సచ్చరిత్ర చదవడంతో గురువు అంటే ఎవరో, దైవం అంటే ఎవరో తెలిసింది



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

ch. పెంటయ్య అనే సాయి బంధువు తన అనుభవాన్ని saileelas.com ద్వారా సాయి బంధువులతో పంచుకొనేందుకు వాట్సప్ లో నాకు మెసేజ్ చేసారు. వారికీ వారి కుటుంబానికి బాబా ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక ఆయన అనుభవాన్ని ఆయన మాటల్లోనే చదవండి.

ఓం గం గం గణపతేయే నమః ఓం సద్గురుభ్యోనమః .

మాది మాకవరిపాలెం మండలం లో తూటిపాల అనే చిన్న గ్రామం. నాకు చిన్నతనం నుంచి దైవభక్తి ఎక్కువ. నేను ఎక్కువగా ఆంజనేయ స్వామిని వెంకటేశ్వర స్వామి కోలిసేవాడిని. 

చాలాకాలం తరువాత నా జీవన ప్రయాణం లో ఒక సాయి బాబా భక్తుడు పరిచయం అయ్యాడు. అతను బాబా సచ్చరిత్ర చదువు తున్నడు. నాకు పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. కాబట్టి ఒక్క సారి బాబా చరిత్ర ఇవ్వరా అని అడిగాను. అతను తీసుకోమని ఇచ్చాడు.

అప్పుడు సాయి చరిత్ర చదవడం మెదలపెట్టను. అప్పుడు తేలిసింది. గురువు అంటే ఎవరు? దేవుడు అంటే ఎవరు? అని. చదువుతుంటే చాలా అనందనం గా అనిపిచ్ఛింది. గురువు అంటే బహ్మ, విష్ణు, మహేశ్వరులు మరియు అది పరశక్తి అని, సకల దేవతల స్వరూపమని అర్ధమయ్యింది.

సబ్ కా మాలిక్ ఏక్(అందరికీ దేవుడు ఒక్కడే) అన్న మాట నా హృదయం లో నాటుకుపోయింది. అప్పుడు అనుకున్న నాకు తల్లి దండ్రి గురువు దైవం సాయిబాబా అని సాయిబాబాని కోలిస్తే సకల దేవతలని కోలిచి నట్టెనని. 

మీకు మీరుగా నా దగ్గరకు రావాలనుకుంటే రాలేరు. నేనే నా భక్తులను నా దగ్గరకు రప్పించుకుంటాను అని బాబా చెప్పారు. పూర్వజన్మ సుక్రృతం బాబా నన్ను రెండు సార్లు రప్పిచుకున్నారు.

ద్వారకమాయి ప్రవేశం సర్వ దుఃఖపరిహారం. సాయి సాయి అని పిలవండి, సప్తసముద్రాలు దాటిస్తాను అని బాబా వారు చెప్పారు. అందుకని. నేను నిత్యం సాయి సాయి అని స్మరిస్తూ ఉంటాను.

ఓం సాయి శ్రీ సాయి జైజైసాయి 

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles