శివపూర్ బాబా మందిరము మహిమలు రెండవ బాగం….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

శివపూర్ బాబా మందిరము మహిమలు రెండవ బాగం….

1999 వరకు, గ్రామస్తులు ఈవిషయాలన్నిటిని చాలా తేలికగా తీసుకున్నారు. ఒక గురుపూర్ణిమ నాడు రామదాస్ విశ్వాస్ గారి ముని మనమడైన అమిత్ విశ్వాస్ గారికి, 1918 లో సమాధి చెందిన బాబా గారు కలలో కనపడి

“ఇప్పుడు వేప చెట్టు పెరుగుతున్నచోట, చాలా కాలం క్రితం రామదాస్, ఈ గుడిలోపూజలు చేస్తూ ఉండేవాడని చెప్పారు. మీ ముత్తాత గారు 100సంవత్సరాల క్రితం ఇక్కడ రోజు  పూజలు చేస్తూ ఉండేవారు. ఆయన నా భక్తుడు, గుడిలో గంటల తరబడి కూర్చుని ప్రార్ధన చేసే వారని చెప్పారు.  తరువాత అంతా ఆగిపోయింది. 

అందుచేత అన్ని బాధలు  సమూలంగా  నాశనము చేయడానికి నేను ఇక్కడ వేప చెట్టు నాటాను. మరల మందిరంలో పూజలు ప్రారంభించాలని నా కోరిక. ప్రజలకి ఈ మందిరం స్వర్గంలా చేయాలి. యెవరయితే ఈ మందిరంలోకి అడుగు పెడతారో అతని/ఆమె కోరికలన్నీనెరవేరతాయి.” అని చెప్పారు.

ఈ దివ్య సందేశంతో అమిత్ పొద్దున్నే లేచి మందిర ప్రాంతానికి వెళ్ళారు. ఆప్రాంతంలో ఉన్న పొదలు తొలగించి, సాలె పురుగు బూజులని తొలగించి శుభ్రం చెశారు.  బాబా మట్టి విగ్రహాన్నుంచి పూజలు చేయడం మొదలు పెట్టారు. కలలో బాబా గారు ఇచిన ఈ సందేశాన్ని గ్రామస్తులకు అందరికి ప్రచారం చేయగానే వారిలోకూడా ప్రేరణ కలిగింది. భయాన్ని వదలి  గ్రామస్తులు మందిరానికి వచ్చి పూజలు చేయడం మొదలుపెట్టారు.

నమ్మండి నమ్మకపోండి, కొద్ది రోజులలోనే బాబా గారు చెప్పిన వాగ్దానాలన్నీ నిజమవడం మొదలైంది. శిధిలమై ఉన్నప్పటికీ,  ఆమందిరంలో పూజలు చేసిన, ఒకామెకు పెళ్ళయిన 12 సంవత్సరాల తరువాత మొట్టమొదటగా సంతానం కలిగింది. నిజానికి డాక్టర్ ఆమెకు వైద్య శాస్త్రం ప్రకారం సంతానము కలుగదని ముందరే చెప్పాడు.

ఆమె ఒక్కత్తే కాదు ఆ గుడిలో పూజలు చేసిన కొంతమంది గ్రామస్తులకి నయంకాని రోగాలెన్నో తగ్గాయి. ఆదెబ్బతో గ్రామస్తులందరూ ఏది ఏమయినా సరే ఆ గుడిని కాపాడాలని తీర్మానం చెశారు.

2003 సంవత్సరంలో గ్రామస్తుల సలహా మీద అమిత్ గారు మందిరం పునర్నిర్మాణానికి ఒక ట్రస్టీని ఏర్పాటుచేశారు. తరువాత నాదియా-శివపూర్-సాయి-సద్గురు సమితి ఏర్పాటు అయింది. ఆకమిటీ మందిరాన్ని మరల కొత్త గా చేసి చుట్టుపక్కల ఉన్నబీదవారి అభివృధికి పాటుపడాలని తీర్మానించింది.

కమిటీ వరకట్న నిషేధము, విద్యార్ధులలో మత్తుమందు అలవాటుమానిపించుట మొదలైన సామజిక సేవలు కూడా చేపట్టాలని ప్రమాణం చేసింది. తరువాత కమిటీ తమ తీర్మానినికి అనుగుణంగా, బాల్యవివాహాలు, వరకట్న నిషేధం, మత్తుమందు అలవాటు మాన్పించుట వీటి గురించి విస్తృతమైన ప్రచారం చేసింది. 

చెప్పుకోదగిన విషయమేమంటే గ్రామస్తులలో ఫలితాలు రావడం మొదలుపెట్టాయి. వీరు సాధించిన విజయాలన్నీ కూడా నకశిపర  గ్రామం మరియు దాని చుట్టు పక్కల అంతా కార్చిచ్చులా  వ్యాపించింది.

ఆ విధంగా సాబిర్ పాల్ గారికి ప్రేరణ కలిగి బాబా విగ్రహాన్ని తయారు చేసారు. ఆర్ధికంగా సిథ్థంగా   లేనప్పటికీ గ్రామస్తులు మందిర నిర్మాణానికి పూనుకున్నారు. పాత కట్టడాన్ని ఏమాత్రం మార్చకుండా మందిర ఆవరణలో వెదురు కర్రలతో ఒక కట్టడాన్నినిర్మించారు. బంగారు రథంలో బాబా విగ్రహాన్నుంచి  తాటాకులతో వేసిన మందిరంలో ఉంచారు.

ఇప్పుడు భక్తులందరూ ప్రతిరోజూ రెండుసార్లు, పూజలు, భజనలు, ఆరతులు నిర్వహిస్తున్నారు. కమిటీ, మందిరాన్నికాంక్రీటుతో నిర్మించడానికి ప్రజలందరి వద్దనించి  విరాళాలు సేకరించడం మొదలుపెట్టింది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మూడవ వారంలో కమిటీ ఐదు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తోంది.  ఒక్కసారి కనక శాస్వత  నిర్మాణము  జరిగితే,  కోట్ల మంది భక్తుల రాక మొదలయి వారి కోరికలన్నీ నెరవేరతాయి. ఆ విధంగా అందరు చేతులు చాచి తమ బాధలన్ని తీరాలని ఎదురు చూస్తున్నారు. 

రేపు మూడవ బాగం…

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles