అప్పుడే పెళ్ళి వద్దనుకున్న నాకు, బాబా భక్తురాలిచ్చే వివాహం జరిపించిన బాబా వారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


వినయ్ కుమార్ గారి అనుభవములు మూడవ భాగం

నాకు పెళ్ళి చేయాలని మా వాళ్ళు అనుకున్నారు. నన్ను అడిగితే నాకు అప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు.

ఎందుకంటే మాకు ఇంటి పైన అప్పు ఉంది. బ్యాంకు లోన్స్ ఉన్నాయి. డబ్బుకి ఇబ్బందిగా ఉంది. అటువంటి సమయం లో పెళ్ళి అంటే ముందు పెళ్ళికి బోలెడు డబ్బు కావాలి.

పెళ్ళి అయినా దగ్గరనుండి మరింత ఖర్చులుంటాయి. కొంచెం అయ్యాక అయితే వచ్చే ఆమెకి కూడా కాస్త బాగుంటుందని నేను అనుకున్నాను.

ఇంట్లో అమ్మా నాన్న ఏది ఎలా అయినా ఉండనీ ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని పట్టుబట్టారు.

ఒక రోజు నేను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేటప్పటికి ఎవరో పెళ్ళి వాళ్ళు వచ్చారు. పిల్ల తండ్రి బాగా మాట్లాడాడని చాలా మంచివాళ్ళని కొల్లాపూర్ నుండి సంబంధం వచ్చిందని చెప్పి చూడరా అమ్మాయి చాలా బావుంది.

ఇదిగో ఫోటో చూడు అంటూ మా నాన్న ఒక స్టాంప్ సైజు బస్సు పాస్ పైన ఉంచిన ఫోటో నా చేతిలో పెట్టారు.

ఆ ఫోటో చూడంగానే నాకు చాలా కోపం వచ్చింది. ఆ అమ్మాయికి పెళ్ళి అంటే పెద్దగా ఇష్టం ఉన్నట్టు లేదు అన్నాను.

అదేంటిరా అలా అన్నావు అంది అమ్మ. లేకపోతే ఏంటమ్మా! ఈ ఫోటో, పెళ్ళి చూపులకి ఫోటో ఇస్తున్నాం అంటే ఎలాంటి ఫోటో ఇవ్వాలో తెలియని వాళ్ళతోటి మనకు సంబంధం ఏంటి?

అసలు ఈ పిల్లని నేను చేసుకోను కాక చేసుకోను అన్నాను. లేదురా మంచి సంబంధం అంటూ నాకు నచ్చచెప్పటానికి ప్రయత్నించారు.

అయినా నేను వినలేదు. ఆ తరువాత మరికొన్ని సంబంధాలు వచ్చాయి. ఆ ఊరి నుండే 2 సంబంధాలు వచ్చాయి.

ఒక అమ్మాయిని చూడాలని బయలుదేరాము. కానీ కొంత దూరం వెళ్లినాక మా నాన్న ఎవరికో ఫోన్ చేస్తున్నారు. నాకెందుకో అనుమానం వచ్చి ఎవరికీ నాన్న ఫోన్ చేసావు అని అడిగాను.

ఆ బస్సు పాస్ ఫోటో పంపించారే ఆ అమ్మాయిని చూడటానికి వెళుతున్నాము అన్నాడు నాన్న. నాకు బాగా కోపం వచ్చింది.

నాకా సంబంధం వద్దు అని చెప్పానుగా అయినా మళ్ళీ ఆ అమ్మాయిని చూపించడానికి తీసుకు వస్తున్నారా. నేనా అమ్మాయిని చేసుకోను గాక చేసుకోను అని చిందులు తొక్కుతున్నాను.

ఈ లోగా పెళ్ళి వాళ్ళ ఇల్లు వచ్చేసింది. వాళ్ళ ఇల్లు బాగా చిన్నగా ఉంది. 80 గజాలలో ఇల్లు కట్టుకున్నారు.

పెళ్ళి చూపులు మేడ మీద అరేంజ్ చేశారు. అక్కడ దాకా వచ్చాక ఆమ్మో పైకి ఎక్కాలా అంది అమ్మ. ఎందుకంటే అమ్మకి మోకాళ్ళ నొప్పులు.

అమ్మ నువ్వు పైకి ఎక్కలేవు ఇపుడైనా మించిపోయింది లేదు వెళ్లిపోదాము, పెళ్లి చూపులు అంటూ ఆ అమ్మాయిని పిలిపించి నువ్వు నాకు నచ్చలేదు అనటం బాగుండదమ్మా అంటున్నాను నేను,

ఏమోరా ఆ అమ్మాయిని స్వయంగా చూసాక అమ్మాయి నచ్చిందని చెబుతావేమో ఎవరికి తెలుసు అంది అమ్మ. మొత్తానికి అమ్మ మెట్లు ఎక్కింది. అమ్మాయిని పిలిపించారు.

చూసాను అంతే అప్పటిదాకా ఆ అమ్మాయిని అసలు చేసుకోను అన్న నేను పిల్లను చూసాక ఆ అమ్మాయిని తప్ప వేరెవరినీ చేసుకోను అని అనటం మొదలుపెట్టాను.

ఇంటికి వచ్చాక మా పెద్దమ్మ కూతురు ఒరేయ్ వాళ్ళేమి కట్నం కూడా ఇవ్వరు మరో సంబంధం చూద్దామంది.

పెళ్ళి అయ్యాక నువ్వు వాళ్ళింటికి వెడితే అల్లుడికి ఒక మంచం కూడా వేయలేనంత ఇరుకుగా ఉంది వాళ్ళ ఇల్లు. వద్దులేరా వేరే సంబంధం చూద్దాం అంది.

నేను ఫరవాలేదు ఆ అమ్మాయిని తప్ప వేరెవరినీ చేసుకోను అని తెగేసి చెప్పాను. ముహుర్తాలు పెట్టారు. పెళ్ళి అయిపోయింది. నా భార్య పేరు లావణ్య.

పెళ్ళి అయినా కొత్తలోనే మా అత్తగారింటికి వెళ్లినపుడు తెలిసింది. నాకు ఈ అమ్మాయితోనే పెళ్ళి ఎందుకు అయిందో,

అప్పటిదాకా చిందులు తొక్కి ఈ అమ్మాయిని నేను అస్సలు చేసుకోను అన్న వాణ్ణి ఆ అమ్మాయినే తప్ప వేరే చేసుకోను అన్నంతవరకూ ఎలా వచ్చిందో చూడండి.

నా భార్యకి మా అత్తగారు వాళ్ళు చాలా సంబంధాలు చూసారుట ఏ సంబంధమూ కుదరలేదుట. ఆ అమ్మాయి MBA చేసింది.

పాపం అతి కష్టం మీద ఒక సంబంధం కుదిరింది. ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఆ సంబంధం అవలేదు.

మా అత్తగారు దిగులుతో పక్కనే ఉన్న బాబా గుడికి వెళ్లి ఏం బాబా నీకు కొన్ని లక్షల మంది భక్తులు ఉన్నారు. నా పిల్ల మెళ్ళో తాళి కట్టడానికి నీ భక్తులలోంచి ఒకణ్ణి పంపించకూడదా? ఎందుకయ్యా మాకీ బాధ అని ఏడ్చిందట.

ఈ గురువారం నాడు ఆమె బాబా గుడిలో ఏడ్చింది. మరు గురువారం నాడు నేను పెళ్ళిచూపులలో వాళ్ళింట్లో వున్నాను.

వాళ్ళు మా ఇంటికి సంబంధం మాట్లాడటానికి వచ్చినపుడే మా ఇంట్లో బాబా ఫోటోలు చూసాక ఈ సంబంధం కుదిరిపోతుంది లావణ్యకి అనుకున్నారట.

వాళ్ళు అందుకే నాకు అప్పటిదాకా ఉన్న కోపం అమ్మాయిని చూడం గానే బాబాయే ఎగర గొట్టేసాడన్నమాట. మొత్తానికి మా పెళ్ళి అలా చేసాడు బాబా.

ఒక బ్యాంకు లో లోన్ ఉండగా మరో బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వరు. కానీ నా విషయం లో ఒక బ్యాంకు నుండి ఫోన్ వచ్చింది.

మీరు కనుక మీ లోన్ ని మీ నాన్న గారి పేరుకి మార్చుకుంటే మాకు లోన్ ఇవ్వటానికి ఎటువంటి అభ్యంతరం లేదు అన్నారు.

నేను బ్యాంకుకి వెళ్లి మాట్లాడాను. బ్యాంకు వాళ్ళు చెప్పినట్టు చేసాను. నాకు 11 లక్షలు లోన్ మంజూరు అయింది.

చిల్లరమల్లరగా వున్నఅప్పులు అన్నీ ఇచ్చేసాను. ఇంక అప్పుడు ఒక్క బ్యాంకు లోన్ మాత్రమే ఉంది.

The above miracle has been typed by: Shiva Kumar Bandaru.

వినయ్ కుమార్ గారి అనుభవములు నాల్గవ భాగం తరువాయి……

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles