Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
శివపూర్ బాబా మందిరము మహిమలు నాల్గవ బాగం….
ఈ రోజు షివపూర్ బాబా గుడి లీలలు మిగతావి తెలుసుకుందాము. షివపూర్ బాబా గుడిలో జరిగిన లీలలు చదువుతుంటే మనందరికీ ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకుంటే బావుండును అనిపిస్తుంది. ఆ లీలలు అంత అద్భుతంగా ఉన్నాయి.
షివపూర్ బాబా మందిర్. లీల నం. 6
సునీల్ దాస్ అనే భక్తుడికి 16 రోజుల బాబు ఉన్నాడు. హటాత్తుగా ఈ బాబుఆహారం తీసుకోవడం మానేసి, అదేపనిగా యేడవడం మొదలుపెట్టాడు. ఇలా మూడు రోజులపాటు, తిండి లేకుండా అదే పనిగా వణుకుతూ యేడుస్తూ ఉన్నాడు. డాక్టర్ ఇచ్చిన మందులు కూడా యేమీ పనిచేయలేదు.
తరువాత వారు ఈ బాబుని బాబా గారి వద్దకు తీసుకుని వచ్చి విగ్రహం వద్ద పడుకోబెట్టారు. పూజారి గారు బాబా గారి పేరు జపిస్తూ బాబు నుదిటి మీద ఊదీని రాశారు. వెంటనే ఆ బాబు యేడవడం మానేసి నవ్వడం మొదలుపెట్టాడు. ఆ బాబు సీసాలో ఉన్న పాలన్నీ అక్కడున్నవారి సమక్షంలో తాగేసి, మామూలుగా ఆడుకొవడం మొదలుపెట్టాడు.
లీల నం. 7
తారిత్ పాల్ అనే భక్తుడి కూతురికి మొహనికి పక్షవాతం వచ్చింది. ఆయన కూతురుని యెంతో మంది డాక్టర్స్ దగ్గిరకి తీసుకువెళ్ళారు, కాని యెవరూ నయం చేయలేకపోయారు. తరువాత తారిత్ గారు ఈమెను బాబా గుడికి తీసుకుని వచ్చి మొహం మీద యెక్కడయితే పక్షవాతం వచ్చిందో అక్కడ ఊదీని రాయడం మొదలుపెట్టారు. వాడిన మందులన్నీ నిష్పలమైన తరువాత బాబా వారి అనుగ్రహంతో ఆమె పక్షవాతం తగ్గిపోయి మామూలుస్థితికి వచ్చింది.
లీల నం. 8
ఆ గ్రామంలొ ఇటువంటి లీలలు చాలా జరిగాయి. పెళ్ళికాని యువతులు బాబా గారికి ఈ గుడిలో పూజలు చేయగానే వివాహాలు జరిగాయి.
క్రిష్ననగర్లోని బాలాయి ఘోష్ అనే ఆయన కడు బీద స్థితిలో ఉన్నాడు. కనీస అవసరాలకి కూడా అతని వద్ద డబ్బు ఉండేది కాదు. ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు గాని యేమి ఫలించలేదు. పూర్తిగా నిరాశ చెంది జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్నాడు.
హటాత్తుగా అతని మనసులో శివపూర్లోని బాబా గుడికి 500/- విరాళమిస్తే అతని చెడు రోజులన్నీ పోతాయన్నట్లుగ ఒక సందేశం వచ్చింది. ఇతని వద్ద పాత సైకిలు తప్ప యేమీ లేదు. అందుచేత ఈ సైకిలుని 500/- కి అమ్మేసి ఆ వచ్చిన డబ్బు బాబా గారికి దక్షిణగా ఇద్దామనుకున్నాడు. అతను సైకిలుని 500- అమ్మేసి ఆవచ్చిన సొమ్ముతీసుకు వెళ్ళి శివపూర్ బాబా గుడికి వెళ్ళి, బాబా గారి పాదాల వద్ద పెట్టి ఇంటికి తిరిగి వచ్చాడు.
సరిగ్గా 7 రోజుల తరువాత బాలాయి దూరపు బంథువు ఇతనిని చూడటానికి వచ్చాడు. బాలాయి ఈ బంథువుని యెప్పుడూ చూడలేదు. బాలాయిని, తను చేస్తున్న వ్యాపారంలో భాగస్వామిగా ఉండమని అడిగాడు. బాలాయి ఈ వ్యాపారంలో యేవిథమయిన పెట్టుబడి పెట్టనవసరం లేదు అని చెప్పాడు.
ఈ బాలాయి బంథువుకి బ్యాటరీలు తయారీ, మరియు రిపేర్ వ్యాపారం ఉంది. వ్యాపారం బాగా అభివృథ్థి చెందింది. ఒక సంవత్సరం తరువాత బాలాయి గారు వ్యాపారంలో లాభం యెంత వచ్చిందో చూద్దామనుకున్నాడు. అతని బ్యాంకర్,
అతనికి ఒక సంవత్సరంలో 5 లక్షల రూపాయలు లాభం వచ్చిందని చెప్పాడు. ఇదే బాబా గారి చమత్కారము. బాబా గారు ఈ కడు బీదవాడిని థనవంతుడిగా చేశారు. బాలాయి, గారు బాబా గారికి 500/- ఇచ్చారు, బాబాగారు అతనకి 1000 రెట్లు తిరిగి ఇచ్చారు.
కనీసం ముగ్గురు నలుగురు, తాము, రాత్రి వేళ 2 , 2.30 మథ్య గుడి పైన వేప చెట్టు పైనించి, గుడిపైదాక ఒక గుండ్రటి తెల్లని కాంతి , బంతి ఆకారంలొ వెలుగులు విరజిమ్ముతూ తిరుగుతూ ఉండడం చూశామని అమిత్ విస్వాస్ గారికి చెప్పారు. ఈ గుండ్రటి బంతి రెండు మూడు సార్లు తిరిగిమాయమయిపోయిందని చెప్పారు.
లీల నం. 9
ఒకరోజున గుడిలో సాయంత్రం హారతి జరుగుతోంది. ఈ గుడి ప్రసిడెంట్ అయిన అమిత్ విశ్వాస్ గారు గుడి బయటకి చూశారు. ఆయన బాబా గారు, థొతీ, కుర్తా, కఫినీ, థరించి కీర్తనకి అనుగుణంగా నాట్యం చేయడం చూశారు. ఆరతి పాట జరుగుతున్నంత సేపూ బాబా గారు నాట్యం చేసి మాయమయిపోయారు. ఈ విషయం అమిత్ విశ్వాస్ గారు చెప్పారు.
ఒకావిడ, అనుకోకుండా తన భర్తకి పక్కింటి అమ్మాయితో అక్రమ సంబంథం ఉందని కనిపెట్టింది. వారి వివాహమయిన 15 సంవత్సరాల తరువాత ఇటువంటిది జరుగుతుందని ఆవిడ ఊహించలేకపోయింది. భర్త ఆవిడతో ఉండటానికి ఇష్టపడక దెబ్బలాడుతూ ఉండేవాడు. ఈమె బాథ పడియేడ్చింది.
ఆమె బాబా గుడికి వెళ్ళి తన భర్త మరలా తనతో ఉండేలాగ చేయమని మొర పెట్టుకుంది. తన భర్త అక్రమ సంబంథాన్ని వదులుకుని వస్తే బాబా గారికి పాయసం నివేదన చేస్తానని బాబా గారికి మాట ఇచ్చింది. నెల తరువాత ఆమె భర్త తిరిగి వచ్చాడు. అతను పక్కింటి అమ్మాయితో పెట్టుకున్న సంబంథాలన్నిటిని వదిలేశాడు.
రేపు ఐదవ బాగం…..
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శివపూర్ బాబా మందిరము మహిమలు మొదటి బాగం….
- శివపూర్ బాబా మందిరము మహిమలు రెండవ బాగం….
- శివపూర్ బాబా మందిరము మహిమలు మూడవ బాగం….
- శివపూర్ బాబా మందిరము మహిమలు ఐదవ బాగం….
- శివపూర్ బాబా మందిరము మహిమలు అరవ బాగం….
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments