బాబా వారి దయతో వారం లోగ మా ఇల్లు అమ్ముడయిపోయి, మా పెద్ద పాప పెళ్లి చేయగలిగాము.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నా పేరు శైలజ, మేము హైదరాబాద్ లో వనస్థలిపురంలో ఉన్న  భూలక్ష్మినగర్ లో ఉంటాము. నేను రిటైర్డ్ టీచర్ ని.

మాకు ముగ్గురు ఆడపిల్లలు, వాళ్ళు పెళ్ళిళ్ళవయస్సుకి వచ్చేదాకా మాకు బాబా తెలియదు.

మా పెద్దమ్మాయి పెళ్ళి అనుకోకుండా కుదిరింది. అప్పుడు మాకు రాంనగర్ లో ఉన్న ఇల్లు అమ్మితేగాని పెళ్ళి చేయలేని పరిస్థితి.

అందుకని రాంనగర్ లో మా ఇంటి పక్కనే ఉన్న వారికి తాళాలు ఇచ్చి, ఎవరైనా కొనుక్కోవడానికి వస్తే చూపించమని చెప్పాము.

రోజులు గడుస్తున్నా, చుట్టుపక్కల ఇల్లు అమ్ముడు అవుతున్నాయి  కాని మా ఇల్లు కొనడానికి ఎవరూ రావటం లేదు అని వాళ్ళు చెప్పేవాళ్ళు.

నేను టీచర్ ని కాబట్టి ఇంట్లో సాయంత్రం ట్యూషన్ చెప్పేదాన్ని. ట్యూషన్ కి వచ్చే పిల్లలు ప్రతి గురువారం తొందరగా ఇంటికి వెళ్ళిపోతాం అని అడిగి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు.

ఒక గురువారం మీరు ఒక్క గురువారమే ఎందుకు తొందరగా వెళ్తున్నారు అని నేను వాళ్ళని అడిగాను. అప్పుడు వాళ్ళు మేము సాయిబాబా గుడికి వెళ్లి అక్కడ జరిగే హారతులతో పాల్గొంటాము అని చెప్పారు,

అది విని మా పిల్లలు మనము కూడా బాబా గుడికి వెళ్దాం అని అన్నారు. సరే అనుకోని బయలుదేరి గుడికి వెళ్ళాము.

అప్పటికే పెళ్ళి గురించి, ఇల్లు గురించి సతమతమవుతున్న నా మనస్సు గుడికి వెళ్లి బాబా దర్శనం కాగానే మనసంతా ప్రశాంతంగా అయింది.

ప్రదక్షణ చేసే క్రమంలో బాబా వెనుకకు చేరి, అక్కడ నా తలను వుంచేసరికి ఒక్కసారిగా నా గుండెలో నుండి బాధ కట్టలుతెంచుకుంది. అంతే! నా గోడు అంత బాబాకు నాకు తెలియకుండానే చెప్పుకున్నాను.

కాసేపటికి నా గుండె బాధ తీరింది. తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఇంటికి తిరిగి వచ్చాము.

ఆ రోజు రాత్రి 10:30 కి మా స్టూడెంట్ ఒకతను సైకిల్ మీద వచ్చి, మేడమ్ మీరు రాంనగర్ ఇల్లు అమ్ముదాము అనుకుంటున్నారా? అని అడిగాడు.

అవునురా అక్క పెళ్ళికి డబ్బులు కావాలిగా అందుకోసం అమ్ముదామనుకుంటున్నాము అన్నాను.

దానికి వాడు మా చుట్టాలాయన ఇల్లు కొనుక్కుందామనుకుంటున్నాడు.

మధ్యాహ్నం ఇల్లు చూడటానికి అయన వెళితే మీరు తాళాలిచ్చిన అంకుల్ ఈ ఇల్లు రాములు గారు ( మా వారు ) అమ్మరు, అవసరం లేదని నాకు చెప్పారు. అందుకే నేను ఇల్లు చూపించను అన్నాడట,

నిజమేనా మేడమ్ ఇల్లు అమ్మటం లేదా అని అడిగాడు. అప్పటికి గాని మాకు జరుగుతుంది ఏమిటో అర్థం కాలేదు. నా తల తిరిగిపోయి, ఆ కుర్రవాడితో మా అమ్మాయిని కూడా పంపించి వెంటనే తాళాలు పట్టుకురమ్మని పంపించాను.

వీళ్ళు వెళ్ళి తాళాలు అడిగాక కూడా ఇల్లు చూడాలంటే ఇక్కడికివస్తే నేను ఇల్లు చూపిస్తానుగా తాళాలెందుకు నేను ఇవ్వనన్నాడట మేము తాళాలిచ్చినాయన.

” లేదండీ! మా అమ్మ గారు వెంటనే తాళం అడిగి తీసుకురమ్మన్నారు ఇవ్వండి ” అంటూ మా అమ్మాయి తాళం తీసుకు వచ్చేసింది.

మర్నాడు ఉదయాన్నే మా స్టూడెంట్ తండ్రి మా ఇంటికి వచ్చి ” ఎందుకండీ అనవసరంగా తాళాలు రాంనగర్ లో వాడి చేతికి ఎందుకిచ్చారు వాడు అసలు పరమ నీచుడు,

ఆ ఇంటిని చూడటానికి ఎవరిని రానీయటం లేదుట అని, చుట్టుపక్కల ఇల్లు అన్ని అమ్ముడు అయిపోతూవుంటే, ఎందుకిలామనదేందుకు ఇంకా అమ్ముడవటం లేదన్న విషయాన్నీ పట్టించుకోరా? ” అంటూ మమ్మల్ని మందలించాడు.

తాళం మా చేతికి రావటం, వారం లోగానే మా ఇల్లు అమ్ముడయిపోయి, పెళ్ళి పనులు ప్రారంభించాము. ఆలా మా జీవితాలలోకి బాబా ప్రవేశించాడు. పెళ్ళి ఏ ఆటంకం లేకుండా, మేము ఎటువంటి ఇబ్బంది పడకుండా జరిగిపోయింది.

The above telugu TEXT typed by : Mr. Sai Krishna (Active Devotee of Baba)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles