బాబా అంటే ఎవరో తెలియకుండా తనని ద్వేషించుకున్న మాకు తాను ఎవరో తన మహిమ, ప్రేమ, దయ ఎలాంటిదో చూపించి మా గమ్యాన్ని మార్చిన బాబా గారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మేము (ఒక భక్తురాలు) ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాము. మా బావ గారు, మరుదులు అంతా పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు.

మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మాకు చిన్న వ్యాపారం మాత్రమే మా వూర్లో వుండేది.

మాకు నలుగురు ఆడపడుచులున్నారు. వాళ్ళకి, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి, పేరంటాలకి చీరలు, బంగారాలు, పెట్టిపోతలకి అన్నదమ్ములందరికి వంతులు వేసేవారు.

ఒకళ్ళ తరువాత ఒకళ్ళు పురుళ్ళు, బారసాలలు, చిన్న చితక వెండి, బంగారం, పట్టుబట్టలు, మా వంతు వచ్చేసరికి మేమంత ఇచ్చుకోలేకపోయేవాళ్ళం. ఇవ్వలేమంటే ఎగతాళిగా మాట్లాడేవారు.

వేలెత్తి చూపించి పది మందిలో అవమానించేవారు. పిల్లల్ని ఒక కాన్వెంట్ లో చేర్పిస్తే, మా పిల్లలతో సమానంగా వీళ్ళకీ కాన్వెంట్ చదువులు ఎందుకో గవర్నమెంట్ స్కూల్ సరిపోతుందిగా అంటూ హేళనగా మాట్లాడేవారు.

ఈ బాధలు సూటిపోటి మాటలు తట్టుకుని అక్కడ ఉండే కంటే అక్కడ వ్యాపారం ఎత్తేసి ఏ సిటీకన్నా వెళ్ళి పోతే నయం అనుకొని అక్కడ వ్యాపారం ఎత్తేసి ఈ భాగ్యనగరానికి వచ్చాము ఇక్కడ మా భాగ్యం ఎంతుందో పరీక్షించుకుందామని.

వచ్చేటప్పటికి ఇక్కడ జీవనాధారం కోసం బట్టల వ్యాపారం ప్రారంభించాము.

అది ఒక ప్రముఖ ‘సాయిబాబా మందిరం’ ప్రక్కనే. అక్కడికి దగ్గరలోనే ఒక పోర్షన్ అద్దెకి తీసుకుని అందులో వుండేవారం.

ఒక రూమ్, ఒక వంట గది. పిల్లల్ని స్కూల్ లో చేర్చాము. నేను మిషన్ కుట్టేదాన్ని. ప్రతి గురువారం బాబా గుడికి విపరీతమైన జనం వచ్చేవారు.

మా షాప్ ముందు నుండి క్యూలు ఉండేవి. ఏమిటో ఈ జనం హాయిగా ఏ తిరుపతి వెంకన్ననో వేడుకోకుండా ఈ ఫకీర్ చుట్టూ తిరుగుతూ కొబ్బరి కాయలు కొడుతున్నారే పైగా మా లాంటి చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఎంతో ఇబ్బంది కలిగిస్తుంటారు.

షాప్ ముందు క్యూలు ఉంటే షాపుకి ఎవరు వస్తారు. ఏం కొంటారు. అని అనుకుంటూ వుండేదాన్ని.

ఏమీ పెద్దగా బేరాలు ఉండేవి కావు. అలా చాలా ఇబ్బందిగా ఉంటూ ఉండేది.

మేమున్న హౌస్ ఓనర్ చాలా మంచిది. అందరికి 1200/- రూపాయలు అద్దె తీసుకునేది. మాకు మాత్రం 900/- రూపాయలకే అద్దెకు ఇచ్చింది.

అలా ఏడాదిన్నర కాలం గడిచింది. ఏమీ పెద్దగా బిజినెస్ నడిచేది కాదు.

ఎప్పుడైనా జరిగే బిజినెస్ కి ఈ ‘బాబా’ గుడి క్యూలు ఇబ్బందిగా వుంది అనిపించి బాబాని బాగా తిట్టుకునేదాన్ని.

నేను కుట్టిన జాకెట్స్ కు వచ్చిన డబ్బులతో కొంచెం ఇల్లు గడుపుకోవడానికి సరి పెట్టుకునేవాళ్ళం.

తినడానికి కూడా లేక ఇబ్బంది పడేవాళ్ళం. నా దగ్గర ఉన్న కాస్తో కూస్తో బంగారం కూడా ఇంటి అవసరాలకి కరిగిపోయింది.

మా పరిస్థితికి నేను చాలా బాధ పడుతూండే దాన్ని. ఒక రోజు నేను బాధ పడుతూంటే మా పక్కింటావిడ వచ్చి బాబాని ఎప్పుడు తిడుతుంటావు, అలా తిట్టేకంటే ఒక సారి ఆయన పూజ చేసి ఆయన్ని నమ్ము, నీ కష్టాలన్నీ తీరిపోతాయి.

శ్రీ సాయి సచ్చరిత్ర పుస్తకం చదువు వారం రోజులలో పూర్తి చెయ్ అని చెప్పింది.

అప్పుడు నేను ఆవిడతో ఎలా చేయను నా దగ్గర ఆ పుస్తకం లేదు, దీపం పెట్టడానికి వత్తులు లేవు, అందులో వేయడానికి నూనె కూడా లేదు అని అన్నాను.

ఎందుకంటే ఆయనంటే నాకు ఏ మాత్రం అవగాహన లేదు, ఇష్టం కూడా లేదు.

ఆయనంటేనే గురి లేనప్పుడు, నేనాయన పూజ చేయటం, ఆయన పుస్తకం పారాయణ చేయటం ఏమిటి? అని అలా అన్నాను.

పైగా నిజంగానే మా ఇంట్లో ఏమీ లేవు. అప్పుడు ఆవిడ పుస్తకం, ఫోటో నేనే ఇస్తాను రేపే గురువారం మొదలుపెట్టు అంది.

ఇంక నేను సరే అనక తప్పలేదు.ఒక విధంగా బలవంతంగానే మర్నాడు మొదలు పెట్టాను.

తాను  చదువుతున్న పుస్తకం తెచ్చి నాకు ఇచ్చింది. ఒక చిన్న బాబా ఫోటో తెచ్చి ఇచ్చింది.

నేను మా ఇంట్లో కొబ్బరినూనె ఉంటే అది ప్రమిదలలో పోసి దీపారాధన చేశాను.

ఒక రోజు పారాయణ పూర్తియ్యాక పటిక బెల్లం పలుకులు నైవేద్యం పెట్టాను. అలా మొదలు పెట్టి వారం రోజులలో పూర్తి చేసాను.

ఆ రోజు మా పక్కింటి ఆవిడ కొబ్బరికాయ కూడా తెచ్చి ఇచ్చింది. ఆ కొబ్బరి కాయను కొట్టాను.

నన్ను బలవంతంగా బాబా పూజ చేయిస్తున్నందుకు ఆవిడని కూడా బాగా తిట్టుకున్నాను. అయినా ఒక పూట కొబ్బరి కూర వస్తుంది అని కొబ్బరి కాయ కొట్టాను.

పారాయణ పూర్తి అయిన రోజే మా వారికీ ఒక కేబుల్ ఆఫీస్ నుండి  4000/- రూపాయలు జీతం ఇస్తామంటూ ఉద్యోగానికి పిలుపు వచ్చింది.

బాబా మీద నాకు ఇష్టం లేకపోయినా, పక్కింటావిడ బలవంతంగా పూజ చేయిస్తోందని ఆవిడని తిట్టుకుంటూ పారాయణ చేసినా, మరి బాబా నా మీద ఇంత ప్రేమ, కరుణ ఎందుకు కురిపించాడో? నాకు ఆ క్షణంలోనే బాబా పై నమ్మకం, విశ్వాసం ఏర్పడింది.

ఆయన ఆ ఉద్యోగం లో చేరారు. నేను జాకెట్లు కుడుతూ , చిన్న చిన్న MLM స్కీంలు ఇద్దరమూ చేస్తుండే వాళ్ళం.

అలా మా స్థితి మెరుగవుతూ వచ్చింది. మేము ఆ గుడి ఏరియా నుండి మరో  ఏరియాకి ఇల్లు మారాము.

మా వారి ఉద్యోగానికి దగ్గర అవుతుందని పిల్లల స్కూల్ కూడా మార్చము.

అయినా గురువారం తప్పనిసరిగా మేము ముందున్న ఏరియాలో ‘సాయిబాబా గుడికి వెళ్ళటం అలవాటుగా మారింది.

తిన్నా తినకపోయినా నెల తిరిగేటప్పటికి అద్దె మాత్రం కట్టవలసిరావటంతో, అందరికీ సొంత ఇళ్ళు ఉన్నాయి. మనకి మాత్రం లేదు.

మనకి కూడా సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది అని బాబా గుడిలో బాబా ముందు నిలబడి, ‘బాబా మాకు కూడా సొంత ఇల్లు కావాలి, అద్దె ఇల్లు అయితే నెల తిరిగేటప్పటికి అద్దె ‘గద్ద’ తన్నుకుపోయినట్లు ఓనర్స్ తన్నుకుపోతున్నారు.

అదే మాకే ఇల్లు ఉంటె ఈ బాధ ఉండదు కదా! బాబా, మాకూ ఇల్లు ఇవ్వు బాబా అని కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటున్నాను.

నా కాళ్ళ ముందు ‘వంద’ సంఖ్య. ఒక పక్షి ఎగిరిపోతున్నట్లుగా కనపడ్డాయి.

The above miracle has been typed by: Shiva Kumar Bandaru

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles