శివపూర్ బాబా మందిరము మహిమలు ఐదవ బాగం….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

శివపూర్ బాబా మందిరము మహిమలు ఐదవ బాగం….

లీల నం. 10

ఈ గుడి సాయి భక్తుల విరాళాలతో నిర్మించబడింది. శ్రీ కె.వి.రమణి అనే గొప్పభక్తుడు, గుడి నిర్మాణ సమయంలో పెద్ద మొత్తంలో విరాళమిచ్చాడు. ఒకరోజున గుడి సీలింగ్ పని చేసేటప్పుడు పని వారికి 5,000/- రూపాయలు ఇవ్వవలసి వచ్చింది. పని వారికి డబ్బు ఇవ్వకపోతే వారు పనిలొకిరారు.

ఆరోజు రాత్రి గుడిని నిర్మించే వారి వద్ద నయాపైసా లేదు. మరునాడు గుడి నిర్మాణం కొనసాగించడమెలాగా అని బాగా వ్యాకులత పడ్డారు. 5,000/- రూపాయలు  యెక్కడనించి తేవాలి? వారు బాబా మీదే భారమంతా వేసి పడుకున్నారు. 

మరునాడు ఒకాయన తన కుటుంబంతో శివపూర్లొని బాబా గుడికి దర్శనం కోసం వచ్చాడు. ఈయన దుబాయి నుంచి వచ్చాడు, కలకత్తాలో ఉన్న  తన స్నేహితుడి  ద్వారా ఈ శివపూర్లోని బాబా గుడి గురించి విన్నాడు. ఆయన బాబా దర్శనం చేసుకుని పూజలు చేశారు.

తరువాత 5,001/-  రూపాయలకు చెక్కు మీద సంతకం చేసి బాబా గారికి దక్షిణగా, గుడి యాజమాన్యానికి చెక్కు ఇచ్చారు. బాబా గారు ఉన్నప్పుడు మనం బుఱ్ఱలో  అందోళనలు పెట్టుకోవడం యెందుకు. అదే బాబా లీల.

లీల నం. 11

గ్రామంలో ఉన్న ఆవులు, బాబా ఊదీ కలిపిన నీటిని తాగిన తరువాత ఆంథ్రాక్స్ వ్యాథి నుండి బయట పడ్డాయి. ఒక ఆవుకి 6 సంవత్సరములకి, దాని నుదిటి మీద బాబా ఊదీని రాసి, ఊదీ కలిపిన నీటిని తాగించిన తరువాత దూడ పుట్టింది.

ప్రతి సంవత్సరము జరిపే షివపూర్ బాబా గుడి వార్షికోత్సవాల్లొ, పది వేల మందికి అన్నదాన కార్యక్రమన్ని జరిపించే బాథ్యత సమీర్ భట్టాచార్జీ అనే ఆయన తీసుకుంటాడు. ఒక సంవత్సరం ఈయన జబ్బు పడ్డాడు.

ఆలయకమిటీ వారు ఆ సంవత్సరం ఉత్సవాలు భారీగా కాకుండా తక్కువగా చేద్దామనుకున్నారు. ఆఖరి నిమిషంలో గుడి ప్రశి డెంట్ అయిన అమిత్ విశ్వాస్ గారు, భక్తులందరికి, అన్నదాన కార్యక్రమానికి తమకు తోచినవిరాళాల ను ఇమ్మని విజ్ణప్తి చేశారు.

అనుకోకుండా చాలా మంది, బియ్యము, కూరగాయలు, పప్పులు, వాటితో వచ్చారు. వారు తెచ్చిన వాటితో పది వేల మందికి అన్నదానం చేయడమే కాకుండా ఇంకా మిగిలిన వాటిని బాబా ప్రసాదంగా తమ తమ ఇళ్ళకి తీసుకువెళ్ళారు. బాబా గారు సర్వాంతర్యామి. బాబా లీలను అర్థం చేసుకోవడం కష్టం.

లీల నం. 12

నాదియా జిల్లాలోని టెహత్త పి.ఎస్. బెతాయి జోర్డర్ గ్రామం లో శ్రీమతి తపతి మొందల్ గారికి పెళ్ళయి 20 సంవత్సరాలు అయింది. వైద్య శాస్త్ర పరంగ వారికి  పిల్లలు పుట్టే అవకాశం లేదు. వారు నిరాశా నిస్పృహలతో మానసికంగా చాలా వేదనతో ఉండి, శివపూర్ బాబా గుడికి వచ్చారు.

వారు అమిత్ విశ్వాస్ గారితో చాలా సేపు సంభాషించిన తరువాత, అమిత్ గారు ఆమె నుదిటి మీద బాబా ఊదీ ని పెట్టి, ప్రతీరోజు, ఊదీని పెట్టుకోమని చెప్పారు. ఆమె యెంతో భక్తితో ఊదీని పెట్టుకుంది. విచిత్రంగా ఆమెకి, 3 కె.జీ. 800 గ్రా. బరువుతోజనవరి 2010 న ఆడ శిశువు జన్మించింది. తల్లీ బిడ్డ సుఖంగా ఉన్నారు.

లీల నం.13

ఈ విథంగా ఈ షివపూర్ బాబా గుడిలో లీలల మీద లీలలుజరుగుతున్నాయి. ఆ గ్రామంలో థరణీ థర్ మొండల్ అనే ఆయనకి సెరిబ్రల్అటాక్ వచ్చి కోమాలో ఉన్నారు. అందరూ ఆశ వదులుకున్నారు. కానివిచిత్రంగా బాబా ఊదీ ని నుదుట పెట్టి, కొంచెం నోటిలో వేయగానే మూడురోజులలో లేచి తిరగడం మొదలుపెట్టారు. ప్రతిరోజు బాబ్ గుడికి రావడంమొదలుపెట్టారు.

లీల నం.14

శ్రీ సంతు మొండల్ అనె 9 వ తరగతి విద్యార్థి, మొహము మీద ఇన్ ఫెక్షన్ సోకి, ఆరు నెలలుగా మందులు వాడుతున్నప్పటికి యేమీ ప్రయోజనం కనపడకపోగా, శివపూర్ బాబా గుడికి వచ్చి బాబా ఊదీ పెట్టుకోగానే విచిత్రంగా వారం రోజులలో ఇన్ ఫెక్షన్ తగ్గిపోయింది.

ఒక సంవత్సరం ఉత్సవాలు జరుగుతున్నప్పుడు, బాబా దయవల్ల సంతానవతులైన నలుగురు తల్లులు బాబా గుడికి వచ్చి వారి పిల్లల బరువు యెంత ఉందో అంతే బరువుతో స్వీట్స్ అక్కడున్నవారందరికీ పంచిపెట్టారు.

శ్రీమతి కమలా బాలా జోర్దార్ అనే 75 సంవత్సారాల మహిళకి కుష్టు వ్యాథి మూడవ దశలో ఉంది. డాక్టర్ ఆర్జిత్ ముఖర్జీ నాదియా జిల్లా హాస్పిటల్ వైద్యుడు, ఎం.డి.టి. డొసు 12 నెలలపాటు వైద్యం చేసి తిప్పి పంపివేయగా, ఈమె 12 నెలలపాటు ఈ గుడిలో బాబా ప్రసాదము ఊదీతో కలిపి తీసుకొనగా, బాబా అనుగ్రంతో ఆమె వ్యాథి తగ్గిపోయింది. ఆమె ఈ ఉత్సవంలో సంతోషంతో నాట్యం చేసింది.

రేపు అరవ బాగం….

 

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles