నన్ను నేరుగా షిరిడికి తీసుకెళ్ళిపోయారు బాబా



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

సాయి బంధువులరా ఇదివరకు మనం భువనేశ్వర్ నుండి మాధవి గారు పంపిన కొన్ని లీలలు చదివాము. రీసెంట్ గా ఈ నెలలో జరిగిన మరో అనుభవాన్ని ఆమె మనకు తెలియజేస్తున్నారు. ఆమెకు, వారి కుటుంబ సభ్యులకు బాబా ఆశిస్సులు సదా ఉండాలని ఆశిస్తూ ఆమె అనుభవాన్ని మీ ముందుంచుతున్నాను.

నా పేరు మాధవి. నాకు ఈ నెలలో జరిగిన ఒక బాబా లీలను సాయి బంధువులతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆ దయామయుడు మనల్ని ఏవిధంగా అనుగ్రహిస్తారో ఎవరు వర్ణించలేరు.

ఒక సెలవురోజు శనివారం నేను మా ఇంట్లో మధ్యాహ్నం 4 గంటల సమయంలో బాబా నివసించిన  ద్వారకమాయి మరియు బాబా వెలిగించిన ధుని గురించి చదువుతున్నాను. నాకు అన్నింటికన్నా ద్వారకమాయి అంటే చాలా ఇష్టం.

ఎన్నో సంవత్సరాలు ఆ సాయి ప్రభువు అక్కడ నివసించి, ఎందరికో కష్టాలు తీర్చారు, ఎన్నో లీలలు చేసారు. ఇప్పటికి నాకు అక్కడ ఉన్న శాంతి మరెక్కడ లేదు అనిపిస్తుంది.

అక్కడ జరిగిన హారతులు, అన్నదానాలు, వేసిన నాటకాలు, పులి లాంటి జీవ జంతువులూ మీద అయన కారుణ్యం, ఎన్నెన్నో అసలు. అలాంటి ద్వారకమాయి గురించి చదువుతున్నాను.

అకస్మాత్తుగా నా మొబైల్ మ్రోగింది. చూస్తే పాఠకులందరికి తెలిసిన మన saileelas.com శ్రీనివాస మూర్తి గారు వీడియో కాల్ చేస్తున్నారు. నేను కాల్ లిఫ్ట్ చేస్తే, అయన “మేడమ్ ద్వారకమాయి చూస్తారా! చుడండి. నేను షిరిడిలో ఉన్నాను. ఇప్పుడే ద్వారకమాయి దర్శనం చేసుకొని బయటకు వచ్చాను. నాకు ఎందుకో మీకు కాల్ చేయాలి అనిపించింది. ఇది వీడియో కాల్ ,  మీరు కూడా ద్వారకమాయి దర్శనం చేసుకోండి” అని అన్నారు.

అలా బాబా నాకు ద్వారకమాయి దర్శన భాగ్యం కలిగించారు. ఇదంతా నాకు చాలా అశ్చ్యర్యం అనిపించింది. అయన నాకే కాల్ చేయాలా? ఆయనకు ఎంతమంది తెలిసిన వాళ్ళు లేరు? ఉన్నారు కదా! కానీ అది ఆ ప్రభువు చేసిన లీల. ఆ సమయంలో నేనే గుర్తుకు వచ్చాను, లేదు బాబానే స్పూరింపజేసారు.

నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. బాబా యెంత కృప గల స్వామి.

ద్వారకమాయి, ధుని, తులసికోట, అన్నదానాలు, హారతులు గురించి చదువుతూ ఉండగా నన్ను నేరుగా షిరిడికి తీసుకెళ్ళిపోయారు బాబా. ఇలా ఉంటాయి ఆయన లీలలు.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “నన్ను నేరుగా షిరిడికి తీసుకెళ్ళిపోయారు బాబా

kishore Babu

ఈ లీల చాల అద్భుతముగా ఉన్నది….సాయి బాబా…సాయి బాబా.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles