవరిలో ప్రాబ్లం ఉండటం వల్ల సంతానానికి అవకాశం లేదు అని చెప్పారు. ఆఖరికి వైద్యం కోసం వెల్లూర్ వెళ్ళారు. కానీ ఫలితం లేకపోయింది. ఆఖరికి శివపూర్ బాబా గుడిలో పూజ చేసిన తరువాత వారికీ అందమైన అమ్మాయి జన్మించింది.

లీల నంబర్. ౩:

ఒక రోజు మందిరంలోని పూజారి గారి కూతురు, తన మొహం లోకింద కొంత భాగం నల్లగా ఉండటాన్ని గమనించింది . మోహంలోఆ భాగంలో నల్లని మచ్చలు ఉన్నాయి. పూజారి గారు చాలా ఆందోళన పడ్డారు. ఆయన ఏ వైద్యులని సంప్రదించలేదు.

ఆయన మనసార పూర్తి భక్తీ, నమ్మకంతో ఉదీని ఆమె ముఖమంతా రాసి, తన  కూతురి  ముఖం మీద ఉన్న నల్లటి మచ్చలని తొలగించమని బాబాని ప్రార్ధించారు. విచిత్రంగా 7 రోజులలో ఆమె ముఖం మీద ఉన్న మచ్చలన్ని మాయమయిపోయి, ముఖం ఇంతకు ముందులాగా మాములుగా తయారయింది.

లీల నంబర్. 4 :

శివపూర్ బాబా మందిరంలో పూజ చేసిన ఇద్దరు దంపతులకి పెళ్ళయిన 14 సంవత్సరాల తరువాత సంతానం కలిగింది.

ఒకరోజున ఒక భక్తుడు బాబా దర్శనానికి వచ్చాడు. అతను కొద్దిరోజులుగా విపరీతమైన కడుపు నొప్పితో బాధ పడుతున్నాడు. ఆనొప్పి ఎంతగా ఉందంటే అతను గుడిలో కుర్చోలేనంతగా ఉంది. అతను యెంతో భక్తితో ఊదీని నీళ్ళతో కలిపి తీసుకున్నాడు. కొద్దినిమిషాలలోనే అతని కడుపు నొప్పి తగ్గిపోయి, మరల నొప్పిరాలేదు.

లీల నంబెర్. 5:

ప్రక్కనే ఉన్న గొపీనాధ్పుర్ అనే గ్రామంలో ఒక భక్తుడు ఉన్నాడు. అతనికి పక్షవాతం ఉంది. అతను కాళ్ళని కదల్చలేడు. యెంతో మంది డాక్టర్స్ ని కలిసాడు, ఫిజియొథెరపీ చేయించుకున్నాఫలితం కనపడలేదు.

ఇతను అతి కష్టం మీద యెంతో భక్తితో శివపూర్ బాబా దర్శనం చేసుకున్నాడు. తిరిగి వెళ్ళేటప్పుడు మెల్లగా అతని పక్షవాతం తగ్గిపాయింది. ఇప్పుడు అతను మామూలు వ్యక్తులలాగే నడవగలడు, పరిగెత్తగలడు.

రేపు నాల్గవ బాగం….

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles